పాత, క్రొత్త నిబంధనలు - part 2



"పాత"  మరియు  "క్రొత్త" నిబంధనల గూర్చిన సత్యము  2వ భాగము.


               ధర్మశాస్త్రము ద్వారా కాకుండా ప్రభువైన యేసు ద్వారా మానవాళిని రక్షించాలని జగత్తుపునాది వేయబడక మునుపే దేవుడు నిర్ణయించినాడు.

⭕ (హెబ్రీయులకు) 8:8-11
అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు ప్రభువు ఇట్లనెనుఇదిగో యొక కాలము వచ్చుచున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను క్రొత్తనిబంధన చేయుదును. అది నేను ఐగుప్తుదేశములోనుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమునవారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా, వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలై యుందురు.l వారిలో ఎవడును ప్రభువును తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరును నన్ను తెలిసికొందురు.


పూర్వ చరిత్ర :
బబులోను చేరపట్టబడినపుడు దేవుని నిబంధన మందసముకూడా చేరపటబడెను, వారు మరల తిరిగి ఎజ్రా సమయమున విడుదల అయ్యిరి కానీ నిబంధన మందసమును పోగొట్టుకొనెను...

యిర్మీయా 3:16
మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు -
◆ యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు, 
◆ అది వారి మనస్సు లోనికి రాదు, 
◆ దానిని జ్ఞాపకము చేసికొనరు, 
◆ అది పోయినందుకు చింతపడరు, 
ఇకమీదట దాని చేయరాదు; ఇదే యెహోవా వాక్కు. 


నిబంధన ఉండగానే జనులు యెహోవాతండ్రి మాట వినలేదు నిత్యము పాపము చేస్తూనే ఉన్నారు, ఇక నిబంధన మందసము పోయింది ఇక వారు చేయు పాపము ఆగునా?

అందుకే పరమతండ్రి ఈ నిబంధనను క్రొత్తగా వారి మనసులపై వ్రాయదలచాడు.. "వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును" ఇదే క్రొత్త నిబంధన.

క్రొత్త నిబంధన అనగానేమి?
క్రీస్తు చెప్పిన రెండు ఆజ్ఞలే క్రొత్తనిబంధన
మార్కు సువార్త 12:28-31
శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను. అందుకు యేసుప్రధానమైనది ఏదనగాఓ ఇశ్రాయేలూ, వినుము; 

మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ. 

రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను 

1️⃣ మొదటిది దేవుని ప్రేమించాలి ఇది మొదటి పలక నాలుగు ఆజ్ఞలకు సమానం

2️⃣ రెండవది పొరుగువానిని నిన్నువలె ప్రేమించాలి ఇది రెండవ పలక ఆరు ఆజ్ఞలకు సమానము

నిబంధన ఆజ్ఞలు అవే కానీ క్రీస్తు ప్రవేశపెట్టినవి క్రొత్త మార్గము... క్రొత్తగా వేరే కోణములో దారి చూపినడు.

క్రొత్త నిబంధన స్వభావము:-

 1️⃣  నిబంధన దేవుడే చేసాడు - యిర్మీయా 31:31

2️⃣ ఈ నిబంధన దేవునికిని ఇశ్రాయేలు, యూదా వారికిని మధ్య జరిగింది. యిర్మీయా 31.31

3️⃣ పాతనిబంధన 2 పలకలైతే ఈ నిబంధన ప్రధానమైన 2 ఆజ్ఞలు.
         మొదటిది -- 4 ఆజ్ఞలు దేవునికి (లుకా 10:27)
         రెండవది -- 6 ఆజ్ఞలు మానవునికి.(రోమా 13:8,9)

4️⃣ యేసుక్రీస్తు నిబంధనకు మధ్యవర్తి - హెబ్రీ 8:6

5️⃣ ఈ నిబంధన క్రీస్తు బోధతో ఆరంభమైనది - మత్తయి 17:5; హెబ్రీ 2:3

6️⃣ ఈ నిబంధనలో గల 2 ఆజ్ఞలు మనసులో ఉంచబడి హృదయములో వ్రాయబడినవి - హెబ్రీ 8:11

7️⃣ ప్రజలు తమ పాపముల నుండి విడిపింపబోవుటకు చేయబడిన నిబంధన - మత్తయి 26:28.

8️⃣ నిబంధన రక్తముతో చేయబడినది. - లుకా 22:20.

9️⃣ ఈ నిబంధన అనుసరిస్తే ఆశీర్వధములు - ఎపేసి 1:3

1️⃣0️⃣ ఈ నిబంధన అతిక్రమిస్తే దేవుని శిక్షకు పాత్రుడు.

1️⃣1️⃣ ఇది ఆత్మసంబంధమైన నిబంధన..

1️⃣2️⃣ అపోస్తులులు మరియు ప్రవక్తల రచనలు ఈ 2 ఆజ్ఞలను ఉల్లంఘించకుండా ఆధారముగా(మార్గము) ఉన్నవి..

1️⃣3️⃣ ఈ నిబంధన 27 పుస్తకముతో కూడినది, 
1. సువార్తలు : మత్తయి - యోహాను
2. చరిత్ర : అపోస్తుల కార్యములు
3. పత్రికలు : రోమియులు - యూదా
4. ప్రవచన గ్రంథము : ప్రకటన.


క్రొత్త, పాత నిబంధన మధ్య వ్యత్యాసము :-
O.T రాతి పలకల మీద రాయబడినది - 2 కోరింది 3:3-5
N.T మెత్తని హృదయం మీద రాయబడినది - 2 కోరింది 3:3-5

O.T నరహత్య చేయవద్దు - నిర్గమ 20: 13
N.T కోపడరాదు - మత్తయి 5:22

O.T వ్యభిచారం చేయవద్దు - నిర్గమ 20:14
N.T మోహపు చూపు చూడవద్దు - మత్తయి 5:28

O.T పరిత్యాగా పత్రిక ఇచ్చి భార్యను విడనడవచ్చు - మత్తయి 19:3-10
N.T భార్యను విడనడరాదు - మత్తయి 5:32

O.T ఒట్టు పెట్టుకొనవలెను - లేవి 19:12
N.T నీ మాట అవునట్టే అవును కాదంటే కాదు - మత్తయి 5:37

O.T కంటికి కన్ను పంటికి పన్ను - లేవి 24:20
N.T ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపాలి - మత్తయి 5:39

O.T పొరుగువారిని ప్రేమించి శత్రువును ద్వేషించవలెను - ద్వితి 7:1,2 లేవి 19:18
N.T నీ శత్రువుని ప్రేమించి నిన్ను హింసించు వారి కొరకు ప్రార్ధన చెయ్యి - మత్తయి 5:44.


క్రొత్త, పాత నిబంధన యొక్క పోలికలు :-
O.T దేవుడే చేసాడు - ద్వితి 5:2
N.T కూడా దేవుడే చేసాడు - యిర్మీయా 31:31.

O.T  మోషే దీనికి మధ్యవర్తి - ద్వితి 5:5
N.T క్రీస్తు దీనికి మధ్యవర్తి - హెబ్రీ 12:22,24.

O.T జంతువుల రక్తంతో  - నిర్గమ 24:8
N.T క్రీస్తు రక్తము - మత్తయి 26:27.

O.T ఇజ్రాయెల్ తో మాత్రమే చేయబడింది - 1 రాజు 8:9
N.T మనుషులందరికి ఉపదేశింపబడినది - మార్క్ 16:15.

O.T ఇశ్రాయేలు ధర్మశాస్త్రవిధులను గైకొనలి - ద్వితి 4:13,14
N.T క్రైస్తవులు క్రీస్తు అజ్ఞాపించిన వాటిని చేయాలి - మత్తయి 28:19-20.

O.T ఇది మరణకరమగు పరిచర్య - 2 కోరింది 3:9
N.T ఇది నీతికారణమగు పరిచర్య - 2 కోరింది 3:8,9.

O.T బౌతికమైన జన్మను బట్టి వారు ఇశ్రాయేలు - రోమా 9:3
N.T ఆత్మసంబంధమైన జన్మను బట్టి - రోమా 9:8.

O.T వీరి కుమారత్వానికి సున్నతి గుర్తు - ఆది 17:11
N.T ఆత్మ వరము ముద్రగా ఉంది - ఎపిసి 1:13.

O.T అనేక బలులు - హెబ్రీ 10:11
N.T క్రీస్తు ఒకే ఒక బలి - హెబ్రీ 9:28.

O.T ప్రతి పాపమును తీయలేదు - హెబ్రీ 10:11
N.T పాపము చేయకుండా చేయును.

O.T శరీరమును శుద్ధి చేయును - హెబ్రీ 9:13
N.T మనసాక్షిని శుద్ధి చేయును - హెబ్రీ 9:14.

O.T దాస్యమను కాడి - గలతి 5:1
N.T విడుదల కలిగిన స్వాతంత్రం - గలతి 5:1


ఇశ్రాయేలు విధిరూపకమైన ఆజ్ఞలగల ధర్మశాస్త్రము కోటివేయబడినది.
కొట్టివేయుట అంటే నిలిపివేయుట, నిరార్థకము చేయుట, ఆపివేయుట అనే అర్ధములు వచ్చును.

                      ◆ 2 కోరింది 3:14
                      ◆ ఎపిసి 2:14
                      ◆ కొలసి 2:13-14
                      ◆ రోమా 7:6
                      ◆ హెబ్రీ 7:18,19
                      ◆ హెబ్రీ 8:13
                      ◆ హెబ్రీ 10:9
                      ◆ రోమా 10:4
                      ◆ యోహాను 19:30


ధర్మశాస్తాం కోట్టివేయడానికి కారణం :-
1. దేనికిని సంపూర్ణ సిద్ధికలుగ చేయలేదు -
                                                      హెబ్రీ 7:18
2. లోపము గలిగినాది - హెబ్రీ 8:7
3. ఛాయా కలిగినది - హెబ్రీ 10:1 కొలసి 2:16.
4. ఒక ఆజ్ఞ మీరిన శాపగ్రస్థుడే - గలతి 3:10.


కొట్టివేయబడుచున్న నిబంధనను క్రైస్తవులకు ఎందుకు ఇవ్వబడినది :-
1. క్రీస్తును లోకమునకు తెలుపుటకు - గలతి 3:19
2. మనలను క్రీస్తు నొద్దకు నడుపుటకు - గలతి 3:24
3. పాపము ఏమిటి తెలియడానికి - రోమా 3:20,
                                           1 తిమోతి 1:8-11.
4. బోధ కలుగుటకు - రోమా 15:4
5. బుద్ధి కలుగుటకు - 1 కోరింది 10:11.
6. భక్తిహీనులకు దూస్తానంతములు ఉంచాడు- 2 పేతురు 2.6


రెండు నిబంధనలు కలిపి పాటిస్తే ?
★ మత్తయి 9:17
మరియు పాత తిత్తు లలో క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పెను.

★ రెండు నిబంధనల ఉపమనములు:-
               గలతి 4:21 - 5:4  


ఈ నిబంధనలో ప్రవేశం ఎలా?
క్రీస్తు క్రొత్త నిబంధనలో ఎలా ప్రవేశించాలో చాలా తేటగా చెప్పాడు..
● బాప్తీసము(ముంచబడుట) ద్వారా ఇందులో ప్రవేశము ఉంది..
● ఇందులో యుదుడు, గ్రీకుదేశస్థుడు, హిందు ముస్లిం అనే బేధము లేదు ఎవరైనా బాప్తీసము పొంది చేరవలెను.

అబ్రాహాముతో చేసిన వాగ్దానం :
ఆదికాండము 26:4: ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.

గలతియులకు 3:16: అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు.

నేడు క్రీస్తు సంఘము నుండి సువార్త వలన అనేకులు దేవునిని తెలుసుకుంటున్నారు..
ఇదే దేవుని సంకల్పము - రోమా 8:28-30

---
ప్రశ్న:?
మత్తయి సువార్త) 5:17,18
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.
ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
క్రీస్తు ధర్మశాస్త్రమును నెరవేర్చాడు
నెరవేర్చిన తరువాత దానితో పని ఏమి?
అందుకే దానిని ఎత్తివేశారు.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యిర్మీయా 31:31 లో క్రొత్తనిబంధన యూదావారితో, ఇశ్రాయేలు వారితోనే అన్నాడు కదా మరి మీరు సమస్త జనులకు అని దేని బట్టి చెప్తున్నారు?.

జవాబు:- సమాన ప్రవేశము ఉంది..
యెషయా 2:2: అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

యెషయా 42:1: ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.

అపో.కార్యములు 9:15: అందుకు ప్రభువునీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు.

రోమీయులకు 11:25: సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరు చున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

౼౼౼౼౼౼౼ ౦ ౼౼౼౼౼౼

మీ 
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:

Post a Comment