తీతు 2:13లోని మహాదేవుడేవరు? ఏసా? యెహోవానా?





మహా దేవుడెవరు?
దేవుని మరియు యేసుక్రీస్తు "మహిమ ప్రత్యక్షత"
మహా దేవుడు అని ఉందని చాలామంది విశ్వాసులు యేసుక్రీస్తు మహా దేవుడు అని అనుకుంటూ తమ మనసుల యందు రెండవ మహాదేవుని చేర్చి బహుదేవతరాధన చేయుచున్నారు.

మహాదేవుని గూర్చి భక్తుల సాక్ష్యము ఏమిటి? పౌలు ఏమి చెప్పదలచాడు అనేది ఆలోచన చేయాలి.

భక్తుల మాటలలో :-
★ ద్వితియోపదేశకాండము 7:21 - వారిని చూచి జడియవద్దు; నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన *మహాదేవుడు.*

★ ద్వితియోపదేశకాండము 10:17 - ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. *ఆయనే మహాదేవుడు* పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.

★ ఎజ్రా 5:8 - రాజవైన తమకు తెలియవలసిన దేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్లితివిు, అక్కడ *మహాదేవుని* యొక్క మందిరము ఉన్నది; అది గొప్ప రాళ్లచేత కట్టబడినది, గోడలలో మ్రానులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచు వారిచేతిలో వృద్ధియగుచున్నది.
This is to give the king word that we went into the land of Judah, to the house of the " great God, " which is made of great stones, and has its walls supported with wood, and the work is going on with industry, and they are doing it well.

★ నెహెమ్యా 8:6 - ఎజ్రా *మహాదేవుడైన* యెహోవాను స్తుతింపగా జనులందరు తమ చేతులెత్తిఆమేన్‌ ఆమేన్‌ అని పలుకుచు, నేలకు ముఖములు పంచుకొని యెహోవాకు నమస్కరించిరి.

★ కీర్తనలు 95:3 - యెహోవా *మహాదేవుడు* దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు

★ దానియేలు 2:45 - చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే; యిందువలన *మహాదేవుడు* ముందు జరుగ బోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు; కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను.

★ దానియేలు 7:9 - ఇంక సింహాసనములను వేయుట చూచితిని; *మహా వృద్ధుడొకడు కూర్చుండెను.* ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహా సనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్ర ములు అగ్నివలె ఉండెను.



             తండ్రి మాత్రమే మహా దేవుడుగా చూశాము.. మరి తీతు పత్రికలో యేసుక్రీస్తు వారిని మహా దేవుడు అని అంటున్నాడు పౌలు, ఆ ఆలోచన ఎలా వచ్చింది పౌలుకు already మహాదేవుడు అంటే తండ్రి అనే విశ్వాసములో ఉన్న పౌలు క్రీస్తును ఏ విధముగా మహా దేవుడు అంటాడు ఒక సారి ఆలోచన చేయండి. పాతనిబంధన మొత్తము కూడా యెహోవానే మహా దేవుడు అని గోషిస్తుంది.

            పౌలు కూడా ధర్మశాత్రము బాగా తెలిసిన వ్యక్తి అందులో ప్రావీణుడు, అలాంటి పౌలు యెహోవా తండ్రిని ఆరాధన చేస్తూ, సాటి సహోదరుడగు(యోహాను 20:17) యేసుక్రీస్తును మహా దేవుడు అని ఎలా అనగలుగుతాడు?

          నిరంతరము యేసుక్రీస్తు పక్కనే ఉన్న పేతురు, యోహాను, యాకోబులే ఆయనను అలాగు సంభోదించలేదు. క్రీస్తు మహా దేవుడని ఏ ప్రవచనం చెప్పాడములేదు. ఇది కేవలం అక్షర దోషమే తప్ప వేరే అభిప్రాయం లేదని అర్ధం అవుతుంది..


ఇక్కడ  మహాదేవుని మరియు యేసుక్రీస్తు "మహిమ ప్రత్యక్షత" గురించి పౌల్ గారు మాట్లాడుతున్నారు.. 
ఇక్కడ ఒక కామ(,) లేకపోవడం వలన ఈ పదము అపార్ధం చేయబడినది. యేసుక్రీస్తు దేవుని(తండ్రి) మహిమను కలిగి ఉన్నాడు.. అయితే క్రీస్తు ప్రత్యక్షత - మహాదేవుని(తండ్రి) మరియు తన మహిమను కలిగి ఉంటుంది..

★ తర్జుమా ఇలా ఉండుంటే సులభముగా అర్ధం అవును.
13. Looking for that blessed hope, and the glorious appearing of the great God and our saviour jesus christ.
 "ఇట్లు ఇహలోక మందు జీవించుచు, సర్వోన్నతుడగు మన దేవుని, రక్షకుడైన మన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచియుండ వలెనని మనకు ఆ కృప తెలుపుచున్నది. - తీతుకు 2 : 13"


తీతు 2:13 వచనము విధానము అర్ధం కోసం కొన్నీ ఉదాహరణలు చూస్తే మీకు ఒక స్పష్టత వస్తుంది :-

★ మత్తయి 16:27   "మనుష్య కుమారుడు, *తన తండ్రి మహిమ గలవాడై,* తన దూతలతో కూడ రాబోవు చున్నాడు. అప్పుడాయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చును."
Matthew 16:27   `For, the Son of Man is about to come in the glory of his  Father, with his messengers, and then he will reward each,  according to his work.

★ మార్కు 8:38   వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు *తన తండ్రి మహిమగలవాడై* పరిశుద్ధ దూతలతో కూడ వచ్చునప్పుడు సిగ్గుపడును'' అని చెప్పెను.
Mark 8:38  for whoever may be ashamed of me, and of my words, in this  adulterous and sinful generation, the Son of Man also shall be  ashamed of him, when he may come in the glory of his Father,  with the holy messengers.'

★ లూకా 9:26   "నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును, *తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును."*
Luke 9:26   `For whoever may be ashamed of me, and of my words, of this  one shall the Son of Man be ashamed, when he may come in his  glory, and the Father's, and the holy messengers';

★ 1థెస్సలొనికయులకు 4:14: యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని *దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.*

తీతులో ఉన్నది తండ్రి కుమారుల మహిమ ప్రత్యక్షత గురించి మాత్రమేగాని  క్రీస్తు మహాదేవుడు అని చెప్పడం పౌలు ఉద్దేశ్యము కాదు..

------- ౦ -------
మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:

Post a Comment