అశ్లీలత


సేకరణ...
అశ్లీలత 🙈 ✍

👫 యవ్వనస్థులు తప్పక చదవాలి 👫
          ప్రియులారా... అన్ని అంశాలు సంఘములో చెప్పలేము. నేను ఏదో రాయాలి కదా అని ఎవరిని నొచ్చుకొనివి, బాధపడనివి అయిన సందర్భాలు తు తు మంత్రంగా చెప్పను. నేను పిల్లలు మొదలు వృద్ధులు వరకు అందరి మార్పు కొరకు బోధించి, హెచ్చరించి, బుద్ధి చెప్పి, వారికోసం ప్రార్ధించాలి అని నా తపన. అందుకే ప్రతి ఒక్క అంశం నేను సంధర్భోచితముగా, సవివరంగా రాస్తాను. దేవుని సత్య సువార్త చెప్పడం తప్ప ఇంకో ఉద్దేశ్యము నాకు లేదు. అందుకే ఈ రోజు యవ్వనస్థులను పట్టి పీడిస్తున్న అశ్లీలం గూర్చి రాస్తున్నా. ఇంకో రెండు రోజులలో యవ్వనస్థుల రహస్య, భయంకర పాపము గూర్చి కూడా రాస్తాను.


అశ్లీలత (Pornography) అనగా?
               ప్రొనేయా (Proneia), గ్రాఫో (Grapho) అనే గ్రీకు పదాలనుండి ఈ Pornography వచ్చింది. జారత్వపు బొమ్మలు, దిగంబర దృశ్యాలు ఈ కోవలోనివే.
"కామప్రకోపనాలను రగిల్చే వాఙ్మయము, సినిమాలు మొదలగు వాటిలోని లైంగిక ఘటనల నిలువెత్తు రూపమే అశ్లీలం" (Oxford Dictionary 1992).


అశ్లీలత గూర్చి వ్యాఖ్యలు:-
👉 లాటిన్లో శీలాన్ని లేదా నాణ్యతను చెరపడం
👉 ఆక్సఫోర్డ్, యదార్ధత పెడద్రోవ పట్టడం
👉 వెబ్ స్టర్, తప్పు చేయుటకు ప్రేరణ
👉 ట్రాన్సఫరెన్సీ,  ప్రవర్తనకు సంబంధించినది


అశ్లీలత పరిధి:-
             ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ. దీని వార్షిక ఆదాయం Coca-Cola, McDonald's రెండింటి వార్షిక అధ్యాయాన్ని కలిపి మించిపోయింది. బిలియన్ డాలర్ల బిజినెస్ ఇది. థియేటర్లు, మేగజైన్లు, బుల్లితెరలు, ఇంటర్నెట్ కేఫ్ లలో అశ్లీలం నిన్నటిమాట. సెల్ ఫోన్, పర్సనల్ డిజిటల్ అస్సిస్టెంట్స్ (PDAs) లలో online అశ్లీలం నేటి మాట. వృద్ధులు మొదలుకొని, టీన్ లను దాటుకొని, కూనల వరకు మొబైల్ అందరి చేతులలో ఉంటోంది. కాబట్టి అశ్లీలం అందరికి అందుబాటులో ఉంటోంది.
         ఈ అశ్లీలం యువత లేత మనస్సులను కకావికలం చేసి  వివాహానికి ముందు సెక్స్ కి, హత్యలకు, ఆత్మహత్యలకు, నేరప్రవుత్తికి తెరతీస్తోంది. చెప్పుకోలేని మానసిక సంఘర్షణలకు గురిచేసి మద్యం, మాధకద్రవ్యాల వైపు పరుగు పెట్టిస్తోంది.
          నా ప్రియ స్నేహితులారా.. ఈ వ్యాసం చదువుతున్నా మీకు మనస్సు ఏమైనా గద్ధిస్తుందా? దీనికి మిరేమన్నా అడిక్ట్ అయ్యారా? తప్పు అని తెలిసిన కొన్ని సైట్స్ ఓపెన్ చేస్తున్నారా? వద్దు అని అనుకొని Google లో కొన్ని Search చేస్తున్నావా? చాల జాగ్రత్త మిత్రమా! నీవు నీకు తెలియకుండానే పెద్ద అగాధములోకి వెళ్ళిపోతున్నావ్.


అశ్లీలం గూర్చి బైబిల్ ఏమి చెప్తోంది?
             అశ్లీలం గూర్చి బైబిల్ లో యధాతధముగా లేదు కాని అశ్లీలం ఓ పెద్ద జాడ్యం అనిచెప్పే లేఖనాలు చాలా ఉన్నాయి.
✴ భార్యాభర్తల మధ్య కడదాకా ఉండవలసిన 'ఏకశరీరం' అశ్లీలం వల్ల ఉండదు.
(ఆది2:24-25, మత్తయి19:4-6)

✴ నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి అనే నియమం అశ్లీలం వల్ల కుదరదు.
(1పేతురు 1:14-16)

✴ మొహపుచూపు వ్యభిచారమే. అది అశ్లీలతే కదా
(మత్తయి 5:28,29)

✴శరీరేచ్ఛ అశ్లీలమే. (రోమా 13:14)

✴ అశ్లీలత వలన దేవుని రాజ్య వారసులం కాలేము.

✴ పాన్పు నిష్కల్మష మైనదిగా ఉండాలి.
( హెబ్రీ 13:4)

✴ అశ్లీలత వలన ఉగ్రత వారిమిధకి వస్తుంది.
(కొలస్సి 3:5)


మరి మనం ఏమి చేయాలి?
✴ అశ్లీలం చూడను అని యోబు వలే కన్నులతో నిబంధన చేసుకో. (యోబు 31:1, 9-11)

✴ యోసేపు వలే పారిపో. (యాకోబు 4:7, ఆది39:12)

✴ అశ్లీలతకు దూరముగా పారిపో.(1కోరింథి 6:18, 9-11)

✴ అశ్లీల సంబంధ ఆలోచనలు చేయకుడదు.
     (రోమా 13:14)

✴ మీ బిడ్డలను ఓ పద్దతిలో శిక్షిద్దాం (సామెతలు 13:23)


        దేవుడు దిశమొలను కప్పుకోమన్నాడు. దేవుడే పనిగట్టుకొని చర్మపు చొక్కాయలు చేయించి, తొడిగించాడు. అందుకే ఫాషన్ షోలకు మనం వ్యతిరేకం. ఈ లోకం బొత్తిగా చెడిపోయింది. అగ్గిపుల్ల నుండి బజారులో దొరికే ప్రతిదానికి అశ్లీల దృశ్య చిత్రాలే. భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే నోవాహు కాలం గుర్తు వస్తోంది.
(ఆది 3:7, 21, 6:11-13, లేవి 16:4) నా ప్రియ స్నేహితుడా అశ్లీలత నీలో ప్రస్తుతం ఉంటె, అశ్లీల చిత్రాలు చూసే అలవాటు, అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఉంటె ఇప్పుడే వదిలేయాలి లేకపోతే ఉగ్రతపాలు అవుతావు, దేవుని రాజ్య వారసులు కాలేరు కనుక వాటిని విడిచిపెట్టాలి..

---------- ౦ ---------

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880