యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడా?




ప్రశ్న : ఏసుక్రీస్తుకు కూడా దేవుడు ఉన్నాడా?
జవాబు : ఉన్నాడు ఆయనే యెహోవా.

యేసు క్రీస్తు నా అనినవి కొన్ని చూద్దాము:

● నా రక్తము
● నా శరీరము
● నా మాటలు
● నా సంఘము
● నా తండ్రి
నా దేవుడు


🍒 యేసు మాటలలో దేవుడు❓
యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరితిగా ఉన్నవాడు, ఇప్పుడో మాట తరవాత ఒకమాట చెప్పేవాడు కాదు..
         
          ◆ యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు కాబట్టే ఆయన తన జీవితకాలంలో యెహోవాకు ఆరాధన చేసాడు - (యోహాను 4:22)

          ◆ ఆయనకు దేవుడు ఉన్నాడు కాబట్టే ఆయన ఆజ్ఞలను పాట్టించాడు.

          ◆ ఆయనకు దేవుడు ఉన్నాడు కాబట్టే నిత్యము ప్రార్ధన చేసాడు.

          ◆ ఆయనకు దేవుడు ఉన్నాడు కాబట్టే తన సొంత బోధ చేయక యెహోవా మాటలే పలికెను.- యోహాను 12:49

          ◆ యేసుక్రీస్తును పుట్టుకకు మూలము? దేవుడు, యేసుక్రీస్తు బ్రతుకుకు మూలము దేవుడు, యేసుక్రీస్తు చనిపోయిన తరవాత క్రీస్తును లేపినది కూడా దేవుడే..


భూమి మీద ప్రజల మధ్య యేసుక్రీస్తు బోధ..
      👇👇👇👇👇👇👇👇👇
★ యోహాను సువార్త 17:3
అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, (తండ్రి)
నీవు పంపిన యేసు క్రీస్తును (కుమారుని) ఎరుగుటయే నిత్య జీవము.

★ మార్కు సువార్త 12:29
యేసుప్రధానమైనది ఏదనగాఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన (తండ్రి) ప్రభువు అద్వితీయ ప్రభువు.

★ మత్తయి సువార్త 27:46
ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు
నాదేవా, నాదేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని* అర్థము.


చనిపోయి తిరిగి లేచినపడు :-
      👇👇👇👇👇👇👇👇👇
★ యోహాను సువార్త 20:17
నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.


పరలోకంలో :-
👇👇👇👇👇
★ ప్రకటన గ్రంథం 3:2: నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము.

★ ప్రకటన గ్రంథం 3:12: జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు *నా దేవుని పేరును* పరలోకములో *నా దేవుని యొద్దనుండి* దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను *నా దేవుని పట్టణపు పేరును*, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.



📣క్రీస్తు శిస్యుల బోధలో ;-

    👇👇👇👇👇👇👇
★ 2 కొరింథీయులకు 1:3
మనప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక

★ ఎఫెసీయులకు 1:3
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక

★ ఎఫెసీయులకు 1:19
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్కదేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి....

★ 1 పేతురు) 1:3
మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక


👉ఎఫెసీయులకు 4:6 - అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి(మూలభాషలో-అందరిద్వారాను) అందరిలో ఉన్నాడు.


ముగింపు :-
1 కొరింథీ 11:3 - ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను.

◆ యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు, ఆయనే యెహోవా తండ్రి.

◆ క్రీస్తు తన దేవునికి - సేవకుడు, కుమారుడు, ఆరాధికుడు.

◆ యేసుక్రీస్తు దేవునికి గొర్రెపిల్ల.

--------- ౦ --------
మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:

Post a Comment