ఒక ఆజ్ఞ మీరుట వలన అనేక ఆజ్ఞలను మీరుట జరుగును



"ఆజ్ఞలను" పాటించకపోవడమే " పాపము"...... అంతే కాదు" పాపము" చేయడమే "ఆజ్ఞలన్నిటిని" పాటించకపోవడం అర్ధం కాలేదా ? "దావీదు" విషయములో జరిగిన ఇన్సిడెంట్ ద్వారా తెలుసుకుందాం.

*************************************
దావీదు లో ఎన్నో మంచి లక్షణములు ఉన్న కానీ దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటునము అంటే ఈ సంఘటన మనకు బుద్దిని నేర్పుతుంది..
దావీదు చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులలో పెరిగిన వాడే కానీ అపవాది ఒక విషయములో అతనిని పడేసింది వాస్తవానికి చేసింది ఒక "పాపమే " ఆ ఒక్క పాపమే అన్ని ఆజ్ఞలను పాటించని వాడిగా చుపేసింది గ్రహించండి ఉదాహరణకు : CA EXAM లో ఒక సబ్జెక్టు పొతే అన్ని మల్లి వ్రాయాలి కదా ? అలాగా మీకు అర్థమైందా  ? ఇలానే ఒక్క పాపమూ చేసిన మొత్తం ఆజ్ఞలను  కోల్పోతాము
అతను కి ఒక స్త్రీ పై ఉన్న వ్యామోహము అతన్ని అన్ని ఆజ్ఞలను పాటించలేదన్నట్లు  ఆ" పాపము"లో అపవాది చుపేసింది ఇది వాక్యరూపములో వివరిస్తా గమనించండి

******************************************
నీ పొరుగువాని భార్యనైనను ఆశింపకూడదు:-
*******************************************
1.ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను.
(2 సమూయేలు 11:2)
ఆమె ఒకని భార్య దావీదు ఆమెను ఆశించవచ్చా ? ఇది ఆజ్ఞను పాటించకపోవడమే కదా ?

వ్యభిచరింపకూడదు
*********************
2.ఆ స్త్రీ గర్భవతియైనేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా
(2 సమూయేలు 11:5)
వివాహము అయి ఇతరులను ఆశ్రయించినవారు వ్యభిచారముతో సామానులు మరి ఇది ఆజ్ఞను పాటించకపోవడమే కదా ?

దొంగిలకూడదు.
*****************
3.దావీదు దూతలచేత ఆమెనుపిలువనంపెను.
(2 సమూయేలు 11:4)
భర్తకు తెలియకుండా వేరొకని భార్యను తీసుకొచ్చుకోవడం దొంగిలించడమే మరి  ఇది ఆజ్ఞను పాటించకపోవడమే కదా ?

అబద్ధసాక్ష్యము పలుకకూడదు. 
******************************
4. ఊరియాను ముందుపెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్దనుండి వెళ్లి పొమ్మని
(2 సమూయేలు 11:14)
దావీదు  ఊరియా  ను మోసము చేసిన "సందర్భం" రూపమే అబద్దమే కదా ? ఇది ఆజ్ఞను పాటించకపోవడమే కదా ?

నరహత్య చేయకూడదు. 
************************
5.హిత్తీయుడగు ఊరియాయును హతమాయెను.
(2 సమూయేలు 11:17)
ఉరియ హతము అవడానికి కారణమైయ్యాడు మరి ఇది ఆజ్ఞను పాటించకపోవడమే కదా ?
మొత్తముగా దావీదు చేసిన ఆ "ఒక్క" పాపమే ఆజ్ఞలన్నిటిని దిక్కరించేవిదంగా ముడిపడిపోయింది తరువాత ఎంతో పశ్చాత్తాపము కలిగి దేవుని యొద్ద తన పరుపు తెలినంతగా కన్నీటి ప్రార్ధన చేసాడు.
కాబట్టి మనము చేసే ఒక్క పాపమే ఆజ్ఞలను పాటించని వారీగా చూపిస్తుంది కాబట్టి పాపమూనకు దూరముగా పారిపోవాలి ఏమంటారు ?

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:

Post a Comment