శోధనల తర్వాత సువర్ణమే!


🔥శోధనల తర్వాత సువర్ణమే!

శ్రమలు, పరిపూర్ణత ఒకదానివెంట ఒకటి నడుస్తాయి. అవి ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ, విభజింప శక్యముకానివిగా ఉంటాయి. ప్రతీ పొడవైన చీకటి సొరంగం తరువాత, తేజోమయమైన వెలుగుంటుంది. అదే విధంగా సుదీర్ఘమైన శ్రమలు విశ్వాసిని పరిపూర్ణతయనే గురివైపుకు నడిపిస్తాయి.

💥కంసాలి చేతిలో బంగారం పరిశుద్ద పరచాబడాలంటే అది నిప్పులకొలిమిలో మండాల్సిందే!
💥కుమ్మరివాని చేతిలోని బంకమన్నుకు ఒక రూపం రావాలంటే అది కుమ్మబడాల్సిందే, కాల్చబడాల్సిందే!
💥కొయ్యకు ఒక రూపం రావాలంటే రంపంతో కోయబడాల్సిందే, ఉలితో చెక్కబడాల్సిందే!
💥వజ్రం ప్రకాశించాలంటే అది నూరబడాల్సిందే!
💥రాయి శిల్పంగా మారాలి అంటే అది సుత్తి దెబ్బలు తినాల్సిందే!
💥నీవు పరిపూర్ణతలోనికి చేరాలంటే శ్రమ అనుభవించి తీరాల్సిందే.

💮 శ్రమలు విధేయతను నేర్పిస్తాయి:

శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.  -హెబ్రీ 5 : 7-9


💮 శ్రమ లేకుండా కిరీటం లేదు.

శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. (యాకోబు ‪1 : 12‬)

నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును. -యోబు 23:10

💮 శ్రమ లేకుండా ఘనత లేదు.

నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది  గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణ మగును.
    -1 పేతురు 1 : 7

శ్రమలే నిత్యజీవానికి చేర్చే మార్గాలు. శ్రమపడడానికి యిష్టంలేదు అంటే? నిత్యజీవపు తలుపులు మనచేతులతో మనమే మూసివేస్తున్నట్లు. శ్రమలయందు అతిశయిస్తూ, శ్రమలలో ఆయన కృపకొరకు కనిపెట్టెదము. శోధనతోపాటు, సమాధానాన్ని కూడా ఏకకాలంలో అనుభవించడం దేవునిపిల్లలముగా మనకే సాధ్యం! అది నీకే సాధ్యం!

యెహోవా గుడారంలో ఆతిధ్యం పొందేదెవరు?



♻️ యెహోవా గుడారంలో ఆతిధ్యం పొందేదెవరు?♻️

యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?

యథార్థమైన ప్రవర్తన గలిగి నీతిననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. (కీర్తనలు 15:1,2)
   
మన ఇంటికి అతిధులు వస్తున్నారంటే వారికి మనం చేసే సత్కారాలు ఎట్లా ఉంటాయో? వేరే చెప్పనవసర్లేదు. అతిధులు మన ఇంట్లో వుండేది అతి తక్కువ సమయమే. అయినా,ఆ సమయంలోనే, మనకు వున్నంతలో వారిని సంతోషపరచి, గౌరవముగా పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాము. వాటిని "అతిధి మర్యాదలు" అంటాము.

దేవుని ఇంటిలోనే, దేవుని చేత అతిధి సత్కారాలు పొందడం అంటే ఊహించగలమా? సాధ్యమేనా?  అవును!! సాధ్యమే! అదెట్లా?
1. యదార్ధ మైన ప్రవర్తన కలిగి యుండాలి.
2. నీతిని అనుసరించాలి.
3. హృదయ పూర్వకంగా నిజం మాట్లాడాలి.

♻️ యదార్ధ మైన ప్రవర్తన అంటే ?
🔹మాటలలో యధార్ధత,
🔹చూపులలో యధార్ధత
🔹తలంపులలో యధార్ధత
🔹క్రియలలో యధార్ధత.

♻️ నీతిని అనుసరించాలి:
నీతి అంటే? ఆయనను నమ్మడమే నీతి. ఆయనను నమ్మి, అనుసరించాలి. “నీతి ప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి” 1 కొరింది 15:34

♻️ హృదయ పూర్వకంగా నిజం మాట్లాడాలి:

మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. (ఎఫెస్సి 4:25) ఎందుకంటే? ఆయనే "సత్యం". ఈ విధంగా జీవించినట్లయితే, ఆయన ఇంటిలోనే నీవు ఆతిధ్యం పొందగలవు. ఈలోకంలో నీవు అనుభవించే అతిధి సత్కారాలు తాత్కాళికమే. కాని, ఆయన ఇంటిలో పొందే సత్కారాలు శాశ్వతం.

🔅అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడుతన పొరుగువానిమీద నింద మోపడు. (కీర్తనలు 15:3)
   
ఎవరయితే?
🔹యదార్ధ మైన ప్రవర్తన కలిగి,
🔹నీతిని అనుసరిస్తూ,
🔹హృదయ పూర్వకంగా నిజం మాట్లాడుతున్నారో?

అట్టి వారు,
🔹నాలుకతో కొండెములాడరు.
🔹తన చెలికానికి కీడు చేయరు.
🔹తన పొరుగువానిమీద నిందమోపరు.

♻️నాలుకతో కొండెములాడరు:

ఒక వ్యక్తి నీపైనగల నమ్మకంతో వారి విషయాలు నీతో పంచుకున్నప్పుడు, వారిని గురించి ప్రార్ధించు. అంతేగాని, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, వాటికి నాలుగు జోడించి వారిని బజారు పాలుచెయ్యొద్దు. “లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్య మును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;” (నిర్గమ 23:1)

♻️ తన చెలికానికి కీడు చేయరు:

నీ స్నేహితులకు, నీ పొరుగు వారికి మేలు చెయ్య గలిగితే తప్పకుండా చెయ్యి. ఒకవేళ మేలు చెయ్యలేకపోయినా, మాటలు ద్వారా గాని, చేతలు ద్వారాగాని కీడు తలపెట్టే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. "నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను" (మార్కు 12:31) ఈ ఆజ్ఞను గైకొనినట్లయితే? ఇక కీడు చేసే ప్రసక్తే లేదు.

♻️ తన పొరుగువానిమీద నింద మోపరు:

నీ పొరుగు వారు చెయ్యని వాటిని వారే చేసినట్లు నీవు ఊహించుకొని , వాటిని వారిమీద రుద్ది మానసికంగా వారిని క్షోభపెట్టే ప్రయత్నం చెయ్యొద్దు. వారిని నిందించవద్దు.
ఇట్టి రీతిగా ఎవరయితే?
🔹యదార్ధ మైన ప్రవర్తన కలిగి,
🔹నీతిని అనుసరిస్తూ,
🔹హృదయ పూర్వకంగా నిజం మాట్లాడుతున్నారో? వారు నిత్యమూ దేవుని ఇంటిలో ఆతిధ్యము పొందగలరు.

🔅అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. (కీర్తనలు 15:4)
     
ఎవరయితే?

🔹యదార్ధ మైన ప్రవర్తన కలిగి,
🔹నీతిని అనుసరిస్తూ,
🔹హృదయ పూర్వకంగా నిజం మాట్లాడుతున్నారో?

అట్టి వారు,
🔹నాలుకతో కొండెములాడరు.
🔹తన స్నేహితునికి కీడు చేయరు.
🔹తన పొరుగువానిమీద నింద మోపరు.

అంతే కాకుండా,
🔹దుష్టత్వము జరిగించే వారిని అసహ్యించు కుంటారు.
🔹దేవునియందు భయభక్తులు గల వారిని గౌరవిస్తారు.
🔹మాటయిస్తే? నష్టమైనా, దాని నుండి తప్పిపోరు.

♻️ దుష్టత్వము జరిగించే వారిని అసహ్యించు కొనుట:

అంటే? వారు జరిగించే దుష్ట క్రియలలో ఏ విధంగానూ పాలుపొందక ప్రత్యేకమైన జీవితం జీవించుట. నీవు లోకంనుండి ప్రత్యేకించ బడ్డావా? “నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు కొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్య ములు అవి నాకు అంటనియ్యను. (కీర్తనలు 101:3)

 ♻️ దేవునియందు భయభక్తులు గల వారిని గౌరవించుట:

🔹దేవునియందు భయభక్తులు గల వారిని గౌరవించడం అంటే? వారు నడిచే మార్గాలను అనుసరించడమే వారికి మనమిచ్చే నిజమైన గౌరవం. అట్టి ప్రవర్తన నీలో ఉందా?

♻️ మాటయిస్తే? నష్టమైనా, దాని నుండి తప్పకపోవుట:

మన జీవితంలో దేవునికి ఎన్నిసార్లు మాటివ్వలేదు? ఎన్ని ప్రమాణాలు చెయ్యలేదు? ప్రతీ వాచ్ నైట్ సర్వీస్ రోజు ఒక తీర్మానం. దాని మీద నిలబడింది ఎన్నిరోజులు? మన అవసరాలు తీరే వరకు నాజీవితం ఇక నీకే స్వంతం అంటాం. కాని అవసరం తీరాక ? దేవునికి ఎన్ని సార్లు మాటిచ్చామో? వాటి సంఖ్య మన లెక్కకు కూడా అందదేమో కదా? ఇటువంటి పరిస్థితులలో ... ఆయన ఇల్లు అనే పరలోకంలో మనకు ఆతిధ్యం దొరకుతుందా? ఆ రాజ్యంలో ఆ రాజుతో జీవించే హక్కు మనకుంటుందా?

🔅తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. కీర్తనలు 15:5
   
ఎవరయితే?
🔹యదార్ధ మైన ప్రవర్తన కలిగి,
🔹నీతిని అనుసరిస్తూ,
🔹హృదయ పూర్వకంగా నిజం మాట్లాడుతున్నారో?

అట్టి వారు,
🔹నాలుకతో కొండెములాడరు.
🔹తన స్నేహితునికి కీడు చేయరు.
🔹తన పొరుగువానిమీద నింద మోపరు.
🔹దుష్టత్వము జరిగించే వారిని అసహ్యించు కుంటారు.
🔹దేవునియందు భయభక్తులు గల వారిని గౌరవిస్తారు.
🔹మాటయిస్తే? నష్టమైనా, దాని నుండి తప్పిపోరు.

అంతే కాకుండా,
🔹తన ద్రవ్యము వడ్డికియ్యరు.
🔹నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనరు.

♻️ తన ద్రవ్యము వడ్డికియ్యరు.

మన కళ్ళెదుటే కడుబీదలుగా వున్నవాళ్ళు నేడు కోట్లకు పడగలెత్తుతున్నారు అంటే దానికి ప్రధాన కారణం వడ్డీ తీసుకోవడమే. దేవుని వాక్యం తెలిసినవారు కూడా చూసి చూడనట్లుగా వారిపని వారు కొనసాగిస్తున్నారు. అది వారికిగాని, వారి పిల్లలకుగాని ఆశీర్వాదం కాదు. అన్యులు వారికి తెలియదు కాబట్టి వారు క్షమించబడతారేమో కాని, దేవుని పిల్లలముగా మనము తప్పించుకోలేము. నీవు వడ్డీ 10 రూపాయలు తీసుకున్నా, 10 పైసలు తీసుకున్నా అది వడ్డీయే కదా? అపరాధిగా నిలబడాల్సి వస్తుందేమో?  “ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వాని యెడల జరిగింప కూడదు, వానికి వడ్డికట్టకూడదు. (నిర్గమ 22:25)

♻️నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనరు.

"లంచము" పరిస్థితులను తారుమారు చేస్తుంది. అతి తక్కువ సమయంలో అక్రమముగా సంపాదించే మార్గాలలో ఇదొకటి. ఇదెంతటి తారాస్థాయికి చేరుకుందంటే? వెయ్యి రూపాయలు “లంచం తీసుకొని” , పట్టుబడిన అధికారి, పదివేలు “లంచం యిచ్చి” బయటపడే పరిస్థితి. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు. (యెషయ 5:23)

లంచం తీసుకొని దొరికిపోయిన వాళ్ళు అనేకమంది జైలులో గడుపుతున్నారు. కోర్టుల చుట్టూ తిరిగితున్నారు. అంటే? మన దేశ చట్టం కూడా దీనిని ఒప్పుకోదు. ఇక మన దేవుని చట్టం అస్సలు ఒప్పుకోదు.

ఈ అన్ని విషయాల ప్రకారం నడచుకొను వాడు. ఎప్పటికి కదల్చబడడు. వారు నిస్సందేహంగా దేవుని ఇంటిలో ఆతిధ్యం పొందుతారు. ఆయన పరిశుద్ధ పర్వతంమీద తప్పక నివసిస్తారు.

మన జీవితాలు ఎట్లావున్నాయి సరిచేసుకుందాం! సాగిపోదాం! ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

నూతన సంవత్సరమును ఎలా ప్రారంభించాలి?




◆◆సేకరణ◆◆

మన ప్రభువును ప్రియ రక్షకుడునునైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో నూతన సంవత్సర శుభములు తెలియజేస్తున్నాను.

నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనబోతున్నాము. ఇది క్రొత్తేమికాదు. ఇట్లాంటి నూతన సంవత్సరాలు ఎన్నో ఎదుర్కొన్నాము. కానీ, నూతనత్వం మాత్రం కనిపించినట్లు లేదు. అయితే, వాటిలో ఈ నూతన సంవత్సరం కూడా ఒకటి కాకూడదు అంటే? ఇది ప్రత్యేకమైనదైయుండాలి. అట్లాఅని “2020” దాని సంఖ్యనుబట్టి కాదుగాని, మనము తీసుకొనే తీర్మానమునుబట్టి.

♻️ శుభప్రదమైన సంవత్సరంగా దీనిని ప్రారంభించి, ముగించాలంటే, ఏమి చెయ్యాలి?

1. ప్రతిభారమును విడిచిపెట్టు
2. సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టు
3. యేసువైపు చూడు
4. పందెములో ఓపికతో పరుగెత్తు

ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి,  విశ్వాసమునకు  కర్తయు  దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.  (హెబ్రీ 12:2)

💮 1. ప్రతిభారమును విడిచిపెట్టు

పరుగుపందెములో పరిగెత్తేవారు తలమీద ఒక బస్తా బరువు పెట్టుకొని పరిగెత్తడం సాధ్యం కాదు. సాధ్యపడినా విజయం మాత్రం దక్కదు. అందుకే, కనీసం వారు ధరించే వస్త్రాలు సహితం తేలికగా వుండేలా చూచుకుంటారు. విశ్వాసయాత్రలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. పుట్టిన ప్రతీమనిషి అనేక భారాలను మోస్తూవున్నాడు. దానిలో ప్రాముఖ్యమైనది పాపభారం. దానిని భుజాన వేసుకొని ఎన్నిసంవత్సరాలు పరిగెత్తినా ఒక్క అడుగుకూడా ముందుకువేయలేము. ఇన్ని సంవత్సరాలకాలంలో మన జీవితంలో ఇదే జరుగుతుంది. పరుగు పందెములో ముందుకు దూసుకొనిపోవాలంటే? నీవు మోస్తున్న ప్రతీ భారాన్ని విడిచిపెట్టాలి. నీవు ప్రశ్నించొచ్చు, నాకు ఆర్ధిక భారముంది, కుటుంబ భారముంది ఇట్లా ఏవేవో వున్నాయి వాటన్నిటిని విడచిపెట్టేస్తే వాటిని మోసేదెవరని? అది ఆర్ధిక భారమైనా, పాప భారమైనా, అది ఏ భారమైనా సరే. నీవు విడిచిపెడితే మోసేవారొకాయన వున్నారు.

★ నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును. - (కీర్తనలు 55:22)

★  నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. - (సామెతలు 16:3)

★ మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి. - (1 పేతురు 5:7)

★ నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును. - (కీర్తనలు 37:5)

★ ప్రయాసపడి  భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. - (మత్తయి 11:28)


💮 2. సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టు:

ప్రతీభారమును ప్రభువుకు అప్పగించి, మరింత బలాన్ని పొందుకొని విశ్వాస పరుగుపందెములో దూసుకొనిపోతున్నపుడు మనలను సులువుగా చిక్కులుపెట్టే పాపము ఏమిటంటే “అవిశ్వాసము”. విశ్వాస పరుగుపందెములో సాతాను అడ్డుగా వచ్చి, నీవు పరుగెత్తలేవు. విజయం సాధించలేవు అంటూ, భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వీకుడు (సంఖ్యా 12:3) అని దేవునిచేత సాక్ష్యము పొందిన మోషే ఏమి చేసాడు? బండతో మాట్లాడమంటే, బండను కొట్టాడు. నా హృదయానుసారుడైన మనుష్యుడు ( అపో. కా. 13:22) అని దేవునిచేత సాక్ష్యము పొందిన దావీదు ఏమి చేసాడు? బత్షెబతో పాపముచేసి, అతని భర్తను చంపించాడు. దేవునిచేత సాక్ష్యముపొందిన వీరిద్దరే విశ్వాసయాత్రలో ఓడిపోయారు. నీవెంత? గతించిన నీ జీవితం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటూ దేవునిచే క్షమించబడిన వాటన్నిటిని తిరిగి నీ జ్ఞాపకంలోనికి తీసికొనివచ్చి, విజయం సాధించడం నీవల్లకాదంటూ అనేకమైన ప్రశ్నల వర్షాన్ని కురిపించి నిజంగా ఇదినావలన కాదు అనిపించేటట్లు అవిశ్వాసాన్ని మనలో నింపుతాడు. అట్లాంటప్పుడు క్షమించబడిన పాపములను ప్రభువు ఎంతమాత్రమూ జ్ఞాపకము చేసుకొనరనే విశ్వాసమును మనము కలిగియుండి, శ్రమలలో తన విశ్వాసమును కాపాడుకొనిన యోబు వలే,  శోధనలలో తన పరిశుద్ధతను కాపాడుకొనిన యోసేపువలే నేను జీవిస్తానని చెప్పగలగాలి. తద్వారా సులువుగా చిక్కులు పెట్టు “అవిశ్వాసము” అనే పాపములో చిక్కకుండా విశ్వాసముతో స్థిరులగుదుము.

💮 3. యేసువైపు చూడు: 

ప్రతీ భారమును విడచిపెట్టి, విశ్వాస యాత్రలో సులువుగా చిక్కులుపెట్టే పాపమైన అవిశ్వాసములో చిక్కకుండా, పరుగు పందెములో దూసుకుపోతున్నప్పుడు అనేక మార్గాలు మనలను ఆకర్షిస్తుంటాయి. కొన్ని మార్గాలు అత్యంత విశాలంగా కనిపిస్తే, మరికొన్ని మార్గాలు గమ్యానికి దగ్గర మార్గాలుగా కనిపిస్తాయి. సాతాను అనుక్షణం మనలను అటువైపు మలచి, గమ్యంవైపు సాగిపోకుండా వాడు సృష్టించని అడ్డంకులంటూ ఏమి వుండవు. మన ప్రతీ బలహీనతను వాడి బలముగా మలచుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే, విశ్వాస యాత్రలో యేసువైపు మాత్రమే చూడాలి. ఎందుకంటే, ఆయనే విశ్వాసమునకు కర్త. ఆయనే కొనసాగించువాడు. మనము చేరాల్సిన గమ్యం ఆయనకు మాత్రమే తెలుసు. “నేనే మార్గమును” ( యోహాను 14:6) వేరొక మార్గము లేనేలేదు. “గొఱ్ఱలు పోవు ద్వారమును నేనే” (యోహాను 10:8) వేరొక ద్వారము లేనేలేదు. ఆయన మాత్రమే మనలను నడిపించగలడు. గమ్యానికి చేర్చగలడు. అయితే, ఆయన మనకు కనిపించరు కదా? ఆయనవైపు చూసేదెట్లా? కొన్ని సందర్భాలలో చీకటిగుండా కాపరి మందను తీసుకొని వెళ్తున్నప్పుడు, కాపరి ఎటువైపు వెళ్తున్నాడో, గొర్రెలకు కనిపించడు. అట్లాంటప్పుడు, కాపరి దుడ్డుకర్రతో నేలమీద టక్....టక్ ....టక్  అంటూ శబ్దం చేసుకొంటూ ముందుకు వెళ్లిపోతుంటే, ఆ శబ్దాన్ని బట్టి గొర్రెలు కాపరిని అనుసరిస్తూ సాగిపోతాయి. "గొర్రెలకు కాపరి కనిపించకపోయినా, శబ్దం వినిపిస్తుంది ముందుకు సాగిపోవడానికి." "మన ప్రభువు కనిపించకపోయినా, ఆయనిచ్చిన వాగ్దానాలు వినిపిస్తున్నాయి ముందుకు సాగిపోవడానికి."


💮 4. పందెములో ఓపికతో పరుగెత్తు:

ప్రతీ భారమును విడచిపెట్టి, విశ్వాస యాత్రలో సులువుగా చిక్కులుపెట్టే పాపమైన అవిశ్వాసములో చిక్కకుండా, యేసువైపు చూస్తూ పరుగెత్తుతున్నప్పుడు, దారిలో సాతాను శోధనలు, వేదనలు, శ్రమలు అనే అడ్డుబండలను వుంచుతాడు. అవి తగిలి క్రిందపడుతూ ఉంటాము. అయినప్పటికీ  ఆగిపోకూడదు. లేచి మరలా పరిగెత్తాలి. అనేక సందర్భాలలో సహనం కోల్పోతాము. శోధన వెంబడి శోధన తరుముకొస్తూ ఉంటుంది. మనము ఒక్కసారి వెనుకకు తిరిగి చూడగలిగితే, కృప వెంబడి కృప కూడా మనలను వెంబడిస్తూనే ఉంటుంది. ఎన్ని అడ్డంకులొచ్చినా అంతమువరకూ సహించాలి. సహించలేకపోతే జీవ కిరీటం దక్కదు (యాకోబు 1:12 ). ఎన్ని శోధనలొచ్చినా గమ్యం వైపే పరుగెత్తాలి. పరుగు తుదముట్టించకపోతే నీతి కిరీటం దక్కదు. (2తిమోతి 4:7) గర్భవతిగా నున్న తల్లి, ఎన్ని యిబ్బందికరమైన పరిస్థితులొచ్చినా, వాటన్నిటిని సహిస్తూ పుట్టబోయే బిడ్డకోసం చివరి క్షణం వరకు ఎట్లాంటి నిరీక్షణతో ఎదురుచూస్తుందో, అట్లానే విశ్వాస పరుగు పందెములో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురుగా వచ్చినా, వాటన్నిటినీ సహిస్తూ, శ్రమలయందునే అతిశయిస్తూ, నిరీక్షణతో ఆ నిత్యమైన బహుమానము పొందడానికి పరుగెత్తెదము. ఆగిపోవద్దు. సాగిపోవుదము ఆ గమ్యం చేరేవరకు. ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!


మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

జనవరి 1 న తీసుకొనిన వాగ్దానములు వాక్యానుసరమా?



NOTE:  ఈ పోస్ట్ తో మీరు ఏకీభవించాల్సిన పనిలేదుగాని, వాస్తవికంగా మరియు వాక్యానుసారముగా  ఆలోచించే ప్రయత్నం మాత్రం తప్పక చెయ్యండి.

♻️  వాగ్ధానములు
వాక్యానుసారమా⁉️

ఈ ప్రశ్నకు సమాధానం తడుముకోకుండా చెప్పేస్తాం. కానే కాదు. అయితే, ఎందుకు వాటికంత ప్రాముఖ్యతనిస్తాము? ఎందుకంటే? వాక్యానుసారమైనది ఏది మనము చెయ్యం. ఏది కాదో దానిని మాత్రం తప్పక చేస్తాం. అందుకే అంత ప్రాముఖ్యత.

ఇంతకీ, నేను మాట్లాడుతున్నది దేవుడిచ్చే వాగ్ధానాలకోసం కాదు. మనము తీసుకొనే వాగ్ధానాల కోసం. మనము తీసుకొనే వాగ్ధానాలు అని నేనెందుకు అంటున్నానంటే? నాకు అట్లానే అనిపించింది. దానికి గల కొన్ని కారణాలు చెప్తున్నా. నాతో మీరు ఏఖీభవించాల్సిన పనిలేదుగాని, లేదంటే? వాస్తవికంగా ఆలోచించడానికి ప్రయత్నం చెయ్యండి.

♻️ దేవుడు వాగ్ధానాలను డిసెంబర్ 31 వ తారీఖున లేదా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యిస్తారా❓

లేదు. ఆయన ఇవ్వాల్సిన వాగ్ధానాలన్నీ పరిశుద్ధ గ్రంధంలో వ్రాయించి వుంచారు. దేవుని వాక్యము ద్వారా అనునిత్యమూ ఆయన వాగ్ధానాలను మనకు అనుగ్రహిస్తూనే వుంటారు. అయితే, మనమెందుకు ఆ ఒక్క రోజే తీసుకుంటాము? అదే చెప్పాను కదా! అవి “మనము తీసుకొనే వాగ్ధానాలని”.

♻️ దేవుడు సంవత్సరమునకు ఒక మనిషికి ఒక్క వాగ్ధానమే యిస్తారా❓

అట్లా ఎంతమాత్రం జరుగదు. మరెందుకు మనము ఒక్క వాగ్ధానమునే తీసుకుంటాము? ఆయన ఇచ్చే వాగ్ధానాలు చాలా వున్నాయి. ఇవి “మనము తీసుకొనే వాగ్ధానాలు” కాబట్టి ఒక్కటే తీసుకుంటాము. ఒకవేళ దేవుడు ఎక్కువ వాగ్ధానాలు ఇచ్చినా మనము తీసుకోమా? అవును! అదే కదా దీని అర్ధం.

♻️ ఒకవేళ మనము వాగ్ధానము తీసుకోకపోతే ఇక మన జీవితాల్లో దేవుని కార్యాలు చూడలేమా❓

అట్లా ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగదు. ఉదా : భార్య భర్తలిద్దరూ వాగ్ధానాలు తీసుకున్నారు. భర్తకు “నిన్ను స్వస్థపరచే యెహోవాను నేనే” అని వాగ్ధానం వచ్చింది. ఇప్పుడు భార్యకు జబ్బు చేసింది. తను ప్రార్ధించింది. సారీ, ఆ వాగ్దానం నీ భర్తకు ఇచ్చేసా. ఇక నీ పని అంతే. అంటాడా దేవుడు? అట్లా ఎట్టి పరిస్థితుల్లోనూ అనడు. తననూ స్వస్థ పరుస్తాడు. అయితే, ఆ లాటరీ వాగ్ధానముల వలన ప్రయోజనమేమిటి? ఒక్కసారి ఆలోచించు?

♻️ *వాగ్ధానం తీసుకున్న వారి జీవితాల్లోఆ వాగ్ధానం తప్పక నెరవేరుతుందా*❓

నెరవేరడం ప్రక్కనబెడితే, వాగ్ధానం తీసుకున్నవారిలో వారు తీసుకున్న వాగ్ధానం ఏమిటో 90 శాతం మంది, తీసుకున్న కొద్దిరోజులకే మరచిపోతారు. అట్లా అయితే? వారెందుకు తీసుకున్నట్లు? అందరూ తీసుకుంటున్నారు కాబట్టి.

♻️ వాగ్ధానాలు ఇవ్వడంలో దేవుడు తప్పు చేస్తారా❓

అట్లా జరగనే జరుగదు. అయితే, ఇవి దేవుడిచ్చే వాగ్ధానాలే అంటారా? తొంబ్బై సంవత్సరాల వృద్ధుడు. అతని మనుమలకు కూడా వివాహమయ్యింది. ఆయన డిసెంబర్ 31 న వాగ్ధానం తీసుకున్నాడు. ఆ వాగ్ధానమేంటో తెలుసుకొని చర్చ్ అంతా గొల్లుమన్నారు. “మరుసటి యేట నీ ఒడిలో ఒక కుమారుడుండును”. మరొకడేమో తప్పతాగి, తూలుతూ వచ్చి, వాగ్ధానం తీసుకున్నాడు. “ నీవు నాకు బహు ప్రియుడవు” నిజంగా ఇదే దేవుని వాగ్ధానమైతే? వాడెప్పటికీ మారాల్సిన పనిలేదు.

♻️ ఎక్కువ వాగ్ధానాలు షరతులతో కూడి ఉంటాయి.

ఉదా: నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు. ( ఎఫెసి 6:2 )

🔸షరతు: నీ తండ్రిని తల్లిని సన్మానింపుము
🔸వాగ్ధానము: నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగువుదు.

“షరతు” నెరవేర్చకపోతే “వాగ్ధానము” నెరవేరదు. అయితే, మనము తీసుకొనే వాగ్ధానములలో “షరతులు” కనిపించవు. కేవలం “ఆశీర్వాదాలు” మాత్రమే కనిపిస్తాయి.
ఇట్లా చెప్పుకొంటూపోతే చాలా వున్నాయి.

వాక్యానుభవం కలిగిన సేవకులు సహితం, ఇది వాక్యానుసారమైన విధానం కాదని తెలిసినా, ఈ లాటరీ విధానాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న? నా స్నేహితుడొకరు చెప్పారు. వాగ్ధానం తీసుకొని కానుకను సమర్పిస్తారని, దానికోసం, వాక్యానుసారం కాకపోయినా, సేవకులు ఇట్లాంటి విధానాలను కొనసాగిస్తున్నారని. అదే నిజమైతే? ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును ఒక్కసారి మాత్రమే అమ్మాడు గాని, మనమయితే? ఆయనను ముక్కలు కోసి, ప్రతీ సంవత్సరం అమ్మేస్తున్నాము కదా?*

దయచేసి, ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యండి. పరిశుద్ధ గ్రంధాన్ని, క్రమము తప్పకుండా అనుదినము ధ్యానించండి. నీవున్న పరిస్థితికి తగిన వాగ్ధానాన్నిచ్చి ఆయన నిన్ను నడిపిస్తాడు. సంవత్సరానికి ఒక్క వాగ్ధానమే కాదు. పరిశుద్ధ గ్రంధంలో నున్న వాగ్ధానాలన్నీ నీకోసం కాకపోయినా, ఎక్కువ శాతం మాత్రం నీకోసమే.

వాగ్ధానాలు తీసుకోవడం పెద్ద పాపమని కాదుగాని, ఏమాత్రం ప్రయోజనం లేని విషయమని నా అభిప్రాయం. నాతో మీరు ఏఖీభవించాల్సిన పనిలేదు గాని, వాక్యానుసారం కాని, విధానాలను ప్రోత్సహించి, దేవుని నీతి న్యాయములను చులకన చేసే ప్రయత్నం చెయ్యొద్దన్నదే నా పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

అలవాటు పడిన జీవితాన్నే కొనసాగిస్తావో? వాక్యానుసారమైన విధానాలు అలవరచుకుంటావో? నిర్ణయం నీదే! ఆలోచన చేద్దాం! వాక్యానుసారమైన జీవితాలను జీవించడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం! అట్టి కృప ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

                  ★★★★★ నిరీక్షణ ద్వారము..


మీ 
సహోదరుడు
Brother SURESH
9581881880

తరము అంటే?

"తరము" అంటే రమారమి "40 సం।।" ఇదిగో ఉదాహరణ: -

హెబ్రీయులకు 3:9 *నలువది సంవత్సరములు* నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి.

హెబ్రీయులకు 3:10 కావున నేను *ఆ తరము* వారివలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నా మార్గములను తెలిసికొనలేదు.

"తరము" అంటే "యుగము/జాతి" అని ఎవరైనా నిరుపించగలరా?

ఏ బాషలోనైన పేరు ఎందుకు మారుతుంది?


యేసు అని పిలవవలెనా లేక యాషువా అనే పిలవవలెనా?

బైబిల్ గ్రంధామందు ఉన్న రచయితలు రకరకముల సంసృతిలో పెరిగినవారు వారి రచనలు అని కూడా దేవుని చేత ప్రేరేపించబడిన(1 పేతు 2:20,21) వారే రాసినవే...

హీబ్రులో 22 latters ఉంటాయి..
గ్రీకు లో 24
అరమిక్ 22
ఇంగ్లీష్ 26
తెలుగు 56

ఒక భాషలో కొని పదాలు లేవు ఒక్క భాషలో కొని ఎక్కువ పదాలు ఉన్నాయి... భాషలను పుట్టించిందే దేవుడు, బాషాపదాలు ఏదైనా భావం ఒక్కటే ఇచ్చును...
యాషువా అనువారు, యేసు అనువారు, జీసస్ అనువారు ముగ్గురు పదాలు వేరు కానీ ముగ్గురు దృష్టిలో వ్యక్తి మాత్రం ఒక్కడే....

ముగవాడికి బాషా ఉండదు కానీ వాడు భావంతో ఆరాధన చేస్తాడు లేదా వ్యక్తపరుస్తాడు.... కాబట్టి ఏదైనా భావం హృదయములో ఉండాలి..

    బాబేలు గోపురం దగ్గర దేవుడు మనుష్యుల భాషను తారుమారు చేశాడు (అది 11:6-8) అనేక భాషలు ఆ రోజు ఏర్పడ్డాయి. దేవుడు తారుమారు చేసిన భాషలు అన్ని ఒకేలా లేవు. ఒక భాషలో ఉన్న కొన్ని శబ్దాలు ఇంకో భాషలో లేవు. కొంత కాలానికి వారు మాట్లాడే భాషలకు లిపి కనుగొనబడింది.ఇప్పుడు ఒక భాష మాట్లెడే వ్యక్తి ఇంకొ భాష మాట్లాడే ప్రాoతానికి వెళ్ళినప్పుడు భాషపరమైన కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి.
ఉదా: శంకర్ అనే వ్యక్తి పేరును ఇంగ్లీషులో shankar(షoకర్) అనో sankar (సంకర్)అనో వ్రాస్తారు.ఎందుకంటే ఇంగ్లీషులో'శ' అనే శబ్దంఇచ్చే అక్షరం (Alpha-bet)లేదు. అలాగే francis అనే పేరు తెలుగులో రాయలన్నా ఇలాంటి సమస్యే ఎదురవుతుంది.తెలుగులో 'fa' అనే శబ్దంఇచ్చే అక్షరం లేదు.దానికి బదులు 'ఫ' (ppa)ను వాడుతాం.మనం అతని పేరును ప్రాన్సిస్ (pprancis) అని రాస్తాం. సింధు హిందుగా ఇలాగే మారింది. దీనిని తర్జుమా (translation)అనరు. లిప్యoతరీకరణ(translisteration)అంటారు. తెలుగులో కంటే ఇతర భాషలలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటున్నది. 'యేసు' పేరు కూడా translate చేయబడలేదు.transliterate చేయబడింది.ఆదిమ సంఘ కాలపు యూదులు హెబ్రీతోతో పాటు గ్రీకు కూడా విరివిగా చేయబడింది.ఎందుకంటే అప్పటి ప్రపంచ భాష గ్రీకు. క్రీస్తు శిష్యులoతా హెబ్రీ భాష మాట్లాడేవారైనప్పటికి వారు సువార్త చెయ్యాలిసిన ప్రాoతాలలో నివసించే వారంతా గ్రీకు మాట్లాడేవారే.




మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

క్రైస్తవులు వడ్డీ వ్యాపారము చేయవచ్చా?



వడ్డీ వ్యాపారం చేయవచ్చా ?


ద్వితీ 23:20  - అన్యునికి వడ్డికి బదులు ఇయ్యవచ్చును గాని నీ సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు.

ఇక్కడ దేవుడు అన్యులకు వడ్డీకి డబ్బులు ఇవ్వవచ్చని చెప్పి సహోదరులకి వద్దన్నారు.

సహోదరుడు అంటే ? 
సంఘ సభ్యుడు నీకు సహోదరుడు అవుతాడు
నీ తోటి వాడు

👉 నిర్గ 22:25
"నా ప్రజలలో నీయొద్దనుండు ఒక బీదవానికి " సొమ్ము అప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వాని యెడల జరిగింపకూడదు, వానికి వడ్డికట్టకూడదు.

నా ప్రజలు అనే మాట చూడండి అన్యులకు అనలేదు.

👉 లేవీ 25:36,37
నీ దేవునికి భయపడి వానియొద్ద వడ్డినైనను తీసి కొనకూడదు; నీ సహోదరుడు నీవలన బ్రదుకవలెను.
నీ రూకలు వానికి వడ్డికియ్యకూడదు; నీ ఆహారమును వానికి లాభమున కియ్యకూడదు.

సామాన్యంగా వడ్డీకి ఎవరాడుగుతారు బీదవారే కదా అందుకే బీదవాడైన సహోదరుడుకి  అన్నారు చూడండి

ద్వితియోపదేశకాండము 23:19,20
నీవు వెండినేగాని ఆహారద్రవ్యమునేగాని, వడ్డికి వేయ బడు దేనిని నీ సహోదరులకు వడ్డికియ్యకూడదు.
అన్యు నికి వడ్డికి బదులు ఇయ్యవచ్చునుగాని నీవు స్వాధీనపరచు కొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు.

నీ సహోదరులకు అంటే అప్పటి ఇజ్రాయిల్ సమాజము నేడు సంఘసభ్యుడు అని.

కీర్తనలు 15:5: తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.
-- అంటే ఇది అన్యులను ఉదేశించినది కాదు.

సామె 29:13 బీదలును వడ్డికిచ్చువారును కలిసికొందురు ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే.
 ★ ఇక్కడ దేవుడే ఇద్దరికి వెలుగు ఇస్తారని ఉంది. అసలు వడ్డీకి ఇవ్వకూడదు అని లేదు. కానీ మరీ దారుణంగా వడ్డీ తీసుకుంటూ అన్యులను కూడా ఇబ్బంది పెట్టకూడదు
★ సామెతలు 28:8: వడ్డిచేతను దుర్లాభముచేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించువానికొరకు దాని కూడబెట్టును.
-- వడ్డీ విషయములో జాగ్రత్తగా ఉండవలెను అనే హెచ్చరిక ఇది.

యెహేజ్కేలు 18:17: బీదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభముకొరకు అప్పియ్యకయు, వడ్డి పుచ్చుకొనకయు నుండినవాడై, నా విధుల నాచరించుచు నా కట్టడల ననుసరించుచు నుండిన యెడల అతడు తన తండ్రిచేసిన దోషమునుబట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రదుకును.

ఆర్థికపరిస్తితుల తలెత్తిన సందర్భం ఒక్కటి ఉంది
నెహెమ్యా 5:1-13 చదవండి....

ఇది సహోదరులు విషయంలో చెప్పేది.
కావున న్యాయంగా ఈ వ్యాపారాన్ని చేసుకోవడంలో తప్పు లేదు కానీ సహోదరుల విషయంలో దయ కలిగి తమ సొంత సొమ్మును వడ్డీకి ఇవ్వకుండా ఉండటం మంచిది.

పై వచనములన్ని పాతనిబంధనలోనివి కాదా మనకు క్రొత్తనిబంధనలో చేపలేదుగా అని అనుకుంటారేమో
పాతనిబంధన మనకు బుద్ది బోధ నేర్పుతుంది.
1 కోరింది 10.11, రోమా 15.4

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

సూర్యగ్రహణం గర్భిణులకు ప్రమాదకరమైనదా?


సూర్యగ్రహణం గర్భిణులకు ప్రమాదకరమైనదా?

మొదటగా దేవుడు సూర్యచంద్రులను ఎందుకు నియమించారో మొదట చూద్దాం

ఆదికాండము 1:14-16
దేవుడుపగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి
- సూచనలను
- కాలములను
- దిన
- సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను.

దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని(సూర్యుడు) రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని(చంద్రుడు) నక్షత్రములను చేసెను.

:- అంటే అవి వెలుగు ఇచ్చుటకు మరియు కాలాల్ని తెలుపుటకు ఉంచబడ్డాయి. 

★ కీర్త 104:19 ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను

ఐతే భూమి సూర్యునికి దగ్గరగా తిరుగుతున్నప్పుడు వేసవి కాలం, దూరంగా ఉన్నప్పుడు శీతాకాలం ఏర్పడతాయి.

అలా తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యుడికి భూమికి మధ్యలోకి చంద్రుడు  రావటం వల్ల చంద్రుడి నీడ, భూమిపై పడటం కారణంగా సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

సూర్యగ్రహణం జరిగినప్పుడు, సూర్యుని యొక్క తీవ్రమైన పరారుణ మరియు అతినీలలోహిత కిరణాలు  కంటి రెటీనాకి నష్టాన్ని కలిగిస్తాయి.

సూర్యుని ఉపరితలం  99% గ్రహణం సమయంలో చంద్రునితో కప్పబడి ఉన్నప్పటికీ, మిగిలిన కాంతి కంటికి హాని కలిగించేంతగా ఉంటుంది.

ఈ కిరణాలు ప్రతిరోజు మనమీద పడుతూనే ఉంటాయి . మనం ఎక్కువసేపు ఎండలో ఉన్నట్లయితే చర్మం, కళ్ళు, ఇతర భాగాలు కూడా డామేజ్ అవుతాయి. ఐతే గ్రహణం సమయంలో ఇంకా ఎక్కువ వేడి విడుదల అవుతాది కావున నేరుగా చూడకూడదు. ఇది గర్భిణీ స్త్రీలకు మాత్రమే కాదు అందరికి వర్తిస్తాది. కావున బయటకు వెళ్లకుండా నీడలో ఉండవచ్చు , ఆహారం తీసుకోవచ్చు.

అవగాహన కొరకు కొన్ని లింకులు
https://te.m.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF_%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%A3%E0%B0%82

https://youtu.be/zTRlA-xfj0Y

---------- ౦ ---------
మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

రాజులకు రాజు, ప్రభువుకు ప్రభువు


అందరికి పైగా రాజులకురాజు దేవుడు🤴

1తిమోతికి 1:17: సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృ శ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్‌.

ఏ యుగములోనైన రాజుగా ఉండేది యెహోవాతండ్రినే ఎందుకంటే మనుషుల విషయమైనా సంకల్పము అయినదైయున్నది..

మనుషుల విషయమైనా సంకల్పము కలిగిన దేవుడు ఎవరిని ఎపుడు ఎక్కడ రాజుగా ఉంచాలో అది ఆయన స్వాధీనములో ఉన్నది...

1 తిమోతికి 6:15 శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. *ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు*.౹

అయితే దేవుడు తన కార్యసిద్ధి విషయమై కొంతమంది రాజులను యెనుకొని వారి ద్వారా రాజ్యము చేయుచుండెను ఆ రాజు ఈ లోకమందు రాజులకు రాజును ప్రభువుకు ప్రభువునైయుండును...


*దేవుడు ఎవరికి అధికారము ఇస్తాడో ఆ వ్యక్తి రాజులకు రాజు*


*నెబుకద్రేజరు రాజులకురాజు* 🤴

★ దానియేలు 2:37 రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్ర హించియున్నాడు; *తమరు రాజులకు రాజైయున్నారు*.౹

★ యెహెజ్కేలు 26:7 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా– *రారాజగు బబులోను రాజైన నెబుకద్రెజరును* నేను తూరుపట్టణము మీదికి రప్పించుచున్నాను, అతడు గుఱ్ఱములతోను రథములతోను రౌతులతోను గుంపులు గుంపులుగానున్న సైన్యముతోను ఉత్తరదిక్కునుండివచ్చి


*అర్తహశస్త రాజులరాజు*🤴

Ezra 7:12
*"Artaxerxes, king of kings*, to Ezra the priest, a scribe of the law of the God of heaven, perfect peace, and at such a time."


*యేసు క్రీస్తు రాజులకురాజు*🤴

ప్రకటన 17:14 వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభు వులకు ప్రభువును రాజులకు రాజునైయున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.౹

ప్రకటన 19:16  *రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడియున్నది*.

సమస్తము దేవుడే ఒక్కడే చేస్తాడు -
ఫిలిప్పీయులకు 2:13: ఎందుకనగా మీరు ఇచ్ఛయించుట కును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.


దేవుడు
      ⬇️
నియమింపబడిన రాజు/ప్రభువు
      ⬇️
ఇతర రాజులు

--------- ౦ --------

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

ఇజ్రాయెల్ దేశ ఆవిర్భావం



యాకోబుకు దేవుడు ఇశ్రాయేలుగా పేరు మార్చాడు. ఈ ఇశ్రాయేలు (యాకోబు) నుంచి వచ్చిన జనాంగమే ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులు 12 గోత్రములుగా ఉండేవారు (ఆదికాండము 49:28)

ఈ 12 గోత్రాల ప్రజలు ఒకే రాజ్యము (దేశము) గా ఒకే రాజు కింద కనాను దేశములో ఉండేవారు. అయితే క్రీ.పూ. 10 వ శతాబ్దములో సోలోమాను చనిపొయిన తరువాత ఈ 12 గోత్రముల ప్రజలు రెండు రాజ్యాలుగా చీలిపోయారు. 

ఉత్తరాన ఉన్న 10 గోత్రములు కలిపి “ఇశ్రాయేలు రాజ్యముగా”, దక్షిణాన ఉన్న 2 గోత్రములు (యూదా, బెన్యామీను అర్థ గోత్రము) “యూదా రాజ్యముగా” ఏర్పడ్డారు.
(ఈ ఇశ్రాయేలీయులు రెండు రాజ్యాలుగా ఎప్పుడు విడిపోయారు అనేది 1 రాజులు 11, 12 అధ్యాయాలలో మనము చదవవచ్చు.)

ఈ విధముగా దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులు రెండు రాజ్యాలుగా విడిపోయిన తరువాత “ఇశ్రాయేలు రాజ్యాన్ని” 19 మంది రాజులు క్రీ.పూ. 10వ శతాబ్దము నుండి క్రీ.పూ.700 వరకు పరిపాలించారు. తరువాత దేవుడు వారు చేసిన పాపాలను బట్టి వారిని చెరకు అప్పగిస్తాడు. అలా క్రీ.పూ.7వ శతాబ్దములో ఇశ్రాయేలు 10 గోత్రాల వారు చెల్లా చెదురు అవుతారు, అన్యులలో కలిసిపోతారు, అనేక దేశాలకు వలసగా వెళ్తారు. అలా క్రీ.పూ.7వ శతాబ్దము నుండి అన్య రాజుల క్రింద పరిపాలించాబడుతూ ఉండేవారు. (2 రాజులు 17వ అధ్యాయము)

ఇక మిగిలిన యూదా రాజ్యంలో ఉన్న 2 గోత్రముల వారిని 20 మంది రాజులు క్రీ.పూ.10వ శతాబ్దము నుండి క్రీ.పూ. 586 వరకు పరిపాలించారు. అయితే వీరు చేసిన పాపములను బట్టి దేవుడు వీరిని బబులోను రాజుకు అప్పగిస్తాడు. అలా యూదులు 70 సంవత్సరాలు బబులోనుకు చెరగా కొనిపోబడతారు. తరువాత మరలా యూదులు తిరిగి యేరుషలేముకు వచ్చినప్పటికీ కొంతమంది యూదులు బబులోనులోనే ఉండిపోయారు. 

యూదులు యేరుషలేములో తమ సొంత దేశంలో ఉన్నప్పటికీ వారు అన్య రాజుల క్రింద పరిపాలించబడుతూ ఉండేవారు. ఎప్పుడూ ఎదో ఒక రాజు యేరుషలేమును ఆక్రమించుకొని వారిని చిత్ర హింసలకు గురిచేసేవారు. అలా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దము నుండి యూదులకు రాజు లేడు, స్వాతంత్ర్యం లేదు. అన్య రాజుల హింసలకు తట్టుకోలేక యూదులు యెరూషలేము నుండి అనేక ఇతర దేశాలకు వలస వెళ్ళేవారు. అలా వలస వెళ్ళిన యూదులను వివిధ దేశాలలో చిత్ర హింసలకు గురి చేసేవారు. 20 వ శతాబ్దములో జర్మనీ దేశములో హిట్లర్ యూదులను రోజుకు 20 వేల మంది చొప్పున 60 లక్షల మంది యూదులను గ్యాస్ చాంబర్స్ లో బందించి, గ్యాస్ వదిలిపెట్టి దారుణముగా చంపించాడు. ప్రపంచములో ఉన్న అన్ని జాతులకంటే యూదులు బాగా తెలివి కలిగిన వారని వారిని నిర్మూలము చేస్తే ఆర్యులే ప్రపంచములో అందరికంటే ఎక్కువ తెలివి కలిగిన వారిగా ఉంటారని హిట్లర్ యూదులను నిర్మూలము చెయ్యడానికి పూనుకున్నాడు. యూదు జాతికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త Albert Einstein ను కూడా చంపడానికి ప్రయత్నించాడు హిట్లర్, అప్పుడు Albert Einstein అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. అలాంటి పరిస్థితిలో యూదులు ఉండేవారు. 

ఇశ్రాయేలు 12 గోత్రముల వారు తమ రాజ్యాన్ని, సొంత దేశాన్ని పోగొట్టుకొని ప్రపంచ వ్యాప్తముగా చెల్లా చెదురయ్యి ఎందుకు ఇన్ని చిత్ర హింసలు అనుభవించారు? అందుకు కారణం వారు చేసినా పాపాలే. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనే ఆజ్ఞని మీరి అన్య దేవతల తట్టు తిరగడం వారు చేసిన ఘోర పాపం. (2 రాజులు 17:7-23)

అయితే రెండు రాజ్యాలుగా విడిపోయిన 12 గోత్రాలను, ప్రపంచ వ్యాప్తముగా చెల్లా చెదురయిపోయిన ఆ జనాన్ని సమకూర్చి ఒకే రాజ్యముగా చేస్తానని దేవుడు క్రీ.పూ. 6,7,8 వ శతాబ్దాలలో ప్రవక్తల ద్వారా ముందే వ్రాయించాడు. (యెహేజ్కేలు 37:15-23; 36:24; 11:17-19; వచనాలు, యెషయా 11:11-13; 43:5-7 వచనములు, యిర్మియా 16:14,15 వచనాలు చూడండి.)

యెహేజ్కేలు 37:21-22: ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలోనుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండ కుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను.

దేవుడు బైబిలులో చెప్పినట్లు గానే తన ప్రవచనాన్ని క్రీ.శ. 1948 మే 14న నెరవేర్చాడు, హల్లెలుయా. 

1948 మే 14న ఇశ్రాయేలీయులకు స్వాతంత్ర్యం వచ్చింది, వారి స్వంత దేశం వారికి తిరిగి వచ్చింది.

కొంతమంది పోరాట యోధులు ప్రపంచమంతా చెదిరి ఉన్న యూదులందరూ తిరిగి తమ మాతృభూమికి రావాలని పిలుపునిచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు దేశం బ్రిటిషు వారి ఆధీనములో ఉంది. వారందరి పిలుపు మేరకు ప్రపంచమంతటా ఉన్న ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి 1948 మే నెలలో ఇశ్రాయేలు దేశం చేరుకున్నారు. 

1948 మే 14వ తేదీన ఇశ్రాయేలు దేశంలోని “Tel Aviv”నగరంలోని మ్యూజియంకు ఐక్య రాజ్య సమితి సభ్యులంతా చేరుకొన్నారు. కాసేపు తరువాత David Ben-Gurion ఇశ్రాయేలు దేశం ఆవిర్భవించిందని ప్రకటన చదివాడు. ఇశ్రాయేలు జాతీయ గీతం ఆలపించబడినది. వెంటనే అమెరికా అద్యక్షుడు Harry S. Truman ఇశ్రాయేలు దేశాన్ని గుర్తించినట్లు ప్రకటించాడు. ఎందుకనగా ఐక్య రాజ్య సమితి సాధారణ సభ తీర్మానం ప్రకారం ఇశ్రాయేలు దేశం ఏర్పడినది. 

దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పిన ప్రవచనం నెరవేరినది. 

ఇప్పుడు ఇశ్రాయేలు దేశం భౌతికముగా తిరిగి జన్మించినది. ఈరోజు వారికి ఒక జాతీయ పతాకం, రాజ్యాంగ చట్టం, పార్లమెంటు ఉంది. ప్రధాన మంత్రి, మంత్రిమండలి ఉంది. రక్షణ దళం, బలమైన సైనిక వ్యవస్థ ఉంది. మహా దేవుని పట్టణమైన “యేరుషలేము” ముఖ్య పట్టణముగా వుంది. 

ఈ సంఘటన ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి రానున్నాడనే దానికి ముంగురుతు, కనుక క్రైస్తవులమైన మనం నిరీక్షిస్తున్న క్రీస్తు రాకడ అతి త్వరలో సంభవింపబోతున్నదని గ్రహించాలి. దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించిన రక్షణను చివరి వరకు కాపాడుకుంటూ అనేకులను రక్షణలోకి నడిపిద్దాము. 
అట్టి కృప దేవుడు మన అందరికి దయచేయును గాక, ఆమెన్. 

ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను (కీర్తనలు 102:16)

భయపడకుము, నేను నీకు తోడైయున్నాను తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. బిగబట్టవద్దని దక్షిణదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరమునుండి నా కుమారులను భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే.
(యెషయా 43:5-7)

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

హల్లెలుయా ఎలా చెప్పాలి?


హల్లెలుయా ఎలా చెప్పాలి ? 

మన ఏకైక ఆత్మలకు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున
మీకు మరియు మీ
కుటుంబమునకు శుభములు తెలియజేస్తున్నాను.

 “హల్లెలుయా” ఎలా చెప్పాలి ?

నేటి సమాజంలో క్రైస్తవ సహోదరులు /సహోదరిలు “హల్లెలుయా” అనే పదం ను ఎందుకు వాడుతున్నారో.. అస్సలు చాలా మందికి నేటికి తెలియదు అనే చెప్పాలి .

ప్రియమైన దేవుని వారలారా దేవుడు బైబిల్ ను మన చేతుల్లో పెట్టింది సమస్తం ఎరిగిన వారై జ్ఞానులు గా అన్ని తెలిసి ఉండాలి అని మంచి సంకల్పం తో, ఉద్దేశంతో  బైబిల్ ని చేతుల్లో పెట్టబడింది. కానీ ఎవరు బైబిల్ ని సరిగా చదవక పోవడం వల్ల ఈరోజు అది అర్ధం కాలేదు అంతే
హల్లెలుయా అనవద్దు అని నేను చెప్పను కానీ ఆ పదం లోని పూర్తి అర్ధం మీకు తెలియాలి

మీరు జాగ్రతగా ఆలోచిస్తే...
అసలు “హల్లెలుయా” ఈ పదం లో ని అర్ధం ఏమిటి ?

సాదారణంగా లోకం లో మనకు ఎవరైనా ఏదైనా చిన్న సహాయం చేస్తే వారికి మానవత ధర్మం తో థాంక్స్ చెబుతాం అది మన ధర్మం .

కానీ ఈ భూమిపై తల్లి గర్భం నుండి మనం బయట పడిన నాటి నుండి , తిరిగి చనిపోయేవరకు  దేవుడు పంచ భూతల ద్వారా మనకు గాలిని , నీరుని , ఎండనిచ్చి దేవునికి మనం స్తుతులు చెప్పక తప్పదు అనే చెప్పాలి .

ముందుగా కృతజ్ఞతలు గూర్చి  బైబిల్ లో ఏం ఉందో తెలుసుకుందాం ..!

ఎపిసి 05:20-21 మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లపుడును కృతజ్ఞతస్తుతులు చెల్లించుచు ,

మరి “హల్లెలుయా” - “హల్లెలుయా” అని అనడం ద్వారా దేవుని మహిమ జరగదు . చూడండి మరి కొంత లోపలి వెళ్ళితే మరి కృతజ్ఞతస్తుతులు గూర్చి పౌలు గారు కూడా చెబుతున్నారు .

కొలోస్సి 03:17 మరియు మీరు మాట చేతగాని క్రియ చేతగాని , మీరేమి చేసినాను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతస్తుతులు చెల్లించుచు , సమస్తమును అయన పేరట చేయుడి .

మరి నేటి సంఘాలలో “హల్లెలుయా” - “హల్లెలుయా” అని అంటున్నారు దేవునికి మహిమ జరుగుతుందా  ?

1కోరింధి 10:31 కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కోరకు చేయుడి .

మరి క్రైస్తవ సహోదరులు /సహోదరిలు “హల్లెలుయా” అని ఎందుకు అంటున్నారు ?
ఇంతకు “హల్లెలుయా” అనే పదం బైబిల్ లో ఎక్కడ ఉందో చూద్దాం !

ప్రకటన 19-01 అటుతరువాత బహు జనుల శబ్దంవంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని – ప్రభువును స్తుతించుడి.

ఇక్కడ  ప్రభువును స్తుతించుడి అనే పదం మూల భాషలో చూసినచో – అల్లెలుయా . అని ఉంది కాదండి. మరి నేటి భోదకులు ప్రసంగాలలో ఏమి చెప్పాలో తెలియక “హల్లెలుయా” - “హల్లెలుయా” అని అంటున్నారు అని చెప్పక తప్పదు ..

ఉదా : మన భారత దేశంలో జనవరి 26, ఆగష్టు 15 కానివ్వండి .. అక్కడ జై భారతమాతకి జై అని అంటారు . కానీ అప్పుడు అందరూ అక్కడ ఉన్నవారు జై భారతమాతకి అని మాత్రం అనరు కదా !

“హల్లెలుయా” - “హల్లెలుయా” అని పలుకుట ద్వారా దేవునికి మహిమ జరుగుట లేదండి ... చూడండి

లూకా 06:46  నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక – ప్రభువా – ప్రభువా , అని నన్ను పిలుచుట ఎందుకు ?
మరియు
లూకా 06:47 నా యొద్దకు వచ్చి , నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును

రెవరెండ్



రెవరెండ్
🔥 *"రెవరెండ్"(Reverend) అనగా అర్ధము ఏమిటి?*
*క్రైస్తవుడు, "రెవరెండ్" అని పిలువబడవచ్చా..?* 🔥

✒ సహోదరులకందరికిని మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

✒ నా ప్రియులారా, సత్య వాక్యమును సరిగా విభజన చేస్తూ మీకు రాస్తున్న ప్రతి అంశమును మీరు చదివి, వాక్య పరిశీలన చేసి, ఆలోచన చేసి అంగీకరిస్తున్న దానిని బట్టి నేను మిమ్మునుబట్టి యెల్లప్పుడును మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాను.

నేడు కొందరు బోధకులు వారు యొక్క పేరుకి ముందు "రెవరెండ్" అనే పదము పెట్టుకొని అనేక మంది చేత పిలువబడటము చూస్తున్నాము.

👀 ఉదా:  రెవరెండ్ ఎడ్వర్డ్, రెవ. జాన్,
Rev. Kiran.... etc

📖 వాస్తవానికి ఇది ఎంత వరకు సత్యము..? అనేది మనము నేడు పరిశుద్ధ గ్రంధమును మాత్రమే ఆధారము చేసుకొని ఆలోచన చేద్దాము. 📖

 💎 "రెవరెండ్" అనగా అర్ధము ఏమిటి..?

❣ హీబ్రూ లో wə·nō·w·rā ( וְנוֹרָֽא).
❣ ఇంగ్లీష్ లో Terrible, Feared, Reverend, Reverence.
📢 గమనిక :- హీబ్రూ పదము ఆధారము చేసుకొని ఇంగ్లీష్ బైబిల్లో పదాలను రాయడము జరిగింది.
❣ తెలుగులో భయంకరుడు, పూజ్యుడు, పూజింపదగినవాడు.

📖 ఆయన "భయంకరుడైన" మహా దేవుడు - (ద్వితీయో 7:21; కీర్తన 89:7).
📖 సమస్త దేవతలకంటె ఆయన "పూజ్యుడు". - (1 దిన 16:25).
📖 Holy and Reverend (పూజింపదగినది)   is his name.
ఆయన నామము పరిశుద్ధమైనది "పూజింపదగినది"(Reverend) -- (కీర్తన 111:9).

💎 *క్రైస్తవుడు, "రెవరెండ్" అని పిలువబడవచ్చా..?*

👀 సమాధానము: పిలువబడకూడదు 👀

పైన వాక్యములును పరిశీలన చేశాక, *రెవరెండ్ అనే పదమును తండ్రియైన దేవునికి మాత్రమే ఉపయోగించాలి* అనే విశేషమైన సంగతిని మనము బాగుగా తెలుసుకోవాలి.

📢 "రెవెరెండ్" అనే ఇంగ్లీష్ పదమునుకు అర్ధము " పూజింపదగినది" - (కీర్తన 111:9).
📢 పూజింపదగినది ఏమిటి..? ఆయన (తండ్రి) నామము.
📢 ఇంత గొప్ప నామము మరియు పరిశుద్ధ నామమును చెందవలసిన దేవునితో పాటు మనమేమో మన తోటి వారుని పిలువడము చేస్తున్నాము. ఇది ఎంత వరకు న్యాయము? అనేది మీరే వాక్య పరీక్ష చేసుకోండి.

📢 "యెహోవాను నేనే; ఇదే నా నామము" మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను. - (యెషయా 48:8).
📢 దీనిని బట్టి పూజింపదగినవాడు (Reverend) "యెహోవా" మాత్రమే.

📢 ఆదిమ సంఘములో ఏ బోధకుడైనా లేదా దేవుని సేవకుడైనా రెవరెండ్ అని పిలువబడ్డారా..? "లేదు అని చెప్పాలి".
📢 మరి నేడు ఒక బోధకుడు అనేక మంది చేత రెవరెండ్ గా పిలువబడుతున్నారంటే ఏమి అనుకోవాలి..? అది మీ ఆలోచనలకు అప్పగిస్తున్న... (2 కోరింది 4:4; 2 తిమోతి 4:3-4).

💎 హెచ్చరిక :
 "రెవరెండ్" అనే నామము లోకములో ఏ వ్యక్తికి  పెట్టతగినది కాదు. ఇలా పిలువబడుతున్న దొంగ సేవకులు విషయములో బహు జాగ్రత్త కలిగి ఉండుము.

కాబట్టి  సత్య అన్వేషకులారా... ఇకనైనా ఆలస్యము చేయక సత్యము ఏంటో, అసత్యము ఏంటో గ్రంధము నుండే పరిశీలన చేసి సత్యమునుకు లోబడండి. వందనములు.!!! 🙏

సెలా

*సెలా*
కీర్తనల గ్రంధంలో *సెలా* అనే పదం 71 సార్లు ఉంది.(కీర్తన3:2)తో ప్రారంభం అవుతుంది.

ఈ పదం హబక్కుకు గ్రంధంలో కూడా 3 సార్లు కనిపిస్తుంది.

ఈ పదం ఒక "నడుము" లాంటిది.(అనగా సంగీతానికి పాటకు మధ్య సంగీతం)

ఈ  *సెలా* మూల పదం *ఎత్తుట*, *గళమెత్తుట*అని అర్థం ఉండటం వల్ల ,గాయకుడు ఒకే తారాస్థాయిలో పాడవలసిన సందర్భాన్ని సూచిస్తోందని తెలుస్తోంది.

యూదులు సమాజ మందిరాల్లో ఉపయోగించే ఆరాధన పుస్తకాల్లోను,సొలొమోను రచించిన కీర్తనల పుస్తకంలోను ఈ పదం కనిపిస్తుంది.

*సెలా* అనేపదం దేవుని ఆరాధించటం లో భాగమై ఉంది అనటంలో ఏ సందేహము లేదు..

వందనములు


వందనములు
ప్రభువు పేరట నా ఆత్మీయ సహోదారులకు నా వందనములు. చాలా మంది భక్తులు, వారి తోటి పరిశుద్ధులను కలుసుకున్నప్పుడు కొందరు మరనత అని, షాలోమ్ అని, మరికొందరు ప్రైస్ ది లార్డ్ అని, ఇంకొంతమంది వందనములు అని చెపుకొనుట మనము సాధారణముగా చూస్తున్నాము.

ఇలా ఒకరికొకరు చెప్పుకోవడము చూస్తూ ఉంటున్నాము. వాస్తవానికి వారికి ఈ పదాల అర్ధము తెలియదు అలా తెలియకే వారు పదాలు బాగున్నాయి కదా, మనం కొంచం different గా ఉండాలి అని సాహసాలు చేస్తున్నారు..
మనము ఒక్కొక్క పదము యొక్క అర్ధం తెలుసుకుందాము..


       🌹Praise the Lord (ప్రైస్ ది లార్డ్)🌹
     ● హీబ్రూ 'లో' - הַ֭לְלוּ יָ֨הּ ׀ (హల్లెలుయా)
     ● గ్రీక్ 'లో' - Ἁλληλουϊά (హల్లెలుయా) g239
     ● ఇంగ్లీష్ 'లో' - Praise The Lord
     ● తెలుగు 'లో' -  "యెహోవాను స్తుతించుడి"
(ప్రభువును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి)
◆ కీర్తనల గ్రంథ రచయితలు -
యెహోవాను 'లేదా' దేవుని స్తుతించుట -
(కీర్తనల 7:17; 33:2; 104:35; 115:18; 116:19; 148:1,7).
◆ "స్తుతించుట" అనగా అర్ధము "పొగడుట, అభివర్ణించు, కీర్తించు, స్తోత్రముచేయు, కొనియాడు..."
➡️  ఇరుగురు కలుసుకొని ఒకరికొక్కరు "ప్రైస్ ది లార్డ్" అని అనుకొనుట వలన నిజముగా  దేవుని అభివర్ణించు కార్యక్రమము జరుగదు. ఎవరైనా praise the Lord అంటే మీరు ఆమెన్ అనవలెను..
■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు  "ప్రైస్ ది లార్డ్" అని సంబోధించాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు.అలాంటి మాదిరి మనకు బైబిల్ నందు కనపడదు.

                 🌹మరన త🌹
    ● గ్రీక్ 'లో' - "Μαράνα tha" (మరన త).
    ● ఇంగ్లీష్ 'లో' - "maranatha".
    ● తెలుగు 'లో' - "ప్రభువు వచ్చుచున్నాడు", "ప్రభువా రమ్ము", "ప్రభువు వచ్చియున్నాడు", మరియు "మరన త".
● పరిశుద్ధ గ్రంథము అంతటిలో "మరనత" అనే పదమును 1కోరింథీయులకు. 16: 22 మాత్రమే చూడగలము.
● ప్రభువు వస్తే ఏమి జరుగుతుంది భక్తిహీనుల మీద తీర్పు జరుగుతుంది.
● అది ఒక హెచ్చరిక కలిగిన పదము జాగ్రత అనే ఉద్దేశ్యము.
■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు  "మరనత" అని సంబోధించాలని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు. అలా పిలవాలని మాదిరి కూడా లేదు.


                    🌹షాలోమ్🌹
    ● హీబ్రూ 'లో'-  "שָׁלוֹם‎". (šā·lō·m)
    ● గ్రీక్ 'లో' - "Εἰρήνην". (eirēnēn)
    ● ఇంగ్లీష్ 'లో' - "peace".
తెలుగు 'లో' - "శాంతి, సమాధానము"
◆ శాంతి అనగా అర్ధము "ఆనందము, హాయి".
◆  కొని వచనములు చూద్దాము..
(నిర్గమ. 14:14; సంఖ్యా. 6:26; యెషయా. 26:12; యోహాను. 14:17; కోలాస్సి. 3:15).
■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు  "షాలోమ్" అని సంబోధించాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు.


               🌹వందనములు🌹
   ● గ్రీక్ 'లో' - "ἀσπάσασθε" (అస్పసస్తే).
   ● ఇంగ్లీష్ 'లో' - "Salute, Greet".
   ● తెలుగు 'లో' - "వందనములు లేదా శుభము".
★  "వందనములు" అనగా అర్ధము " అభివాదనము, నమస్కారము, అభినందనము...".

🌹 వందనము చేయుట ఇశ్రాయేలు వారికి సహజ వాడుక అది వారికి గౌరవం ఇచ్చు పుచ్చుకొనుట :-
👉🏽 పాతనిబంధనలో :-
★ ఆదికాండము 42:6
అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారియై యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనముచేసిరి.
★ 1సమూయేలు 13:10
అతడు దహనబలి అర్పించి చాలిం చిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలిసికొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగ
★ నిర్గమకాండము 18:7
మోషే తన మామను ఎదుర్కొన పోయి వందనము చేసి అతని ముద్దు పెట్టు కొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలిసికొని గుడారములోనికి వచ్చిరి.
👉🏽 క్రొత్త నిబంధనలో :-
★ మత్తయి 5:47
మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.
★ లూకా 1:41: ఎలీసబెతు మరియయొక్క వందనవచనము విన గానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను
ప్రతి పత్రిక నందు ఈ పదము చూడగలము విశేషముగా రోమా 16 అధ్యాయము చదువుము..


✴️ సహోదారులకు వందనము చేయుట ఒక ఆజ్ఞ:-
      ★ రోమీయులకు 16:16
పవిత్రమైన ముద్దుపెట్టుకొని "యొకని కొకడు వందనములు చేయుడి." క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.
       ★ ఫిలిప్పీయులకు 4: 21
" ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి".
✴️ పవిత్రమైన ముద్దు పెట్టుకొనుట నిజమైన ప్రేమకు ఒక చిహ్నము:-
       ★ 1పేతురు 5: 14
" ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి".
       ★ 1థెస్సలొనికయులకు 5: 26
పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.
       ★ రోమీయులకు 16: 16
పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి.
యూదులు యొక్క ఆచారము వారు తోటి సహోదరులుకి వందనము చెప్పినప్పుడు పవిత్రమైన ముద్దుతో లేదా తలలు వంచి వందనములు చెప్పేవారు

✴️ వందనము చేయుట మనకు అపోస్తులు నేర్పిన మాదిరి:-
         ★ 2కోరింథీయులకు 13: 13
"పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు".
        ★ 2థెస్సలొనికయులకు 3: 17
పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను; ప్రతి పత్రికయందును అదే గురుతు, నేను వ్రాయుట ఈలాగే.
         ★ హెబ్రీయులకు 13: 24
మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి.
          ★ తీతుకు 3:15
నాయొద్ద ఉన్నవారందరు నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమునుబట్టి మమ్మును ప్రేమించువారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికి తోడైయుండును గాక.
Note:-
          సహోదరుడు వందనము చేసినయెడల ఎదుటివాడు వందనము చేయని యెడల అతనిలో రెండు కారణములు కలవు..
1. అతను దేవుని ప్రేమ లేనివాడై ఉండాలి
2. క్రీస్తు బోధ నుండి తొలిగిన వాడైన ఉండాలి - 2యోహాను 9-11


చాలామంది తమ ప్రార్ధనలలో "తండ్రి నీకే వందనములు" అంటూ ప్రార్ధన చేయుదురు అది తప్పు.
వందనములు సహోదారులకు మాత్రమే చెప్పవలెను యెహోవా తండ్రి మనకు సహోదరుడు కాదు ఆయన మనకు తండ్రి అందువలన ప్రార్ధనలలో తండ్రికి వందనము చేయరాదు..

          రోమీయులకు 16: 16
🙏 "క్రీస్తుసంఘములన్నియు"
మీకు వందనములు చెప్పుచున్నవి 🙏


మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

పాస్టర్ లేని సంఘములో న్యాయకత్వము


పెద్దలు లేకుండానే స్థానిక సంఘము ఉండవచ్చు.
అపో 13,14 అధ్యాయములలో పౌలు మొదటి ప్రయణములో పౌలు సీలలు పలు స్థానిక సంగములు స్థాపించారు తిరిగి వస్తూ వారు పెద్దలను ఏర్పర్చారు అంటే ఈ మధ్య సమయములో సంఘము ఉందని అర్ధం అవుతుంది.

స్థానిక సంఘము పెద్దలను ఏర్పరిచే పనిలో ఉండాలి.
స్థానిక సంఘము పెద్దలు లేకుండా ఎంతకాలం ఉంటుందో దానికి పెద్దలు అవసరం అని చెప్పాడములో సంఘానికి లోపము ఉన్నట్టు అర్ధం.
తీతుకు 1:5
నేను నీకాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.
అక్కడ తీతును విడిచి పెట్టక మునుపు స్థానిక సంగములు ఉన్నాయి అయిన అక్కడ పెద్దలను నియమించాల్సిన అవసరమేమి?
అని విధాలుగా సంఘము సంపూర్ణమవ్వాలంటే పెద్దలు ఉండాలి అని దేవునికి తెలుసు. అందుకే తీతును విడిచి వచ్చాడు..

🌹 పెద్దలు నియమించదములో కొని స్థానిక సంగములు ఎందుకు నిదానంగా ఉంటున్నాయి?
-- పెద్దలను ఏర్పాటు చేసే బిసినెస్ మీటింగ్ లో తమకున్న న్యాయకత్వం పోతుంది అనే భయం.
-- పెద్దలతో పోల్చితే వీరికి మాట చెల్లదనే భయం
పెద్దలు లేని సమస్యను పరిష్కరించేది ఎలాగూ?
తగినంత కాలములో పెద్దలను నియమనించుటకు స్థానిక సంఘము ఏయే పద్ధతులను అవలంబించాలి??
-- మనుష్యులను convert చెయ్యాలి
-- క్రొత్తగా మారిన వారికి తర్పిదు నిమ్ము.
-- వారిని న్యాయకత్వములో దింపాలి.
-- తద్వారా వారు నాయకులుగా తయారు అవుతారు.
పెద్దలు లేని సంఘములో బిసినెస్ మీటింగ్ లు ఏర్పాటు చేసుకోవాలి..
న్యాయకత్వపు సామర్ధ్యాన్ని పురుషులు సాధనము చేయడానికి ప్రారంభించాలి.

--------- ౦ ----------

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

పాస్టర్ గారికి ఉండవాల్సిన అర్హతలు, బాధ్యతలు మరియు నియామకం




క్రొత్త నిబంధన సంములో పెద్దలు ఉన్నట్టు ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు - అపో 11:30; 14:23; 15:6;  పిలిప్పు 1:1; తీతు 1:5; 1 పేతురు5:1-5.
పెద్దలకు ఒక పని ఉంది
అపొస్తలుల కార్యములు 20:28
దేవుడు(అనేక ప్రాచీన ప్రతులలో-ప్రభువు అని పాఠాంతరము) తన స్వరక్తమిచ్చి సంపాదించిన "తన సంఘమును కాయుటకు" పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
పెద్దలన్న, అధ్యక్షులన్న, కాపరులన్న, బిషప్ అనిన ఒక్కటే అర్ధం వీరికి ఒక్కటే అర్హతలు ఇవ్వబడినవి...
యేసుక్రీస్తు యొక్క అపోస్తులులు ఇప్పుడు శరీరంతో లేరు అయితే వారి తరవాత ప్రతి స్థానికసంఘములో పెద్దలందలనేది దేవుని సంకల్పముమైంది.
యేసుక్రీస్తు ప్రధాన కాపరైతే ఆయన తరవాత ఈ పెద్దలే కాపరులుగా ఉన్నారు..1 పేతురు 5:1-5
క్రీస్తు సార్వత్రిక నాయకుడైతే పెద్దలు వారి మధ్యనున్న దేవుని మందపై నాయకులు - 1పేతురు 5:2; హెబ్రీ 13:17.
దీనిని బట్టి పెద్దలకు స్థానిక సంఘములో ఒక ప్రాముఖ్యమైన స్థానం ఉందని అర్ధం అవుతుంది..

పెద్దలకు వాడబడిన ఇతర పదాలు:-
గ్రీకు - ఇంగ్లీష్ -  తెలుగు - వచనములు
Presbuters - elders - పెద్దలు - అపో 14:23; 20:17
Episkopos - bishop/overseers  - అధ్యక్షులు అపో 20:28, పిలి 1:1
Poimen - pastor/shepherds - కాపరులు - అపో 20:28, 1పేతురు 5:2, ఎపేసి 4:13.
పెద్దలన్న, అధ్యక్షులన్న, కాపరులన్న అన్ని ఒకే బాధ్యతలను చేపట్టు పెద్దలకు సంబంధించిన పదములు...
కానీ పాస్టర్ గారికి తెలియదేమో వారు సువర్తికుడు, పెద్ద, ఉపదేశకుడు అంటే ఒక్కటే అనే భ్రమలో ఉన్నారు.
బయట ఏ మతశేఖ చూసిన ఆ ఒక్కో శేఖకు ఒక్కో పాస్టర్ మాత్రమే ఉంటాడు, కానీ గ్రంధం ఏమి చెప్తుండంటే ఇద్దరు లేదా ఎక్కువ మంది కాపరులు ఉండాలి అని చెప్తుంది ఎందుకంటే సంఘము క్రీస్తుది వీరు పనివారు తన స్వలాభము కొరకు సంఘాన్ని ఈ ఒక్క పాస్టర్ పాడు చేసే అవకసం ఉంది...
యాకోబు 5:14
అపోస్తులు 14:23
తీతు 1:5
నేడు మనం చేసే ఏ పాస్టర్ లోను పెద్దకు తగిన అర్హతలు లేవు అదెలాగో చూద్దాం..

            🌹పెద్దలకు గల అర్హతలు:-🌹
1తిమోతి 3:1-7; తీతు 1:5-9; 1 పేతురు 5:1-5.

👉 పెద్దలకు ఉండవాల్సినవి :-
1. నిందారహితుడును
2. ఏకపత్నీ పురుషుడును
3. మితానుభవుడును
4. స్వస్థబుద్ధిగలవాడును
5. మర్యాదస్థుడును
6. అతిథిప్రియుడునను
7. సాత్వికుడును
8. బోధింపతగినవాడునైయుండి, 
9. విశ్వాసులైన పిల్లలుగలవాడునైయుండవలెను
10. తన పిల్లలను స్వాధీనపరుచుకొనువాడు.
11. సజ్జన ప్రియుడును(సద్విష్యప్రియుడును)
12. నీతిమంతుడును
13. పవిత్రుడును.
14. దేవుని గృహ నివ్వకునివలె ఉండాలి
15. ఆశానిగ్రహముగలవాడునైయుండాలి
16. తాను హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును
17. ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు
18. ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను.
19. సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను. 
20. సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన వాడైయుండవలెను.
21. సిద్ధమనసుతో మందను పై విచారణ చేయువాడు - (1 పేతురు 5:2,3)
22. మందకు మాదిరిగా ఉండాలి - (1 పేతురు 5:2,3)
23. క్రూరమైన తోడేళ్ళు విషయమై జాగ్రత్తగలవాడును (అపో 20:28,29)
24. దేవుని చిత్తప్రకారము చేయువాడు 1పేతు 5:2
25. ఇష్ట పూర్వకముగాను చేయవలెను 1పేతు 5:2
దుర్లాభా పేక్షతోకాక 
26. సిద్ధమనస్సు గలవాడు 1పేతు 5:2.

👉 పెద్దలకు ఉండకూడనివి:-
1. స్వేచ్ఛాపరుడును
2. ముక్కోపియు
3. మద్యపానియు
4. కొట్టువాడును
5. దుర్లాభము అపేక్షించువాడును కాక
6. దుర్వ్యాపారవిషయము నేరము మోపబడనివాడై ఉండాలి.
7. జగడమాడనివాడును
8. ధనాపేక్ష
9.అతడు గర్వాంధుడై అపవాదికి(సాతానుకు) కలిగిన శిక్షావిధికి లోబడకుండు నట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు. 
10. మందకు ప్రభువులై ఉండకూడదు - 1పేతు 5:3
11. బలిమి చేత సేవ చేయకూడని వాడు 1పేతు 5:2
       ఈ పెద్దలను ఎవరు నియమిస్తారు?
సువర్తికులు ఈ పెద్దలను తయారు చేస్తారు.
            🌹తీతు 1:5; అపో 14:23🌹


మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

యేసు సిలువలో తప్పించుకుని వెళ్లిపోయాడా?

➤  సిలువలో స్పృహ కోల్పోయాడు(Swoon Theory):

యేసుక్రీస్తు సిలువలో మరణించలేదు కేవలము స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోయిన అతనిని సమాది చేశారు అతడు తరువాత స్పృహలోకి వచ్చి కోలుకొని రాయిని తీసుకుని బయటికివచ్చి తన్నుతాను సజీవునిగా కనబరచుకున్నాడు. దీనిని నమ్మిన శిష్యులు ఆయన తిరిగి లేచాడని ప్రచారం చేశారు. అన్నది కొందరి వాదన.
అహమదీయ అనే ముస్లీము తెగ విశ్వాసము ప్రకారము- యేసుక్రీస్తు సిలువపై స్పృహ కోల్పోయి, సమాధి చేయబడి, తిరిగి లేచి గలిలయకు వెళ్ళి అక్కడ నుండి ఇరాక్ కు వెళ్ళి అక్కడ నుండి అఫ్ఘనిస్తాన్ కు ఆ తరువాత కాశ్మీర్(ఇండియా)కు వెళ్ళి అక్కడ 120సంవత్సరములు జీవించి మరణించాడు. శ్రీనగర్ లో అతని సమాది ఉంది. ఇది అహమదీయ వారి వాదన, అయితే ఈ వాధనను సాంప్రదాయ ముస్లిములు వ్యతిరేకిస్తున్నారు.
ఇక్కడ యేసుక్రీస్తు చనిపోలేదు అని అంటే పునరుత్థానమయ్యాడు అన్న ప్రశ్నేలేదు. అప్పుడు క్రైస్తవ్యమే పుర్తిగా తప్పు అవుతుంది అన్నది వారి యొక్క ఉద్దేశ్యం. దీనికి వారికున్న ఆధారం ఏమిటీ అని అంటే, యేసుక్రీస్తు సిలువమీద తక్కువ సమయం ఉండడమే.

మొదటిగా ఇది వారియొక్క కల్పిత సిద్ధాంతము మాత్రమేగాని నిరూపించబడిన విషయం కాదు. దీనికి ఏ ఆదారము లేదు! అని గమనించాలి
దీనివల్ల సమస్య ఏమిటంటే యూదులు, రోమా ప్రభుత్వము తెలివితక్కువగా మోసపోయారు; చనిపోని వ్యక్తిని చనిపోయినట్లు భావించారు, యేసు శిష్యులు ఆయన తిరిగి లేచాడని నమ్మడం బుద్దిహీనత మరియు యేసుక్రీస్తు కావాలని ఒక అబద్దాన్ని ప్రచారం చేశాడని అర్థం.

దీనిని అర్థం చేసుకోవడానికి మనము సిలువ వేయడం(Crucifixion గురించి తెలుసుకోవాలి. సిలువ మరణం చాలా మెల్లగా(slowly) క్రూరంగా(Cruelly) ఒకరిని మరణింపజేయడం. నిజానికి సిలువమరణం, కాళ్ళల్లో, చేతుల్లో మేకులు కొట్టడం వల్ల మరణింపజేయడం కాదుగాని, శ్వాస తీసుకోలేక పోవడం వల్ల మరణింపజేసే విధానము. దీనినే వైద్య పరిభాషలో ‘Asphyxial death' అంటారు.

సిలువ వేయబడిన మనిషి బరువు మొత్తం, నడుమును కట్టియుంచనందున అతని కాళ్ళ మీద మరియు చేతులమీదే పడుతుంది. సిలువలో వ్రేలాడిన మనిషి తన రెండు కాళ్ళ మీద తన బరువును మోపి చేతులపై భారమువేసి పైకి లేస్తేనేగాని అతడు శ్వాస తీసుకోలేడు, కాబట్టి తను శ్వాస తీసుకోవాలంటే మాటి మాటికి తన కాళ్ళ మీద తన బరువును మోపి చేతులపై భారమువేసి పైకి లేవాలి, అయితే చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు కొట్టడంవల్ల తను శ్వాస తీసుకోవడానికి లేచిన ప్రతీసారి కాళ్ళల్లో చేతుల్లో విపరీతమైన బాధ అనుభవించాల్సివస్తుంది. రానురాను నొప్పి భరించే శక్తిలేక పైకిలేవడం వదిలివేసి శ్వాసతీసుకోలేక మరణించడం అన్నమాట.

యేసుక్రీస్తుకు చెరో వైపున ఉన్న దొంగల కాళ్ళు విరగొట్టారు దీనికి కారణం: యూదులు, సబ్బాతు రోజు ఆరంభం కాకముందే శవాలను సిలువ మీది నుండి దించాలి. కాబట్టి సిలువవేయబడినవారు త్వరగా చనిపోవడానికి వారి కాళ్ళను విరగ్గొట్టారు. ఎందుకంటే వారు ఇక శ్వాస తీసుకోలేక మరణిస్తారు. కాని యేసుక్రీస్తు అప్పటికే చనిపోవడం చూసి ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు. రోమా సైనికులు చనిపోయాడని నిర్ధారించుకునేంతవరకు శవాన్ని అప్పగించరు. అందుకే యేసును వారు ప్రక్కలో బళ్ళెంతో పొడిచి చూసారు (యోహాను 19:34,35). వెంటనే రక్తము,నీళ్ళూ రావడము నమోదు చేయబడింది. గుండె చుట్టూ పెరికార్డియం(Pericardium) అనే పొర ఉంటుంది దీనిలో సీరస్(serous) అనే ద్రవము(నీరు) ఉంటుంది. బళ్ళెంతో పొడిచినప్పుడు ఈ నీరు, గుండె కుడి ప్రక్కనుండి రక్తం బయటికి వచ్చాయి. ఒకవేళ యేసుక్రీస్తు బ్రతికి ఉన్నా ఈ బక్ళెంపోటుకైనా మరణించాలి.

స్పృహ  కోల్పోయిన యేసును సమాధి చేసారు, స్పృహలోకి వచ్చి, కోలుకొని, రాయిని తీసుకుని బయటికివచ్చి, తన్నుతాను సజీవునిగా కనబరచుకున్నాడు” అని చెప్పే వీరిమాట నిజం కావాలంటే యేసు మూడు అడ్డంకులు అధిగమించి రావాలి,

1) ఆయన శరీరానికి నారబట్ట చుట్టి పూసిన సుగంధ ద్రవ్యాలు ఎండిపోయి గట్టిగా ఆయనను బంధించి ఉంచుతాయి కాబట్టి వాటిని ఎలా తొలగించుకున్నాడు అన్నది ప్రశ్న! ఎందుకంటే ఆయనకు పూసిన సుగంధ ద్రవ్యములు(గోపరసము లేదా బోళము +కలబంద) 150 సెర్ల ఎత్తు(దాదాపు 45kg)(యోహాను 19:39), అతుక్కునే జిగురు వంటి పదార్థం ఇందులో ఉంటుంది. ఆయన దేహానికి వాటిని పూసి నారబట్టతో అతనిని కాళ్ళ నుండి పైకి అంతా చుట్టుతూ, చేతులు శరీరానికి చక్కగా ఆనించి వాటిని కూడా చుట్టి, ముఖానికి తలకు ఒక వేరే నారబట్టను గట్టిగా చుట్టి కట్టి సమాధిలో ఉంచారు. అసలు తలకు మొత్తం వస్త్రం చుట్టినప్పుడైనా ఆయన మరణించాలి, సరే దానిని అదిగమించిన మూడు దినములకు ఆ నారబట్ట శరీరానికి గట్టిగా అతుక్కుని ఉంటుంది. సుహ వచ్చిన యేసు వీటిని ఎలా విడిపించుకున్నాడు! అది సాధ్యమయ్యే పనేనా!

2) సమాది ముందు ఉంచిన పెద్దరాయి: ఆ రాయి యెంతో పెద్దది అని మర్కు 16:4లో ఉంది. దీని బరువు తక్కువలో తక్కువ(minimum) 1300కిలోల నుండి 1800ల కిలోల వరకు ఉంటుంది అని ఒక అంచనా. సమాధికి ముందే యేసుక్రీస్తును 39 కొరడా దెబ్బలు కొట్టారు, వళ్ళంతా గాయాలు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, ప్రక్కలో బళ్ళెంపోటు, శరీరంలో నుండి రక్తం అంతా పోయింది, అంతేగాక సమాదిలో మూడు రోజులుగా ఆహారం లేదు. బ్రతికి ఉన్నా వైద్యం చేయించుకోనిదే నడువలేని స్థితి, ఈస్థితిలో ఆయన అంత బరువున్న రాయిని ఎలా కదిలించి బయటికి వచ్చాడు అన్నది ప్రశ్న!

3) కాపలా ఉండిన రోమా సైనికులు: ఒకవేళ యేసు క్రీస్తు  రాయి తీసుకుని వచ్చి ఉంటే రోమా ప్రభుత్వానికి కాపలాదారులు తెలియజేసేవారు. ఆయనను బందించి రోమా ప్రభుత్వానికి అప్పగించేవారు కాని అలాంటిదేమీ జరుగలేదు.

కాబట్టి తేలిన పలితార్థమిదే - స్పృహ  కోల్పోయాడు అనేది ఒక కట్టుకథ.

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880