మనము అంటే ముగ్గురా?


మన అంటే ఏమిటి?

ఆది 1.26
ఆది 3:22
ఆది 11:7 
లో ఉన్న సందర్భము చాలా మంది "మన" అంటే తండ్రి కుమార పరిశుద్త్మ ముగ్గురు ఉన్నారు అనే మాయలో ఉన్నారు కానీ అసలు వాస్తవం తెలుసుకోడానికి బైబిల్ చదివే ప్రయత్నం చేయరు.

               పై వచనములు దేవత్వము అనే పేరుతో త్రిత్వము బోద్ధిస్తారు సరిగా గమనించినట్లైతే అది త్రిత్వమని అర్ధమవుతుంది. "మన" అని ఉంటే అక్కడ దేవుడు బహుళత్వం కలవాడు లేక ముగ్గురు ఉన్నారు అనే భావన ఉన్నట్టు బోధ చేయడం ప్రారంభిస్తారు.

"మన" అంటే తండ్రి కుమార పరిశుద్త్ముడు వీరు మాత్రమే మాట్లాడుకున్నారు కానీ దేవుడు దూతలతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని అందురు.
ముందుగా తెలుసుకోవాల్సినది "మన" అంటే 3 అనే అంకె కాదని అర్ధం చేసుకోవాలి..
మన అంటే ఇద్దరు ఆపై ఎక్కువమంది ఉంటారని అర్ధం చేసుకోవాలి..

వివరణ :-
బైబిల్ మొత్తములో మనము అంటే తండ్రి కుమార ఆత్మ అనుటకు ఎలాంటి రుజువు లేదు...

పరలోక దర్శనములో ఏ భక్తునికి కూడా తండ్రి కుమార ఆత్మ ఒక సమావేశం అయినట్టు కనపడలేదు...

దేవుడు ఎపుడు కూడా దూతలతోనే సమావేసమవుతునట్టు గ్రంధం తెలువుతుంది...
ఆ సందర్భములలో ఒక్కటే ఈ ఆదికాండము 1:26
దేవుడు - "మన" స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు "పలికెను".
చివరిలో  "పలికెను"  అనెను ఎవరితో పలికి ఉండొచ్చు? ఎవరితో పలికాడు అనేది ఆలోచన చేయాలి.
దేవుడు ఎవరెవరితో సంభాషణ చేయగాలిగాడు, ఎవరితో చర్చ చేస్తున్నాడు?

బైబిల్ నందు పరలోకములో దేవుడు చర్చ చేసిన సందర్భములు ఉన్నాయి.


                     1 రాజులు 22:19-23
మీకాయా యిట్లనెను - యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని అహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. 
అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి-నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా-ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను. 
అందుకతడు-నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన-నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.

★ ఇక్కడ దేవుడు తన దూతలతో పలకుతున్నాడు.. ఎలా చేస్తావ్ ఏమి చేస్తావ్ అని అడుగుతున్నాడు.. దూతలు ఈ విధముగా ఆ విధముగా అంటూ దేవునితో సంభాషించడం పైన చూడగలము..
అహాబు ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను పంపడనికి దేవుడు దూతలతో మాట్లాడుతున్నాడు,
దూతలు దేవునితో మాట్లాడుతున్నారు.. కానీ తండ్రి కుమార మాట్లాడినట్టు మనకు కనపడదు...


       యెషయా గ్రంథము 6:1-8
రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరా పులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను. వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాప మునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను. అప్పుడునేను ఎవని పంపెదను? " మా " నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేనుచిత్తగించుము నేనున్నాను నన్ను పంపు మనగా 

                 మా నిమిత్తము ఎవరు పోవును అను మాట దేవుడు ఎవరితో పలుకుతున్నాడు? దూతలతో పలుకుతున్నాడు, ఆ మాట యెషయా వినాడు కానీ తండ్రి కుమార ఆత్మ సంభాషణ కాదు..


✔️ పరలోకంలో దేవదూతలు యెహోవా సన్నిధిన కుడుకొనుటకు వచ్చెదరు. వారంతా ఒక సంగముగా కుడుకునట్టు మనం కింద చూడగలం. వారు చర్చించుకొనుటకు కుడి ఉన్నట్టు మనం చూడగలము..

✳ యోబు గ్రంథము 1:6 - దేవదూతలు "యెహోవా సన్నిధిని నిలుచుటకై"  వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను.
★ ఇక్కడ తండ్రి కుమార ఆత్మ ప్రస్తావన లేదు..


✳కీర్తనల గ్రంథము 89:5,6 - యెహోవా, ఆకాశవైశాల్యము నీ ఆశ్చర్యకార్యము లను స్తుతించుచున్నది "పరిశుద్ధదూతల సమాజములో"  నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి.
★ ఇక్కడ కూడా తండ్రి కుమార ఆత్మ ప్రస్తావన లేదు..


✳  యెబు1.6 - మింటను యెహోవాకు సాటియైనవాడెవడు? "దైవపుత్రులలో"  యెహోవా వంటివాడెవడు?
★ యేసు లాంటి కుమారుడు ఏడి అనే సంభాషణ లేదు..


✳ యోబు 15:8: నీవు "దేవుని ఆలోచనసభలో" చేరియున్నవాడవా?నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?


ఆది1.26 లో సందర్భము కూడా ఇలాంటిదే..
ఆది1.26 లో మనము అంటే బహుళత్వం కానీ, తండ్రి కుమార పరిశుద్త్మ కానీ, త్రియేకదేవుడు కానీ ఉన్నట్టు అలాంటి భావంతో " మనము " " మన " "మా " అనే దేవత్వపు భావన సూచిస్తున్నట్టు ఏ రచయిత పాతనిబంధనలో తెలపలేదు, చదవలేదు...
దేవుడు మరియు ఆయన దూతలతో సహా కార్యము చేయుచుండుటను మన అనేది సూచిస్తుంది. 
                                   👇
దేవదూతలు దేవుడు సృష్టిని సృష్టించములో పాలుపొందిరి వారు సృష్టికర్తలు కారు కానీ, దేవుడు సృష్టి చేయడములో జయధ్వనులు చేసి సంతోసించిరి.
యోబు గ్రంథము 38:4-7
నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము. నీకు తెలిసిన యెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు " దేవదూతలందరును " ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?
నేను ఎందుకు అలా చెప్తుననంటే..
1. దూతలు సృష్టి సమయములో ఉన్నారు అంటే మనిషి కన్నా ముందే ఉన్నారు..
2. దేవుడు చాలా సమయాలలో చర్చలు చేసిన విధానము చూసాము...
3. మోషే రాసె సమయానికే యోబు గ్రంధములో దూతల సంఘటన జరిగింది..
4. అందువలన దూతలు అని చెప్పే అవకాశ0 ఉంది.

Truth for today (biblecourses.com) ఆదికాండము 1 book నుండి వారి వివరణ చూడండి..


------------------------------
★ Genesis(ఆదికాండము) 1:27
దేవుడు " తన " స్వరూపమందు నరుని సృజించెను; " దేవుని " స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
■■ తన అంటే ముగ్గురు కాదు ఒక్కడే అని అర్థము..
దేవుని స్వరూపము అన్నాడు కానీ దేవుళ్ల స్వరూపము అనలేదు. మన అనడాని ముగ్గురు స్వరూపమును కలగలిపి నరుని చేశాడని అర్ధమా?.


★ Genesis(ఆదికాండము) 3:22,23
అప్పుడు దేవుడైన యెహోవాఇదిగో మంచి చెడ్డ లను ఎరుగునట్లు, ఆదాము " మనలో " ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని " పంపివేసెను."
■■ నరుడు మనలో ఒక్కని వంటివాడు అవగలడా? 


★ Genesis(ఆదికాండము) 11:6,7,8
అప్పుడు యెహోవాఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించి యున్నారు. ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు. గనుక " మనము " దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి.
■■ మనము దిగిపోయి అంటే తండ్రి కుమార పరిశుద్త్మ ముగ్గురు దిగి వచ్చారనా దాని అర్ధమా?

Note :-
రూపాంతర కొండ మీద ముగ్గురు ఒక విషయమై చర్చించినారు వారు మోషే, ఏలీయా, యేసుక్రీస్తు..
ఇలాంటి సందర్భాలు తండ్రి కుమారుడు ఆత్మ ఏదైనా విషయమై చర్చించుకున్న సందర్భములు ఏమైనా ఉన్నాయా? ఉంటే చూపించండి.
మేము అంటే ముగ్గురు అని రాదు మేము/మనము అంటే ఇద్దరు ఆ పై అని అర్ధం....
మనము అంటే ముగ్గురు అనే ఆధారము బైబిల్ లో ఏది లేదు..

ముగింపు:-
మనము మన అని ఉనంత మాత్రాన ముగ్గురే ఉన్నారు అనే ఒక కచ్చితమైన నిర్ణయానికి రాకూడదు...
దేవుడు దూతలతో నిర్ణయాన్ని తీసుకున్నట్టు చర్చ చేస్తున్నట్టు మనం చూడగలము...

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:

Post a Comment