నరుడు నేల మంటితో చేయబడ్డాడా ?
చాలామంది నమ్మేది ఇదే నరుడు మట్టి నుండి వచ్చినవాడే అని అరచేతిని లేదా అరికాలును రుద్దితే మట్టి వస్తుంది. మాత గ్రంధాలు ఎలా చేపిన బైబిల్ మాత్రం వాస్తవం చెపినది, సైన్స్ లో తేలిన వాస్తవం కూడా ఇదే..
నేలమంటిలో -
ఇనుము (32.1%),
ఆక్సిజన్ (30.1%),
మెగ్నీషియం (13.9%),
సల్ఫర్ (2.9%),
నికెల్ (1.8%),
కాల్షియం (1.5%),
అల్యూమినియం (1.4%);
ఇంకా అనేక మూలకాలున్నాయి.
ఇనుము (32.1%),
ఆక్సిజన్ (30.1%),
మెగ్నీషియం (13.9%),
సల్ఫర్ (2.9%),
నికెల్ (1.8%),
కాల్షియం (1.5%),
అల్యూమినియం (1.4%);
ఇంకా అనేక మూలకాలున్నాయి.
అలాగే మానవ శరీరం దాదాపు 99% ఆరు ముఖ్యమైన మూలకాలతో రూపొందించబడింది. అవి ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నత్రజని, కాల్షియం మరియు భాస్వరం.
ఈ ముఖ్యమైన మూల పదార్థాలనన్నిటిని " నేల మంటితో " చేయబడిన మానవ శరీరంలో కనుగొనవచ్చు.
ఒక వ్యక్తి శరీరం 65 శాతం ఆమ్లజని, 18 శాతం బొగ్గు, 10 శాతం ఉదజని, 3 శాతం నత్రజని, 1.5 శాతం సున్నం, 1 శాతం భాస్వరము, మిగిలింది వేరే మూలపదార్థాలతో తయారు చేయబడింది అని శాస్త్రవేత్తలు వివరణ ఇస్తున్నారు.
బైబిల్ నందు నరుడు ఎలా చేయబడ్డాడో వివరంగా ఉంది.
★ ఆది 2:7 దేవుడైన యెహోవా "నేలమంటితో" నరుని నిర్మించి
దేవుడు కొందరిని మట్టితో , కొందరిని బంగారంతో చేయలేదు.
★ ప్రస 3:20 సమస్తము " మంటిలో " నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.
★ ప్రస 12:7 "మన్నయినది" వెనుకటివలెనే మరల భూమికి చేరును.
★ ఆది 3:19 " నేలనుండి" నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.
★ దేవుని దృష్టిలో మనం ధూళివలే ఉన్నాము.
యెష 40:15 జనులు త్రాసుమీది "ధూళివంటివారు" .
కావున ఎవరూ ఎక్కువ కాదు తక్కువ కాదు.
★ కీర్త 103:14 మనము "మంటి వారమని " ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.
మనము యెహోవానే దేవుడు అని తెలుసుకోవాలి ఎందుకంటే మనలను పుట్టించేది ఆయనే కదా!
యెహోవాతండ్రి ఇచ్చిన దేహముతో ఆయనను మహిమ పరచాలి -1కోరింథీయులకు 6:20: విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
దేహముతో చేసే ప్రతి పాపము తీర్పుకు వచ్చును..
2కోరింథీయులకు 5:10: ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
1

No comments:
Post a Comment