దేవత్వము

           

దేవత్వము (Godhead)
దేవత్వము యొక్క అర్ధము
- దేవుని తత్వము లేదా 
- దేవుని వలె, 
- దైవ స్వభావము  అనే అర్థం వస్తుంది.


ఉదాహరణకు:-
దృఢత్వము, క్రూరత్వము, మృదుత్వము, ఘనత్వము, మనవత్వము
ఇవి వాటి వాటి స్వభావములను చూపుతాయి కాబట్టి తత్వము అంటున్నాము..
అలాగే దేవత్వము కూడా దేవుని స్వభావాన్ని చూపుతుంది.
Strong's g2305
- Lexical: θειότης
- Transliteration: theiotés
- Part of Speech: Noun, Feminine
- Phonetic Spelling: thi-ot'-ace
- Definition: divinity, divine nature.
- Origin: From theios; divinity (abstractly).

చాలామంది దేవత్వము అనే అంశాన్ని చెప్తునము అంటు త్రిత్వమును బోధించేద్దారు ఒక లింక్ పెడుతున్న చూడండి అందులో ఉన్న త్రిత్వమే నేడు దేవత్వముగా చెప్తున్నారు.

http://www.sajeevavahini.com/Information.aspx?c=161

-------------------
దేవత్వము క్రొత్తనిబంధంలో 3 సార్లు ఉంది.

1. అపో.కార్యములు 17:29: కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను "దేవత్వమును" పోలి యున్నదని తలంపకూడదు.

2. రోమీయులకు 1:20: ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు "దేవత్వమును", జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.

3. కొలస్సీయులకు 2:9: ఏలయనగా "దేవత్వము యొక్క" సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది;

దేవత్వము అంటే తండ్రి కుమార పరిశుద్త్మ త్రియేకదేవుడు ముగ్గురు దేవత్వములో యేకమై ఉన్నారు అని అందురు కానీ బైబిల్ తెరచి వాస్తవం గ్రహించే ప్రయత్నం చేయరు. 


దేవత్వము యొక్క ఉనికి

రోమా 1.20 చదువుము
ఆయన(యెహోవా) అదృశ్యా గుణలక్షణములు
1. నిత్యాశక్తి
2. దేవత్వము

దేవత్వము ఎవరి గుణలక్షణము అయ్యివుండలి?
యెహోవాతండ్రి లక్షణము.

- దేవుడు అంటే యెహోవాతండ్రి (1 కోరింది 8.6)
- దేవత్వము యెహోవాతండ్రి యొక్క అదృశ్యాలక్షణము..
- ఆ లక్షణము యెహోవాతండ్రి ఆయన యొక్క స్వభావాన్ని బయలుపరుస్తుంది.
- దేవత్వము యొక్క ఉనికిని మనము యెహోవా తండ్రిలో చూడగలము..


దేవత్వము యొక్క స్వభావము

➡️ దేవత్వము ఎందులో ఉండదు?
◆ ఈ దేవత్వము బంగారమునకు, వెండికైనను, రాతికైనను ఉండదు - అపో 17.29
◆ దెయ్యములకు ఉండదు - ద్వితి 32.17
◆ రాతితో చేయబడిన దేవతలకు ఉండదు. - యిర్మీ 2.11
◆ పాపము విషయమై మృతులుగా ఉన్న వారిలో ఉండదు - యోహాను 8:44

దేవత్వము ఏది కాదు?
దేవత్వము అనేది ఒక వ్యక్తి కాదు,
దేవత్వము ఒక ఆత్మ కాదు,
దేవత్వము అంటే దేవుడు కాదు,
దేవత్వము అంటే అధికారము కాదు,
దేవత్వము అంటే నిత్యాశక్తి కాదు.

                   చాలామందికి తత్వానికి, శక్తికి, అధికారమునకు తేడా తెలియదు అందుకే ఏది ఉన్న దానిని దేవత్వము అనేస్తున్నారు.. ఉదాహరణకు: యేసుక్రీస్తు పాపములను క్షమించాడు(లుకా 5:21) దేవత్వము కలవాడు కాబట్టి క్షమించగలిగాడు అందురు... దానిని దేవత్వము అనరు అధికారము అంటారు, ఈ అధికారము అపోస్తులు కూడా కలిగి ఉన్నారు. యోహాను 20:23: మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను.

దేవత్వము అనేది ఏది  అంటే అది ఒక లక్షణము అందులో ఇవి ఇమిడి ఉండును..
           దేవుని యొక్క స్వభావముకు సంబంధించిన లక్షణములు౼

1. దేవుడు పరిశుద్ధుడు
పాపము లేనివాడు
లేవి=19:2;1పేతురు=1:14.

2. దేవుడు నీతిమంతుడు
పాపము చేయలేనివాడు
కీర్తనలు=18:30; యోహాను=17:25

3. దేవుడు ప్రేమా స్వరూపి
దేవుడు మనకు సమస్థాన్ని ఇచ్చాడు.. ఆయన ప్రియ కుమారుని గా పుట్టినవానిని మనకొఱకు ఇచ్చారు.. యోహాను 3:16;
1యోహాను=4:8,16

4. దేవుడు సత్యవంతుడు
అబద్దమాడనేరని వాడు..
సంఖ్యా=23:19;తీతు=1:2..

5. దేవుడు నమ్మదగినవాడు
తనపిల్లలను *నమ్మదగినవారిిగా చేయుటకు* ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండువాడు.. మోసం చేయలేని గొప్పవాడు.
ద్వితీయోప=7:9; 1కొరింది=1:9

6. దేవుడు మంచివాడు
సత్పురుషుడు, ఉత్తముడు..
నీతిమంతులకు, అనీతిమంతులకు..కీర్తన=34:8; నహుమ=1:7.
మత్తయి=19:17;20:15.

7. దేవుడు పరిపూర్ణుడు
స్వభావములోను, వ్యక్తిత్వములోనూ దేవుడు పరిపూర్ణుడు(ఏ కొదువ,లోపము లేనివాడు) కీర్తన=18:25; 19:7-11; మత్తయి=5:48.

8. దేవుడు వెలుగు
1 యోహాను 1:5.
దేవుడు వెలుగు”– మనం కంటితో చూచే వెలుగు కాదు, ఆధ్యాత్మికమైన వెలుగు. క్రొత్త ఒడంబడికలో చీకటి పాపానికీ, ఆధ్యాత్మిక విషయాలను ఎరిగి ఉండకపోవడానికీ సూచన. వెలుగు పవిత్రతకూ సత్యానికీ సూచనే.

9. దేవుడు కనికరముగలవాడు
లూకా 6:36: కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కని కరముగలవారై యుండుడి.

మొదలగునవి దేవత్వపు లక్షణములు. ఇవి కంటికి కనిపించవు చర్యల ద్వారా తెలుసుకోగలము.

పాపము/ అపవాది
 - యొక్క తత్వము/స్వభావము మరియు
యెహోవాతండ్రి యొక్క తత్వము/స్వభావము తెలిస్తే ఈ దేవత్వము సులభముగా అర్ధం అవుతుంది...

ఏ కుమారుడైన తండ్రి చెప్పినట్టు నడిస్తే లేదా ఆలోచిస్తే అతను ఎలా ఉంటాడు తండ్రిలాగానే ఉంటాడు.
అలాగే యేసుక్రీస్తు తండ్రి తత్వములో ఎదిగాడు. ఆ మార్గం మనకు క్రీస్తు ద్వారా మాదిరిగా క్రీస్తు తండ్రిని తన జీవితములో కనపరచడు.
యోహాను 4:34: యేసు వారిని చూచినన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.
క్రీస్తు కూడా తండ్రి చిత్తనే తండ్రిలాగానే ఆలోచించాడు..


యెహోవా దేవత్వాని ఎవరెవరు కలిగి ఉన్నారు?
                    1. యేసుక్రీస్తు (శిరస్సు)
                    2. సంఘము (శరీరము)

1️⃣ దేవత్వము యేసుక్రీస్తులో ఉన్నది..
గలతియులకు 3:27: క్రీస్తు లోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.
మనము క్రీస్తును ఎలాగూ ధరించుకొన్నామో అలాగునే క్రీస్తు దేవత్వమును ధరించుకొనియున్నాడు

యెహోవాదేవుని యొక్క తత్వము(స్వభావము) యేసుక్రీస్తు ప్రభువులో సంపూర్ణముగా ధరించుకొనియున్నాడు.
ఆదాము నుండి క్రీస్తువరకు ఎవరు కూడా దేవత్వమునందు సంపూర్ణులు కాలేదు...
దేవుని న్యాయవిదుల యందు నిలగడగా ఉండిన జనములో కూడా ఏదొక పాపము దాని అడుగుజడలు ఉంటూనే దేవత్వముకు అడ్డుపడుతున్నాయి...

క్రీస్తు పుట్టినది మొదలు చనిపోయే వరకు శారీరకంగా మరియు ఆత్మీయముగా ఎటువంటి పాపము చేయలేదు. ఆయన పూనురుద్దరణ సంపూర్ణమైన దేవత్వమును కలిగియున్నాడు అనే విశ్వాసాన్ని చూపెడుతుంది...
ఆయన ఏ విధముగా దేవత్వమును అనుసరించాడో క్రింద గమనించండి...
దేవత్వము యొక్క క్రియ క్రీస్తులో :- 
లూకా 2:52: యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.

యోహాను సువార్త 5:19
కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.

యోహాను 8:28: కావున యేసుమీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.

యోహాను సువార్త 14:9,10
యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?
తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు.

యేసుక్రీస్తు పుట్టుకతో దేవత్వము కలిగినవాడు కాదు
పుట్టుక నుండి దేవత్వమందు ఎదిగినవాడు..
క్రీస్తు యొక్క ఆలోచనలో, పనులలో, నడకలో సమస్త విషయములలో తండ్రిని పోలి నడిచి దేవత్వమును చూపెట్టాడు...

పుణుద్దరణ తరవాత ఆయన ఎవరి పొలికో చూడండి
హెబ్రీయులకు 1:3,4
3.ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక
4.మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. 


2️⃣ సంఘము నందు దేవత్వము నివసించుచునది.                -- దేవుని యొక్క తత్వాము క్రీస్తు శరీరములో ఉన్నది. శరీరము అంటే సంఘము (కోలసి 1.18) అందులో పరిపూర్ణతలో ఎడగవాల్సిన అవసరం ఉంది.

➡️ కొలస్సీయులకు 2:9: ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;

           నివసించినది - ❌ జరిగిపోయినది
          నివసించుచునది - ✔️ still ఉన్నది
           నివసించబోతున్నది - ❌ జరగబోతున్నాది

నిజముగా క్రీస్తుకు ఎప్పుడు పరలోకములో భౌతిక శరీరము కలిగి ఉన్నాడు అని అంటే పరలోకములో రక్తమాంసములు ఉండవు అనే వాక్యము తప్పు అయిది.
కొలసి సంఘమునకు ముందుగానే చెప్పాడు సంఘము శరీరము అనేది ఏమిటి అనేది..

శరీరముగా 1.18➡ సంఘముగా
నివసించుచునది ➡ still దేవత్వము అప్సొస్తులుల బోదల ద్వారా సంగములో నివసించుచునది వాక్యము ద్వారా దానిలో ఎడగాల్సిన అవసరం ఉంది.
దేవుడు సంకల్పంలో మనము తనకు కుమారులుగా ఉండాలని నిర్ణయించుకొనెను (ఎపిసి 1:3-10)
తన కుమారులు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలో ఎలాంటి లక్షణములతో ఎదగాలో సంకల్పించిన దేవుడు మన కొరకు క్రీస్తును పంపి ఆయనను మనకు మాదిరిగా/మార్గదర్శిగా తన తత్వాన్ని దేవుడు క్రీస్తు ద్వారా మనకు అర్ధం అవ్వాలని కనపరచాడు...

క్రీస్తు తన పొలికలో ఎదిగినట్టు మనము కూడా తన పొలికగా ఎదగాలని దేవుడు కోరుచున్నాడు..
- మత్తయి 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
- లూకా 6:36: కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కని కరముగలవారై యుండుడి.
- ఎఫెసీయులకు 4:24: నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.
- ఎఫెసీయులకు 5:1: కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.
- 1యోహాను 3:2: ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగు దుము.

దేవత్వము యొక్క సంపూర్ణతకు మనం ఎదగవసిన అవసరం ఉంది..
ఎందుకంటే క్రీస్తు దేవుని స్వరూపి ఎఫెసీయులకు 4:12: అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.

2 పేతురు 1:4
ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, "దైవస్వభావమానునందు" పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను.

ఎఫెసీయులకు 4:24: నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.

కొలస్సీయులకు 3:10: మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు.

★ యోహాను 10:35: లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడలనేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,

క్రీస్తు - అపోస్తులు - సంఘము ఏకబావము  కలిగి ఉండాలి..
               దేవుని  వాక్యము 
                           
                       యేసుక్రీస్తు
                           
            అపోస్తులులు, పరిశుద్త్మ
                           
                      సంఘము.
దేవుని లక్షణములు/స్వభావము వాక్యము ద్వారా నేడు మనకు చేరినది..
యోహాను సువార్త 17:16-24
నేను(యేసు) లోకసంబంధిని కానట్టు వారును(అపోస్తులును) లోకసంబంధులు కారు.
సత్యమందు( మూలభాషలో-సత్యమువలన) వారిని(అపోస్తులును) ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.
నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని(అపోస్తులులను) లోకమునకు పంపితిని.
వారును(అపోస్తులు) సత్యమందు ప్రతిష్ఠ చేయ బడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.
మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున,
వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; ""వారి(అపోస్తులులవాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును"" ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.
మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.
వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.
తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి.
➡వారు అంటే అపోస్తులులు
➡ వారియందు విశ్వసించినవారు అంటే సంఘము
➡ నేను, వారు, నన్ను, నీయందు, నాయందు, మనము, ఏకమవుట, ఈ పదాలను గమనించండి.

దేవుడు ఒక్కడే ఆయనే యెహోవా, క్రీస్తు మరియు మిగతా వారంతా కూడా అనుచరులే..

ముగింపు:-
➡️ దేవత్వము అంటే ఏమిటి?
దేవుని యొక్క తత్వము/స్వభావము..

➡️ దేవత్వము యొక్క ఉనికి ఎక్కడ?
యెహోవా దేవునితో ఉన్నది దేవత్వము యొక్క ఉనికి..

➡️ దేవత్వము క్రీస్తులో ఎలా చూసారు?
నన్ను చూసిన వాడు తండ్రిని చూసాడు అని చెప్పుటలో దేవత్వమును చూడగలము..

➡️ దేవత్వమును గ్రంధములో ఎలా చూడగలము?
దేవత్వమును యెహోవా దేవుడు మన యెడల చూపిన ప్రేమ, కరుణ, కృప, సంతోషము, నీతి, మంచితనము, నిజాయితీ ఈ విధముగా ఆయన తత్వమును బట్టి చూడగలము..
                           -------- ౦-------

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:

Post a Comment