యేసు పరలోకము నుండి వచ్చినవాడా? 1 కోరింది 15:47


యేసు పరలోకము నుండి వచ్చినవాడా?

1 కొరింథీయులకు 15:47
మొదటి మనుష్యుడు భూసంబంధియై మట్టినుండి పుట్టిన వాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.

ఈ వచనమును బట్టి క్రీస్తు పరలోకము నుండి వచ్చినవాడు అని అక్షరార్ధముగా అనుకొనెదరు గాని ఎలా పోల్చబడినదో ఆలోచించవలసిన అవసరం ఉంది..
ఈ మాట చెప్పే ముందు పౌలు మరికొన్ని ఉదాహరణలతో చెప్పినట్టు చూడగలము..(42-49వ)
పౌలు ఏమి చెప్పాడలచాడో ఈ క్రింది వివరణ చూద్దాము.

💐వివరణ:
రెండు వేరైనా శరీరములు కలవు
వాటి వత్యసాలను *భువస్తువులను మరియు ఆకాశవస్తువులను* ఉదాహరణగా పౌలు ఉపయోగించాడు. మహిమ శరీరము యొక్క గొప్పతనమును పౌల్ వివరిస్తున్నాడు..

1️⃣. *మృతుచందు శరీరము - ఇహలోక శరీరము*

2️⃣. *పరలోక శరీరము - పునుర్ధారణ(మహిమ) శరీరము.*

ఈ రెండు వేరైనా శరీరములు అని పౌలు చెప్పదలచాడు...

ఈ రెంటినీ పోల్చుటకు ఆయన 15:42-49 వర్ణన గల పరంపరములను ఉపయోగించేను..

🔸 మొదటి శరీరము క్షయమైనదే; రెండవది అక్షయమైనది. (42వ)

🔸 మొదటిది ఘనహీనమైనదిగా విత్తబడును; రెండవది ఘనమైనదిగా మహిమలో లేపబడును (43వ)

🔸 మొదటిది బలహీనమైనదిగా విత్తబడును; రెండవది బలమైనదిగా లేపబడును (43బి)

🔸మొదటిది ప్రకృతి సంబంధమైన శరీరము; రెండవది ఆత్మ సంబంధమైన శరీరము. (46వ)

🔸 *మొదటిది ఆదాము శరీరము వంటిది, మట్టితో చేయబడినది; రెండవది పరలోకము నుండి వచ్చిన మహిమ శరీరము వంటిది. (క్రీస్తుకు మహిమ శరీరము ఎలా వచ్చిందో అలాంటి శరీరము) (47-49వ)*

ఈ మహిమ శరీరము ఎక్కడిది పరలోకము నుండి కలిగినదేగా..
అదే పౌల్ చెప్పదలచాడు..

క్రీస్తు పరలోకము నుండి వస్తే మనము కూడా పరలోకమునుండి వచ్చినవరమే.

1 కొరింథీయులకు 15:48,49,50
48.మట్టినుండి పుట్టినవాడెట్టివాడో మట్టినుండి పుట్టినవారును అట్టివారే, *పరలోక సంబంధియెట్టివాడో పరలోకసంబంధులును అట్టి వారే.*
49.మరియు *మనము* మట్టినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము *పరలోక సంబంధి పోలికయు ధరింతుము.* 
50.సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొననేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.


మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:

Post a Comment