ఆమెన్ ఆని ఎందుకు అనాలి ?
హెబ్రీ , గ్రీక్, ఇంగ్లీషులో, ఆమెన్ అను పదానికి భావము “అట్లగును గాక,” లేదా “నిశ్చయంగా అలానే." దీనినే తెలుగులో తదాస్తు అని కూడా అంటారు.
ఒక వ్యక్తిని ఒక ప్రమాణానికి బాధ్యున్ని చేయడానికి, చేసిన ప్రార్థనను , స్తుతిని స్థిరపరచుటకు ఈ పదం ఉపయోగింప బడింది.
అంతేకాకుండా ఎదుటివారి చేసిన మనవిని ఆమెన్ అనుటద్వారా అతని ప్రార్ధనను పూర్తిగా ఏకీభవించినట్టు అర్ధం వస్తుంది.
సంఖ్యా 5:22; ద్వితీ 27:15-26; నేహె 5:13 , 1 దిన 16:36, నెహె 8:6; 1 రాజు 1:36; యిర్మీ 11:5
ప్రార్ధన ముగింపులో మనము విశ్వసించి ఆడిగినవి దొరుకుతాయని నమ్మకంతో ఈ పదాన్ని వాడవలెను.
అలాగే క్రొత్త నిబంధనలో “ఆమెన్” అనే బిరుదు యేసు యొక్క స్వభావమును వర్ణించడానికి కూడా వాడారు.
ప్రక 3:14 ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు -- చెప్పు సంగతులేవనగా
దేవుని వాగ్దానాలన్నీ ఆయనయందే నెరవేర్పును కలిగియున్నవి కనుక ఆయన ఆమెన్ అనువాడై ఉన్నాడు.
---------- ౦ ----------
మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:
Post a Comment