విగ్రహరిప్తము క్రైస్తవులు తినవచున్నా లేక తినకూడదా?




విగ్రహ అర్పితములు తినవచ్చునా?

                       మనందరికీ ఉన్న సందేహము మనము విగ్రహ అర్పితమును తినవచున్నా లేక తినకూడదా? అనే సందేహము చాలా మందికి ఉంది, చాలామంది ఈ కారణమునా బంధువులకు దూరము చేసుకున్న సందర్భములు చాలా చూస్తున్నాము...

ఉదాహరణకు:- 
                     నాకు తెలిసిన ఒక కుటుంబముంది ఆ కుటుంబములో  పెళ్లిళ్లు అయిన అన్నదమ్ములు ఉన్నారు తమ్ముడు మాత్రం చదుకున్నవాడు క్రీస్తును నమ్ముకున్నవాడు మిగతా అన్న తలిదండ్రులు పూజలు చేసేడివారు. అన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగిందనుకోండి ఈ తమ్ముడు కుటుంబము వెల్లదు ఎందుకనంటే వాళ్లు విగ్రహాలకు పూజలు చేస్తారు ఆ ఫలహారం పంచుతారు. ఈ కారణము వలన అన్నదమ్ములు దూరమైపోయారు.
ఎలాంటి పరిస్థితులు నేడు మనకు చాలా ఎదురవుతున్నాయి... 

                     బంధువులు వారి ఇళ్లకు విందుకు ఆహ్వానిస్తే దాదాపుగా చాలా మంది వెళ్లారు ఎందుకని అంటే వాళ్లు పెట్టె బోజనములు తినవాలసివస్తుంది అందుకే వెళ్ళరు, దీనికి కారణము వారికి సరైన అవగాహన లేకపోవుటవలన...

బైబిల్ ఈ విషయమై అసలు ఎలాంటి వివరణ ఇచ్చిందో చూద్దాం...

విగ్రహములు వట్టివి అవి దేవుడు కాదు:-

1 కొరింథీయులకు 8:4
విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. 

ఈ విగ్రహములు మనుషులు చేసినవి -
కీర్తనల గ్రంథము 135:15 - అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు. 

యెషయా గ్రంథము 40:18-21
కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు? విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయును. విలువగలదానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పని వాని వెదకి పిలుచుకొనును. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటినుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటనుబట్టి మీరుదాని గ్రహింపలేదా? 

విగ్రహాలను నిర్మించిన మనుషులు కూడా అట్టివారే:-
యెషయా గ్రంథము 44:9,10,11
విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్‌ప్రయోజనములు తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని నొక దేవునిగా నిరూపించువాడెవడు? ఇదిగో దాని పూజించువారందరు సిగ్గుపడుదురు ఆ శిల్పకారులు నరమాత్రులేగదా? వారందరు పోగు చేయబడి నిలువబడవలెను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. 

వాటి స్థితి :-
కీర్తనల గ్రంథము 115:4-8
వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు. 

విగ్రహములు దేవుడు కాదుగాని యెహోవా ఒక్కడే దేవుడు :-
1 కొరింథీయులకు 8:4,5,6
కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము. 

ద్వితీయోపదేశకాండము 6:4 -ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. 

యెషయా 43:10: మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.

యెషయా 46:5: మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు? మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయు దురు?


విగ్రహరిప్తము  తినుటలో క్రైస్తవునికి స్వేచ్ఛ ఉంది -
1 కొరింథీయులకు 8:7
అయితే అందరియందు ఈజ్ఞానము లేదు. కొందరిది వరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు;
               తినడము వలన అందులో ఏమి ఉండదు కాదుగానీ అది విగ్రహములు ఇవ్వబడినది -  అలా యెంచి తినడము వలన మనసాక్షి వారిపై నేరం మోపింది. వివేచనాశక్తి లేని మనసాక్షి అంటే ఒక విషయం నిజానికి పాపం కాకపోయినప్పటికీ నీ ఆలోచనను బట్టి అది పాపమనుకునేది.

8.భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు. 
           - పౌలు అంటున్నాడు భోజనమును బట్టి ఎలాంటి మెప్పు ఉండదు, తినిన తినకపోయిన ఏమి కాదు అని చెప్తున్నాడు.. దీని అర్ధం సమస్త ఆహార పదార్ధములు మాములు ఆహార పదార్ధములే అందులో ఏ శక్తి ఉండదు అని.

రోమీయులకు 14:14 - సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని యెంచుకొనువానికి అది నిషిద్ధమే. 

1 కొరింథీయులకు 10:25-27
మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినపుడు వెళ్లుటకు మీకు మనస్సుండిన యెడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి.

మత్తయి సువార్త 15:17,18
నోటిలోనికి పోవునదంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా?

రోమీయులకు 14:20
భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయకుడి; సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. 
        - ఇది పవిత్రమే అని అనిపిస్తే అది తినేయవచ్చు..
విగ్రహాలకు అర్పించునవి తినుటలో క్రైస్తవునికి స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛను ఎవరు తృణీకరించకూడదు, ఈ విషయములో ఎవరికి నచ్చినది వారు చేయవచ్చు..

విగ్రహరిప్తము తినే నీ స్వేచ్ఛకు గల షరతులు :-

            నాకు స్వేచ్ఛ ఉంది ఎక్కడైనా తినేస్తా, ఇది తప్పు అని అంటున్నారు అందుకోసమైన తింటాను అని నువ్వు ప్రవర్తిస్తే అది నీకు ఒక సందర్భంలో పాపము అయిపోతుంది...

విగ్రహరిప్తము భోజనము కంటే ఒక బలహీనమైన మనసాక్షి గల సహోదరుడు ముఖ్యము.

1 కొరింథీయులకు 8:9-12
అయినను మీకు కలిగియున్న యీ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మన స్సాక్షిగల అతడు విగ్రహములకు బలియియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా? అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుటవలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను(మూలభాషలో-గాయపరచుటవలనను) , మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు.




వాటి ఆరాధన కార్యక్రమములలో పాలివారు కాకూడదు:

      కావున విగ్రహములైనను, విగ్రహరిప్తములైనను వట్టివైనందున(10:19) విగ్రహములకు అర్పించినవి తినట తప్పేమీ కాదు. అయితే విగ్రహములను ఆరాధిస్తున్నట్టుగా అన్యుల మతపరమైన పండుగలలో పాల్గునూట పాపము..  "విగ్రహముల రూపములో ఉన్న దేవుళ్లు నిజముగా లేనందున అన్యజనుల మాత సంబంధమైన కార్యములలో వారు అర్పించు బలులు అర్ధరహితమైనవి. నేను కావాలనుకుంటే పాల్గొనవచ్చును"  అనే నా ఆలోచనను పౌలు గద్దించాడు.. వారు అట్టి కార్యములలో పాల్గొనుట వలన దయ్యములతో సహవాసము  చేయుచున్నారని గద్దించాడు. (1కొరింథీయులకు 10:20-22) అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు.
మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడ పాలుపొందనేరరు.
ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?

- భోజన పదార్ధములు తినుటలో తిండిబోతు కాకుము..
రోమీయులకు 14:17: దేవుని రాజ్యము భోజన మును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.


ముగింపు:-
1. విగ్రహములు వట్టివి.
2. అవి దేవుడు కాదు, వాటిని దేవునిగా చూడరాదు.
3. విగ్రహరిప్తము తినుటలో ఏమి లేదు, తినకపోయిన ఏమి లేదు.
4. బలహీనమైన సహోదరుడు నీ యొద్ద ఉంటే వాని నిమిత్తము తినకపోవుట మంచిది, ఎందుకంటే ఆ ఆత్మ కోసం క్రీస్తు చనిపోయినది, ఆ భోజనము నిమిత్తము అతను బలహీనుడై మరల లోకంలోకి వెళ్లే ప్రమాదం ఉంది అందువలన ఆ భోజనము నిమిత్తము క్రీస్తు కార్చిన రక్తమును నిష్ప్రయోజనము చేయకుము...
5. ఆ భోజనము కంటే నీ సహోదారుడే ముఖ్యము...
6. వాటి పండుగ ఆచారములలో నివు పాలివాడుగా కాకూడదు..

గమనిక :
విగ్రహాల భోజనాలు మరియు ప్రసాదములు తినమని ప్రోత్సాహించడం నా ఉద్దేశ్యం కాదు, విగ్రహ
భోజనం కంటే ఒక బలహీనమైన మనసాక్షి గల సహోదారుడే ముఖ్యము..

https://drive.google.com/file/d/1M2pK6kAhZ7HbZu4DwXBPnr6NvSEunyuS/view?usp=drivesdk

మీ
సహోదరుడు
BROTHER SURESH
9581881880

No comments:

Post a Comment