పాత నిబంధన మరియు క్రొత్తనిబంధన
నేడున్న రోజులలో బైబిల్ ని విశ్వసించే వారు అధిక శాతం మంది పాత మరియు క్రొత్త నిబంధనల మధ్య తేడా వాటి తత్వం తెలియక ప్రతి వచనము మాకే రాయబడినది అని విశ్వసిస్తూ భ్రమలో బ్రతికేస్తున్నారు, ఎవరినైనా - మీరు ఏ నిబంధన వాడుతున్నారు అంటే - వారు మేము పాతనిబంధన మరియు క్రొత్త నిబంధన వాడుతాము, మరికొందరు నేను క్రొత్త నిబంధన మాత్రమే వాడతాను, ఇంకొందరు పాతనిబంధన మాత్రమే వాడతాను అందురు. అలాంటి వారికి ఈ అంశం అంకితం..
నిబంధన అనగా అర్ధం :--
హీబ్రు - barah (H1285)
గ్రీకు - diathēkēs (G1242)
హీబ్రు - barah (H1285)
గ్రీకు - diathēkēs (G1242)
ఒప్పందం, ఒడంబడిక, agreement, శాసనము, వీలునామా ఇలా అర్ధం వచ్చుచున్నది.
బైబిల్ ప్రకారం నిబంధన అంటే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలే, నిబంధన..
మొదటి 4 ఆజ్ఞలు దేవునివి
రెండవది 6 ఆజ్ఞలు మనుషులకు
ఈ 10 ఆజ్ఞలను క్రీస్తు 2 ఆజ్ఞలగా యేసుక్రీస్తు తెలియపరచాడు..
మత్తయి సువార్త 22:37-40అందుకాయననీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను.
ప్రతి రోజు మనిషి మరో మనిషితో ఒప్పందంతోనే జీవిస్తాడు.
నిబంధనలో - 1) ఆజ్ఞలు ఉంటాయి.
2) హక్కులు ఉంటాయి.
3) బాధ్యతలు ఉంటాయి.
4) నమ్మకములు ఏర్పడును.
5) సంబంధములు ఏర్పడును.
2) హక్కులు ఉంటాయి.
3) బాధ్యతలు ఉంటాయి.
4) నమ్మకములు ఏర్పడును.
5) సంబంధములు ఏర్పడును.
నిబంధనల విషయమై బైబిల్ ని మనము మూడు రకముల కాలములుగా/యుగములుగా విభజింపవలసివుంది.
1. పితరుల కాలము
-- ఆదాము నుండి సినాయిపర్వతం వరకు
-- ద్వితి 5:3
-- ఆదాము నుండి సినాయిపర్వతం వరకు
-- ద్వితి 5:3
2. మోషే/ధర్మశాత్ర యుగము
-- సినాయి పర్వతము నుండి AD70 వరకు
-- ద్వితి 5:3
-- సినాయి పర్వతము నుండి AD70 వరకు
-- ద్వితి 5:3
3. క్రీస్తు/క్రైస్తవ యుగము
-- క్రీస్తు బోధల నుండి శాశ్వతకాలము వరకు
-- యెషయా 55:3
-- క్రీస్తు బోధల నుండి శాశ్వతకాలము వరకు
-- యెషయా 55:3
అన్ని కాలములలో దేవుడు మనవులతో నిబంధనతోనే వ్యవహరించేవాడు.
పితరుల యుగములో దేవుడు వ్యక్తిగతముగా నిబంధన చేసుకొనెను.
⬇️⬇️
◆ ఆదాముతో :-
నిబంధన చేసుకొనెను - ఆది 2:17; హోషయా 6:7
⬇️⬇️
◆ ఆదాముతో :-
నిబంధన చేసుకొనెను - ఆది 2:17; హోషయా 6:7
◆ నోవహుతో :-
నిబంధనతోనే వ్యవహరించెను - ఆది 9:8-17
నిబంధనతోనే వ్యవహరించెను - ఆది 9:8-17
◆ అబ్రాహాముతో :-
A) సంతాన వాగ్దానం - ఆది 12:7, 13:15
B) భూ వాగ్దానం - ఆది 15:13
A) సంతాన వాగ్దానం - ఆది 12:7, 13:15
B) భూ వాగ్దానం - ఆది 15:13
◆ ఇస్సాకుతో -
తిరిగి అదే నిబంధన - ఆది 26:1-5
తిరిగి అదే నిబంధన - ఆది 26:1-5
◆ యాకోబుతో -
అబ్రాహాము నిబంధన యకోబుకు - ఆది 28:13-16
అబ్రాహాము నిబంధన యకోబుకు - ఆది 28:13-16
మోషే యుగములో దేవుడు ఒక "సమాజముతో" నిబంధన చేసుకొనెను అదే ధర్మశాస్త్రము :-
నిర్గమకాండము 34:27,28
మరియు యెహోవా మోషేతో ఇట్లనెనుఈ వాక్యములను వ్రాసికొనుము; ఏలయనగా ఈ వాక్యములనుబట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసియున్నాను.
అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతో కూడ అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు; అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను.

★ ఈ నిబంధన యొక్క పూర్వ చరిత్ర:-
అపొస్తలుల కార్యములు 7:8-14
ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతిచేసెను; ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఆ గోత్రకర్తలు మత్సరపడి, యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరిగాని, దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరోయెదుట అతనికి అను గ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటికిని కరవును బహు శ్రమయువచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని, మన పితరులను అక్కడికి మొదటి సారి పంపెను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసి కొనెను; అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. యోసేపు తన తండ్రియైన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను; వారు డెబ్బదియయిదుగురు.

★ యాకోబు తన డెబ్బదిఅయిదు కుమారులతో ఐగుప్తు వెలుట - ఆది 46:3
★ వారు యేసేపు హయాంలో బహుగా విస్తరించారు - నిర్గమ 1:1-5
★ ఐగుప్తు లో 400 సం"లు తరవాత సినాయి కొండకు వచ్చే సమయానికి వారు 605550 మంది అయిరి - సంఖ్య 1:45,46
వీరు గాక లేవిగోత్రికులు 20,000 మంది -సంఖ్య 3:39. etc...
వీరు గాక లేవిగోత్రికులు 20,000 మంది -సంఖ్య 3:39. etc...
★ యకోబు సంతానము ఐగుప్తుని విడి ఎర్రసముద్రము దాటి సినాయి పర్వతము దగ్గరకు వచ్చారు, అప్పుడు ఈ నిబంధన దేవుడు వారితో చేసాడు - నిర్గమ 19:23. -- ద్వితి 5:1-5.
⭕ పాత నిబంధన యొక్క స్వభావము ⭕
⬇️
1️⃣ నిబంధన దేవుడే చేసాడు - ద్వితి 5:2.
⬇️
1️⃣ నిబంధన దేవుడే చేసాడు - ద్వితి 5:2.
2️⃣ ఈ నిబంధన దేవునికి ఇశ్రాయేలుకు మధ్య జరిగింది. ద్వితి 5:1.
3️⃣ ఈ నిబంధన 10 ఆజ్ఞలను కలిగి ఉంది. - ద్వితి 4:13
4️⃣ మోషే నిబంధనను మధ్యవర్తి - ద్వితి 5:4,5.
5️⃣ ఈ నిబంధన సినాయి/హోరెబు పర్వతం వద్ద జరిగింది. - ద్వితి 5:2-21.
6️⃣ ఈ నిబంధనగల 2 పలకలు మందనములో పెట్టబడినవి. దానిని నిబంధనమందసం అని అందురు - ద్వితి 10:1-5.
7️⃣ ప్రజలు ఐగుప్టుని వీడిన తరవాత దేవుడు వారితో నిబంధన చేసాడు. - ద్వితి 5:1-4.
8️⃣ నిబంధన రక్తముతో చేయబడినది. - హెబ్రీ 9:18-20.
9️⃣ ఈ నిబంధన అనుసరిస్తే కొని దివేనాలున్నాయి. - నిర్గమ 19:5,6B.
1️⃣0️⃣ ఈ నిబంధన అతిక్రమిస్తే కొని శాపాలు వస్తాయి. -
లేవి 26:14- 40.
లేవి 26:14- 40.
1️⃣1️⃣ ఇది శారీరకంగా ఉన్న నిబంధన..
1️⃣2️⃣ ప్రవక్తల రచనలు ఈ 10 ఆజ్ఞలను ఉల్లంఘించకుండా ఆధారముగా(మార్గము) ఉన్నవి..
1️⃣3️⃣ ఈ నిబంధన 39 పుస్తకముతో కూడినది,
1️⃣2️⃣ ప్రవక్తల రచనలు ఈ 10 ఆజ్ఞలను ఉల్లంఘించకుండా ఆధారముగా(మార్గము) ఉన్నవి..
1️⃣3️⃣ ఈ నిబంధన 39 పుస్తకముతో కూడినది,
1. ధర్మశాస్త్రము : ఆదికాండము - ద్వితీయోపదేశకాండము
2. చరిత్ర : యెహోషువ - ఎస్తరు
3. పద్యభాగము : యోబు - పరమగీతములు
4. ప్రవక్తల గ్రంథములు : యెషయా - మలాకీ.
ధర్మశాత్రము ఇజ్రాయెల్ వారి జాతీయ చట్టము :-
ద్వితీయోపదేశకాండము 4:7,8
ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్ర మంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది?

⭕ వారికి ప్రత్యేకించబడిన భూభాగము:-
ద్వితి 4:5
ద్వితి 6:1,2
⭕ వారికి ప్రత్యేకమైన పట్టణము :-
1 రాజులు 14:21
ద్వితీయోపదేశకాండము 12:11
నేను మికాజ్ఞా పించు సమస్త మును, అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కు బళ్లను మీ దేవు డైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే(యెరూషలేము) మీరు తీసికొని రావలెను.
⭕ వారిది ప్రత్యేక సంసృతి/ఆచారములు.
⭕ ప్రత్యేక వేషధారణ.
ఇశ్రాయేలు ప్రత్యతను చూసి వారి దేవుడే దేవుడు అని ఎరిగిన అన్యులు యూదా మతమును పుచ్చుకునే వారు వారిని యూదామత ప్రవిష్టులు అని అందురు.
ఉదాహరణకు :
● రుతు
మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించు కొననివానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవ మాన మగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలె నుండినయెడల సరి; ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని, మా పిల్లలను మీ కిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని, మీ మధ్య నివసించెదము, అప్పుడు మనము ఏకజనమగుదుము.
★ వాగ్ధానాభుమిలో ప్రవేశించిన తరవాత ఈ క్రింది విధముగా చేయుడని దేవుడు ఇజ్రాయెల్ కు ఆదేశించాడు :-
◆ వారి దాన్యములో 10వ వంతు వారి మందలో తొలిచులును యెరూషలేములోనే తినాలి -
ద్వితి 12:17-22, 26-28
ద్వితి 14:23-26.
◆ వారి దాన్యములో 10వ వంతు వారి మందలో తొలిచులును యెరూషలేములోనే తినాలి -
ద్వితి 12:17-22, 26-28
ద్వితి 14:23-26.
◆ యెరూషలేములొనే బలులు అర్పించాలి - ద్వితి 12: 13,14,26
పండుగలు : ద్వితి 16:2-15
పండుగలు : ద్వితి 16:2-15
అందరూ యెరూషలేములొనే హాజరు కావాలి -ద్వితి 16:16.
◆ యజకులచే కోర్టు కేసులు ఇక్కడే విచారించబడేవి- ద్వితి 17:8-13
ద్వితి 31:10,11
ద్వితి 31:10,11
◆ పండగలు వాగేరా అంశములు వీరికి మాత్రమే చెందినవి.
కీర్తనల గ్రంథము 81:1-4
మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్యనాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము.
పాత దానిలో నుండి క్రొత్త దానికి ⏩ నిబంధనలో మార్పు:-
⬇️
దేవుడు పాత నిబంధన నుండి క్రొత్త దానికి ఎందుకు మరలనుకున్నాడు అంటే పాత నిబంధన అలక్యం/నిర్లక్ష్యం చేసి దేవునికి భయంకరమైన విసుకు తెపించారు.
దేవుడు పాత నిబంధన నుండి క్రొత్త దానికి ఎందుకు మరలనుకున్నాడు అంటే పాత నిబంధన అలక్యం/నిర్లక్ష్యం చేసి దేవునికి భయంకరమైన విసుకు తెపించారు.
ఇశ్రాయేలు మరియు దేవుడు భార్యభర్తల బంధవ్యాని పోలివున్నారు.. యిర్మీ 31:32
వరుడు - దేవుడు
వధువు - ఇశ్రాయేలు
రిజిస్టర్ - మోషే
సాక్షులు - భూమ్యాకాశములు
దేవుడు భార్యకు పరిత్యాగా పత్రిక ఇచ్చేస్తాను అన్నాడు
⚠️ యిర్మీయా 3:6-9 చూడుము...
రెండు రాజ్యాల గూర్చిన విషయం - 1 రాజులు 12 అధ్య చదువుము..
⏩ ఉత్తర/ఇశ్రాయేలు రాజ్యము -
-- 10 గోత్రములు
-- 19 మంది రాజులు
⚠️ యిర్మీయా 3:6-9 చూడుము...
రెండు రాజ్యాల గూర్చిన విషయం - 1 రాజులు 12 అధ్య చదువుము..
⏩ ఉత్తర/ఇశ్రాయేలు రాజ్యము -
-- 10 గోత్రములు
-- 19 మంది రాజులు
⏩ దక్షిణ/యూదా రాజ్యము -
-- 2 గోత్రములు (యూదా+బెన్యామీను)
-- 20 మంది రాజులు
-- 2 గోత్రములు (యూదా+బెన్యామీను)
-- 20 మంది రాజులు
ఇజ్రాయెల్ ప్రజలు వారు చేష్టల చేత యెహోవాకు బయమకరమైన విసుకు కల్గించారు :-
న్యాయది 2:15-22
2 రాజులు 17-13-18
యెషయా 1:1-5
యిర్మీయా 2:25
యిర్మీయా 3:1-3
యిర్మీయా 6:16
యిర్మీయా 7:16-18
న్యాయది 2:15-22
2 రాజులు 17-13-18
యెషయా 1:1-5
యిర్మీయా 2:25
యిర్మీయా 3:1-3
యిర్మీయా 6:16
యిర్మీయా 7:16-18
■ అయిన దేవుడు తన భార్య చేసిన వ్యభిచారాన్ని సహించి క్షేమించి సమాధానము కొరకు ప్రయత్నాలు చేసాడు :-
◆ సమాధానము కొరకు దేవుడు ప్రవక్తలను పంపాడు.
◆ యిర్మీయా 7:1-5 చదువుము....
అయిన కానీ వారు మాట వినలేదు.
◆ యిర్మీయా 7:1-5 చదువుము....
అయిన కానీ వారు మాట వినలేదు.
2 రాజులు 23:27 - కాబట్టి యెహోవా-నేను ఇశ్రాయేలువారిని వెళ్లగొట్టినట్లు యూదావారిని నా సముఖమునకు దూరముగా చేసి, నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును, నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించెదనని అనుకొనియుండెను.
చివరిగా నిబంధనల గల మందసము దానిలోని నిబంధన పలకలు పోయాయి.. నిబంధనమందసం పోయింది... ఇపుడు నిబంధన మందసము లేదు, దానిలోని పలకలు లేవు, ఎలా ఆరాధన చేస్తారు?
యిర్మియా 3:16: మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు, అది వారి మనస్సు లోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసికొనరు, అది పోయి నందుకు చింతపడరు, ఇకమీదట దాని చేయరాదు; ఇదే యెహోవా వాక్కు.
♀️ ఇలాంటి పరిస్థితులలో దేవుడు క్రొత్త నిబంధన చేయబునుకొనెను అందుకే BC600 సం"లు క్రితం ప్రవచింపబడినది :-
★ యిర్మీయా 31:31-34ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదే యెహోవా వాక్కు.
★ యెషయా 55:3
చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.
చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.
★ మాలకి 3:1
ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

ఈ పాత నిబంధన A.D 70 యెరూషలేము నాశనము వరకు కొనసాగినది...
క్రొత్త నిబంధనను గూర్చిన సమాచారం part -2 లో చూద్దాము ...........
-------------- ౦ -------------
మీ
సహోదరుడు
Brother SURESH
9581881880
9581881880

No comments:
Post a Comment