👉👉యేసుక్రీస్తు దేవుని స్వరూపి👈👈
హెబ్రీయులకు 1:1-4 - పూర్వకాలమందు నానాసమయములలోను(మూలభాషలో-నానాభాగములుగాను) నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును
వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను(మూలభాషలో-యుగములను) నిర్మించెను.
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.
స్వరూపము అంటే గ్రీకులో పదములు అర్ధము :
G3444 Strong
morphé: form, shape
Original Word: μορφή, ῆς, ἡ
Part of Speech: Noun, Feminine
Transliteration: morphé
Phonetic Spelling: (mor-fay')
Definition: form, shape
Usage: form, shape, outward appearance.
యేసుక్రీస్తు దేవుని స్వరూపి అని మూడు చోట్ల చూడగలము.
1️⃣ ఫిలిప్పీయులకు 2:6
ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి,
2️⃣ 2కోరింథీయులకు 4:4
దేవుని స్వరూపియైయున్న క్రీస్తు
3️⃣ కొలస్సీయులకు 1:15
ఆయన అదృశ్యదేవుని స్వరూపియై
స్వరూపము అనగానేమి?
స్వ+రూపము = సొంత+రూపము = సొంతరూపము.
స్వరూపము అనేది ఒక అలంకార ప్రయోగము కానీ అది దాని వాస్తవము కాదు... ఎలాగునంటే ఉదాహరణకు -
"బాబు నిన్ను చూస్తే మీ నాన్నను చూసినట్టుంది"
"బాబు నువ్వు అచ్చం మీ నాన్నగారి లాగానే ఉన్నావ్"
ఇక్కడ బాబు, నాన్నగారిలా ఉండటం అంటే ఆయన స్వరూపము కలిగినవాడు అని అర్ధం. నాన్నగారిలా ఉన్నంతమాత్రమునా నాన్న కాలేడు."
యేసుక్రీస్తు ఎవరి స్వరూపము?
దేవుని స్వరూపము
దేవుడు ఎవరు?
తండ్రి యెహోవా
దేవుని స్వరూపము = యెహోవాతండ్రి స్వరూపము
క్రీస్తు దేవుని స్వరూపి అంటే క్రీస్తు యెహోవాస్వరూపి అని అర్ధం వచ్చును..
యెహోవా స్వ(సొంత)స్వరూపము ఏమిటి? దానిని క్రీస్తు కలిగిన విధము :-
మనము అద్దము ముందుకు వెళ్లి అద్దాములో చూస్తే మన స్వరూపము కనపడుతుంది, ఎలా ఉన్నాము ఏమిటి అనేది చూసుకోగలము, మరి దేవుడు అదృష్యుడు ఆయనకు భౌతిక రూపము లేదు ఎలా చూడగలము?
ఆయన స్వభావమే ఆయన స్వరూపము ఆయన స్వభావమును బట్టి ఆయాన స్వరూపమును చూడగలము, క్రీస్తు దేవుని(యెహోవా) స్వభావమును కలిగియున్నాడు, అందువలన ఆయన దేవునిస్వరూపి అయ్యాడు. యేసుక్రీస్తును చూస్తే ఆయనలో లేదా ఆయన బోధనలో మనకు కనపడేది దేవుని స్వభావమే.
క్రీస్తును ఒకటి రెండు చోట్లా దేవుడు అని అలంకరముగా పిలుచుటకు కారణం ఆయన దేవునిస్వరూపి అగుట చేతనే, అంతేకాని ఆయనే నిజమైన దేవుడు కాడు, నిజమైన దేవుడు యెహోవాతండ్రి అని గ్రంధం తేటగా తెలియజేస్తుంది(యిర్మీయా 10:10; 1యోహాను 5:20).
దేవుని స్వరూపము జంతువులకు ఉండదు కారణము : జంతులకు వ్యక్తిత్వం మంచి చెడులను ఎంచుకునేందుకు సంకల్పబలం ఉండదు ఆ తేడా, పొలికను చూపుతుంది. దేవుడు వ్యక్తిత్వం గలవాడు, మంచి చెడులను వివేచించే సామర్థ్యం గలవాడు, మానవుడు వ్యక్తిత్వం గలవాడే మంచి చెడులను వివేచించే సామర్థ్యం గలవాడే, దేవుడు ఏయే లక్షణములు కలిగియున్నాడో ఆ లక్షణములు మానవుడు కలిగియున్నాడు ఇవే దేవుని పోలికలు, ఈ పోలికలు లేని జంతువులలో స్వరూపము ఉండదు.
దేవుని పొలికగా పుట్టిన మానవుడే దేవుని స్వరూపి కాగలడు అని క్రీస్తు నిరూపణ చేసి పరమందు దేవుని కుడిపర్స్యము నందు జెస్థుడుగా ఉండెను...
🔷
దేవుని స్వరూపము చూపిన విధానము 🔷
👇👇
★ యోహాను సువార్త 1:18
ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు;
తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను.
★ యోహాను సువార్త 12:45
నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.
★ యోహాను సువార్త 14:7-11
మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా?
నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?
★ యోహాను సువార్త 8:19
వారు నీ తండ్రి యెక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు;
నన్ను ఎరిగి యుంటిరా నా తండ్రిని కూడ ఎరిగి యుందురని వారితో చెప్పెను.
🌹
తండ్రిని ఎలా చూపించాడు వారు ఏసుక్రీస్తును ఎలా ఎరిగారు?
◆ తన స్వభావము ద్వారా,
◆ తన క్రియల ద్వారా,
◆ తను చేసిన అద్బుతములు సూచక క్రియల ద్వారా,
◆ తన ప్రవర్తన ద్వారా.
◆ తన బోధ ద్వారా
● తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? "
నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు."
తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా "
యీ క్రియల" నిమిత్తమైనను నన్ను నమ్ముడి.
● యోహాను సువార్త 5:30
నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను "
విను నట్లుగా" తీర్పు తీర్చుచున్నాను. "
నన్ను పంపిన వాని చిత్తప్రకారమే" చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.
● యోహాను 8:38: నేను నా తండ్రియొద్ద "
చూచిన సంగతులే" బోధించుచున్నాను; ఆ ప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను.
● యోహాను 10:37:
నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి,
● యోహాను 12:49:
ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు.
● యోహాను 15:10:
నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు.
● యోహాను 8:28: కావున యేసుమీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు,
నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.
యోహాను 5,8,12,14 చదివితే దేవుని స్వరూపాన్ని యేసుక్రీస్తు ఎలా చూపాడో అర్ధం అవుతుంది.
Jesus himself empty
క్రీస్తులో తన అనుకున్నది ఏమి లేదు అంత తండ్రే ఉన్నాడు.. అయితే క్రీస్తు తన సొంతగా ఏమియు చేయలేదు ఏమియు చేయనేరడు(యోహాను 5:19) అలాంటపుడు మరి ఎవరిని చూపించి ఉంటాడు? తండ్రినే కదా అందుకే యేసుక్రీస్తు దేవుని స్వరూపి అని చెప్పబడినది....
🐳 చాలామంది గ్రుడ్డివిశ్వసామ్ ఏమిటంటే క్రీస్తు యెహోవా సమానులు అందురు (యెహోవా = క్రీస్తు), మరి యేసుక్రీస్తు తన బోధనలో ఎందుకు ఇలా అంటున్నాడు? ⬇️
◆ యోహాను 10:29
వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;
◆ యోహాను 13:16
దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
◆ 1కోరింథీయులకు 11:3: ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషు డనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసి కొనవలెనని కోరుచున్నాను.
గొప్పవాని(తండ్రిని) స్వరూపమును ఎలాగూ పొందెను ఎన్ని బాధలు పడెను క్రింద చూడగలము...
◆ లూకా సువార్త 2:40,52
40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను. 52. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లు చుండెను.
◆ హెబ్రీయులకు 5:7: శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.
◆ ఫిలిప్పీయులకు 2:8: మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.
◆ హెబ్రీయులకు 5:8: ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.
ఒక నరుడు దేవుని స్వరూపమును కలిగియుండగలడు అని మనకు మాదిరిఅయేను అందుకే -
> గలతియులకు 4:19: నా పిల్లలారా,
క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.
> రోమీయులకు 8:29: ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు
తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.
తండ్రిని క్రీస్తు అనుసరించాడు
క్రీస్తును మనం అనుసరించాలి, ఎందుకంటే క్రీస్తు బోధ లేకుండా మనకు తండ్రిని అనుసరించడం అసాధ్యము...
ముగింపు:
◆ దేవుని స్వరూపి దేవుడు ఎలా అయ్యాడు?
ఆదాము హవ్వ మొదట దేవుని స్వరూపులే.
◆ క్రీస్తు భూమి మీదే దేవుని స్వరూపిగా ఎదిగాడు దేవుని స్వరూపమును చూపించాడు..
◆ దేవుడొక్కడే ఆయనే యెహోవాతండ్రి ఆయన సొంతరూపమును క్రీస్తు కలిగియున్నాడు...
--------- ౦ --------
మీ
సహోదరుడు
Brother SURESH
9581881880