సామెతలు 8 అధ్యయములో ఉన్నది జ్ఞానమా లేక యేసుక్రీస్తునా?


సామెతలు 8 అధ్యయములో ఉన్నది జ్ఞానమా లేక యేసుక్రీస్తునా?

Strong's h2451 - హెబ్రీలో
- Lexical: חָכְמָה
- Transliteration: chokmah
- Part of Speech: Noun Feminine
- Phonetic Spelling: khok-maw'
- Definition: wisdom.
- Origin: From chakam; wisdom (in a good sense).

Strong's g4678 - గ్రీకులో
- Lexical: σοφία
- Transliteration: sophia
- Part of Speech: Noun, Feminine
- Phonetic Spelling: sof-ee'-ah
- Definition: wisdom, insight, skill (human or divine), intelligence.
- Origin: From sophos; wisdom (higher or lower, worldly or spiritual).

జ్ఞానము అంటే పొగుచేసుకున్న సమాచారము అని అర్థము. క్రోత్త విషయలను తెలుసుకోవడము, సరైన సమయములో యుక్తిగా ప్రవర్తించడం.



సామెతలు 8:22-30
పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. "

                ఈ వచనములు BOUI వారు మరియు మరికొందరు పై వచనములను తీసుకుని వాటిని యేసుక్రీస్తుకు అన్వయింపచేస్తారు,
యేసుక్రీస్తు సృష్టికి ముందు పుట్టాడు అని, పుట్టి సృష్టి చేశాడని, యేసుక్రీస్తు కూడా సృష్టికర్త అని, ఆయన దేవుడు అని చెప్పుదురు..

             కొని క్రీస్తుసంఘములు క్రీస్తు అనాదిలో ఉన్నాడు ఆయనకు పుట్టుక లేదు తండ్రివలె సమాన వయస్కుడు అందురు కానీ ఈ BOUI సోదరులు మాత్రం క్రీస్తు ముందు పుట్టి తరవాత సృష్టిని చేసాడు అందురు. ఏది సత్యం అనేది తెలుకోవాలి అంటే గ్రంధాన్ని అర్ధం చేసుకుంటూ చదవాలి...


వివరణ:-
1. ఇది యేసుక్రీస్తును గూర్చిన వచనములు కావు..
లూకా సువార్త 24:44 - అంతట ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను.
1. ధర్మశాస్త్రము
2. ప్రవక్తల గ్రంథములు
3. కీర్తనల గ్రంధము
వీటిలోనే క్రీస్తును గూర్చిన సమాచారము ఉంటుందని స్వయాన యేసుక్రీస్తు ప్రభువు తన శిస్యులకు తెలియపరచాడు...

2. సొలొమోను ప్రవక్త కాదు.
సామెతలు, ప్రసంగి, పరమగీతము ప్రవక్తల గ్రంథములు కావు. అవి జ్ఞాన గ్రంథములు..

3. సామెతల గ్రంధములో వ్రాయబడినవి ప్రవచనాలు కావు. ఎందుకంటే క్రొత్త నిబంధన గ్రంధములలో లేదా పత్రికలలో ఎక్కడ కూడా ఒక వచనము కూడా క్రీస్తు విషయములో నెరవరినట్టు సువార్తలు, గ్రంథములు, పత్రికలు తెలియపరచలేదు..

4. సొలొమోను రాజునే కానీ ప్రవక్త కాదు ఆయన జ్ఞాని, ఆయన రాసిన సామెతలు ఎలాంటివి అంటే :
సామెతలు 1:1-4
1.దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొ మోను సామెతలు.
2.జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును
3.నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును
4.జ్ఞానములేనివారికి బుద్ధి కలిగించుటకును యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు.

5. ఇందులోని మాటలు/సమాచారము ఒక జ్ఞాని ఉపదేశం చేస్తే ఎలా ఉంటుందో అలా అలంకరముగా ఉంటుంది.. 8 అధ్యయములో జ్ఞానాన్ని వ్యక్తీకరించాడు, 9:13 నుండి బుద్ధిహీనతను వ్యక్తీకరించాడు.. ఈలాగు గుణములను ఈ జ్ఞాని వ్యక్తీకరించాడు. ఇలా గ్రంధములో వ్యక్తికరించిన సందర్భములు చాలా ఉన్నాయి...
మరణమును వ్యక్తీకరించాడు..
       ➡️ 1 కొరింథీయులకు 15:55 - ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?
       ➡️ నిబంధనలను వ్యక్తీకరించాడు..
గలతియులకు 4:24: ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు.


సామెతలు 8 అధ్యాయము యొక్క వివరణ :-
సామెతలు 8:1
జ్ఞానము ఘోషించుచున్నది
వివేచన తన స్వరమును వినిపించుచున్నది
జ్ఞానము యేసుక్రీస్తు ఐతే వివేచన ఎవరు?
వివేచనకు నోరు ఉంటుందా స్వరము వినిపించుటకు.

                       ---------------------

సామెతలు 8:1-4
1.జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది
2.త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను అది నిలుచుచున్నది
3.గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది 
4.మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను.

యెషయా గ్రంథము 42:1,2
ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.
అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు.

             యెషయా గ్రంధములోది క్రీస్తు గురించినదేగా మరి సామెతలులో ఎందుకు విరోధముగా ఉన్నది..
సామెతలు లో ఉన్నది జ్ఞానము గురించినదే కానీ క్రీస్తు గురించినది కాదు.

----------------------

సామెతలు 8:15
నావలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమునుబట్టి పాలనచేయుదురు.
యేసుక్రీస్తు వలన రాజులు ఎలుతారా ఎలా? అన్య రాజులను ఇశ్రాయేలు మీదకు నడిపిస్తున్నది యేసుక్రీస్తున్నా?

------------------------

సామెతలు 8:21
నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును. 

యేసుక్రీస్తు ఆస్తికర్తలుగా చేస్తాడా?
నిధులను నింపుతాడా?
మరెందుకు యేసుక్రీస్తు ధనము గురించి ఇలా అంటున్నాడు?
🍊 మత్తయి సువార్త 6:19 - భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు;
🍊 మత్తయి సువార్త 19:23 - యేసు తన శిష్యులను చూచిధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

         కాబట్టి సామెతలు 8 లో ఉన్నది జ్ఞానము దానిని సొలొమోను వ్యక్తికరించడే తప్పా యేసుక్రీస్తు అనడానికి ఎలాంటి ఆధారము లేదు..

యేసుక్రీీస్తునే ఆ జ్ఞానము అయితే ఆయన జ్ఞానమందు ఎదగవల్సిన అవసరము లేదు.
లూకా 2:52 - యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను.


ముగింపు:-
1. సామెతలు 8 లో ఉన్నది కేవలం జ్ఞానమే కానీ క్రీస్తు అనే వ్యక్తి కాదు.

2. సొలొమోను ప్రవక్త అనుటకు ఎటువంటి ఆదరములు లేవు.

3. సామెత 8 లో జ్ఞానము అనే గుణమును వ్యక్తీకరించాడు జ్ఞాని సొలొమోను.

4. క్రీస్తుకు సామెత 8 కి ఎలాంటి సంబంధము లేదు..

5. జ్ఞానము అనేది వ్యక్తి కాదు....


మీ
సహోదరుడు
Brother Suresh
9581881880

No comments:

Post a Comment