సృష్టికర్త ఒక్కడా? లేక ముగ్గురా?

        


     ⭕ సృష్టికర్త ఎవరు? ⭕

1. దేవుడు అంటే అర్థం.
2. దేవుని సంకల్పములో భౌతిక సృష్టి.
3. మనుషుల కొరకు భౌతిక సృష్టి అందులోని సమస్తము
4. సమస్తము దేని చేత చేసెను?
5. భక్తుల మాటలలో సృష్టికర్త ఎవరు?

--------------------------------------–-–--

1️⃣ దేవుడు అంటే అర్ధo : 
సృష్టికర్త మరియు పాలకుడు ఒక సుప్రీం.


బైబిల్ లో సృష్టికర్తలు లేరుకాని సృష్టికర్త మాత్రమే ఉన్నాడు..

అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకుమార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్‌. - రోమీయులకు 1:25

☎️ లోకములో అపోహలు ;-
- ముగ్గురు సృష్టిని చేశారు వారి ప్రేమయం లేకుండా ఏమి సృజించబడలేదు.

- తండ్రి ఆలోచించాడు, క్రీస్తు ఇంజినీర్ పని చేసాడు పరిశుద్త్మ కూలిగా ఇలా ముగ్గురు సృష్టి చేశారు.

- దేవుడు ముందు క్రీస్తును సృష్టించి క్రీస్తుతో సృష్టి చేయించాడని.



 2️⃣  దేవుని సంకల్పంలో "భౌతిక సృష్టి" ఉద్దేశ్యము :-

1కోరింధి 15:46 ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది.

సంకల్పములో భౌతిక సృష్టి చేయాలనే ఆలోచన దేవునిది(యెహోవాది) మాత్రమే ఎవరి ప్రమేయము లేదు,- ప్రభువు(యెహోవా) మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? - (రోమ 11:34) ఎవరు కూడా ఆయనకు సలహా ఇవ్వలేదు. తనలో తాను నిర్ణయించుకొనిన ఏర్పాటును బట్టి దేవుడు చేసేను. - ఎపిసి 1.10


దేవుడు సంకల్పించిన రెండు సంగతులు:-

1. తనకు కుమారులుగా తన కోసం నిర్ణయించుకొనుట.

2. దేవునికి కుమారుడగు క్రీస్తు అందరిలో జేస్తుడగుట.(రోమా 8:28,29)


➡️ ఎపిసి 1:3-12 వచనములు తనలో తాను నిర్ణయించుకొనిన సంగతులను తెలియచేయును..

◾ దేవుని సంకల్పము నెరవేరలంటే మనుషులు కావాలి.

◾ ఆ మనుషులు బ్రతకాలంటే వారికొఱకు వారికి భౌతిక సృష్టి కావాలి.

దేవుని కోసము మనుషులు, మనుషుల కోసము భౌతిక సృష్టి రెంటినీ దేవుడే చేసాడు.
అదియేలాగో ఈ క్రింద చూద్దాము.


3️⃣.  మనుషుల కొరకు భౌతిక సృష్టి అందలి సమస్తమును దేవుడే(యెహోవా తండ్రి) చేసాడు. - ఆది 1:1-31.

◆ యెషయా గ్రంథము 42:5 - ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

◆ యెషయా గ్రంథము 44:24 - గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను

◆ యెషయా గ్రంథము 45:11,12
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా? భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని.

◆ యెషయా గ్రంథము 48:13 - నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును.

◆ యెషయా గ్రంథము 51:13 - బాధపెట్టువాడు నాశనము చేయుటకుసిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?

◆ కీర్తనల గ్రంథము 8:3,4 - నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?

◆ కీర్తనల గ్రంథము 19:1 - ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.

◆ జెకర్యా 12:1 - దేవోక్తి ఇశ్రాయేలీయులనుగూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా

◆ సామెతలు 8:29 - జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు

◆ యిర్మీయా 32:17 - యెహోవా, ప్రభువా సైన్య ములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధికబలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు.

◆ కీర్తనల గ్రంథము 100:3 - యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.

◆ నిర్గమకాండము 20:11 - ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.

◆ కీర్తన 102:25 - ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే.

◆ యెషయా గ్రంథము 64:8 - యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.

◆ 1దినవృత్తాంతములు 29:11 - యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.



4️⃣. సమస్తము ఎలాగూ చేసాను?
చాలా మంది సమస్తమును దేవుడు యేసుక్రీస్తు అనే వ్యక్తి చేత చేయించాడు అని కొన్ని అపోహలు ఉన్నాయి. ఏది వాస్తావమో పరిశీలన చేద్దాము..

              ఆయన వాక్కు చేత చేసెను..
                      ★ వాక్యము
                      ★ ఆజ్ఞ
                      ★ పలకుట
                      ★ మాట
                      ★ సందేశం
                      ★ వాక్కు
➡️➡️ పైవన్ని ఒక్కటే అర్ధం ఇచ్చును.

★ 2పేతురు 3:5 - ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.
గమనిక :- వలన'కు ద్వారా'కు తేడా గమనించండి.

★ ఆదికాండము 1:3 - దేవుడు వెలుగు కమ్మని "పలుకగా" వెలుగు కలిగెను.

★ కీర్తనల గ్రంథము 33:6,9 - యెహోవా "వాక్కు చేత" ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను.
ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను.

★ హెబ్రీయులకు 11:3 - ప్రపంచములు దేవుని "వాక్యమువలన" నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింప బడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.

★ కీర్తనల గ్రంథము 147:18,19 - ఆయన "ఆజ్ఞ ఇయ్యగా" అవన్నియు కరిగిపోవును ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును,
ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను.

★ యెషయా గ్రంథము 45:12 - భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని.

★ కీర్తనలు 147:15  భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును.

★ 2పేతురు 3:5 - ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు "దేవుని వాక్యమువలన" కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.

★ యాకోబు 1:18 - ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్య వాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.


సృష్టికర్త ఒక్కడే ఆయనే యెహోవా తండ్రి..
ఆయనే సమస్తము చేసెను, అంతేకాని ముగ్గురు సృష్టికర్తలు లేరు ముగ్గురు సృష్టిని చేయలేదు.


5️⃣ కొందరి భక్తుల సాక్షము ద్వారా సృష్టికర్త ఎవరో చూద్దాం :

● అబ్రాహాము మాటలలో - ఆది 14:23
● ఇస్సాకు మాటలలో - ఆది 24:4
● మోషే మాటలలో - కీర్తన 90:1-2
● దావీదు మాటలలో - కీర్తన 8:3
●  ఆమోసు మాటలలో - ఆమోసు 9;6
● యోబు మాటలలో - యోబు 26:7
● యేసుక్రీస్తు మాటలలో - లుకా 10:21, మత్తయి 19:4, 11:25.
● పౌల్ మాటలలో - అపో 14:15
● యాకోబు మాటలలో - యాకోబు 1:18
● 24గురు పెద్దల మాటలలో - ప్రకటన 4:11
● యెహోవా తండ్రి మాటలలో - యెషయా 44:24

1 కొరింథీయులకు 8:6a ➔
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయన "నుండి" సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము.
■ ఆయన నుండి అని ఉంది కాని వారి నుండి అని లేదు గమనించండి..

1కోరింథీయులకు 11:12: స్త్రీ పురుషునినుండి ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగియున్నవి.
■ సమస్తము దేవుని మూలముగా కలిగింది కానీ దేవుళ్ల మూలముగా కలగలేదు గమనించండి.

సృష్టికర్త ఒక్కడే ఆయనే తండ్రి సమస్తము ఆయన నుండి ఆయన వాక్కుచేత సృజించబడెను, ఆయన మూలముగా సంస్తమైనవి కలిగినవి.



సందేహము:-
అదేంటండి యేసుక్రీస్తు సృష్టి చేసాడుగా ఇదిగో వచనములు అంటూ ఈ క్రింది విధముగా చూపుతారు..

★ కొలస్సీయులకు 1:16: ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.

★ యోహాను సువార్త 1:1,2,3
1.ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
2.ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
3.కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.

★ హెబ్రీయులకు 1:10-12 మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.

★ 1కోరింథీయులకు 8:6: ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.

ఈ వచనములలో ఎక్కడైనా యేసుక్రీస్తు సృష్టి తను చేసినట్టు ఉందా?? సరిగా ఆలోచన చేయండి..
కలిగెనుసృజింపబడెను అని ఉంటే దాని అర్ధం తను చేశాడని బావమా?
సమస్తమును ఆయన మూలముగా కలిగెను అంటే ఎవరు కలిగించారు? ఇది ఆలోచన చేయాలి. ఈ క్రింది వచనము ద్వారా గ్రహించగలరు.
హెబ్రీయులకు 1:1-2
పూర్వకాలమందు నానాసమయములలోను(మూలభాషలో-నానాభాగములుగాను) నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను(మూలభాషలో-యుగములను) నిర్మించెను

★ ఇక్కడ ప్రపంచములు ఎవరు నిర్మించారు యేసుక్రీస్తు ద్వారా యెహోవా తండ్రినే నిర్మించాడు..

★ యేసుక్రీస్తు తను సృష్టి చేశాడని తను ఎక్కడ చెప్పలేదు, యేసుక్రీస్తు సృష్టి చేసిన ఒక్క ఆధారము కూడా బైబిల్ లో లేదు..
            పైగా యేసుక్రీస్తు విశ్వాసము ఏమిటంటే?
- ఆయన సృజించినవాడు అని చెప్తున్నాడు..
మత్తయి 19:4: "ఆయన(యెహోవాతండ్రి) సృజించిన వాడు" ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీని గాను సృజించెననియు.
మార్కు 13:19: అవి శ్రమగల దినములు; "దేవుడు సృజించినసృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగ లేదు, ఇక ఎన్నడును కలుగబోదు.

★ యేసుక్రీస్తును ఎవరు పుట్టించారు? యెహోవానే కదా యేసుక్రీస్తు సృష్టికర్తఐతే ఆయన తనంత తనే పుట్టాలికాని ఇంకొకరి ప్రమేయం దేనికి?
యేసుక్రీస్తును చనిపోయిన తరువాత ఆయనను లేపింది ఎవరు సృష్టికర్తయిన యెహోవాతండ్రినే కదా.
"సృష్టికర్త ఒక్కడే ఆయనే యెహోవా మనకు తండ్రి యేసుక్రీస్తుకు తండ్రి"

ఒక ఉదాహరణ :-
బైబిల్ class పేటమనుకోండి speakers, chairs, బోజనమలు, ఇవన్ని ఎవరిని బట్టి కలిగాయి? రాబోయే ప్రసంగికుడి కోసమే కదా. అలానే దేవుడు క్రీస్తును బట్టి ఆయన సంఘము కోసము ఈ Erangelmants చేసాడు..


ముగింపు :-
➡️ సృష్టిని ఎంతమంది చేశారు?
ఒక్కడే..

➡️ సృష్టి ఎవరు చేశారు?
యెహోవా తండ్రి..

➡️ సృష్టి ఎందుకు చేసాడు?
దేవుడు చేసిన నరులు బ్రతికేందుకు వారికి నివాసయోగ్యముగా..

➡️ సృష్టి ఎలా చేసాడు?
యెహోవా తండ్రి తన వాక్కు(ఊపిరి) చేత..
2పేతురు 3:5: ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.


-------------- ౦ --------------

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:

Post a Comment