రోమా 9:5 లో ఉన్న సర్వాధికారియిన దేవుడు ఎవరు?
“ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరమూ స్తోత్త్రార్హుడైయున్నాడు” – రోమా 9:5
“... whose are the fathers and of whom as concerning the flesh Christ came, who is over all, God blessed forever” – Romans 9:5
పై వాక్యంలో “God blessed forever” అంటే- “దేవుడు నిరంతరమూ స్తోత్త్రార్హుడైయున్నాడు” అని అర్థం. కాబట్టి ఈ వాక్యం సరైన అనువాదం-
"వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతి వాడే సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడును గాక! ఆమెన్.
"వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతి వాడే సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడును గాక! ఆమెన్.
చాలామంది ఈ క్రింది తర్జుమా చూసి యేసుక్రీస్తు సర్వాధికారియిన దేవుడు అంటూ ప్రకటించడం జరుగుతుంది. రోమీయులకు 9:5 - పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.
పౌలు తాను వ్రాసిన పూర్తి రోమా పత్రికలో స్తుతిస్తున్నది ఎవరిని? ప్రత్యేకంగా రోమా 9:5 వాక్యంలో “నిరంతరం స్తోత్త్రార్హుడైన దేవుడ”ని స్తుతిస్తున్నది ఎవరిని? అన్నది ఇప్పుడు గమనిద్దాం.
వాస్తవానికి రోమా 9:5 వాక్యంలో పౌలు ఎవరిని ఉద్దేశించి “ఈయన సర్వాధికారి అయిన దేవుడై యుండి నిరంతరం స్తోత్త్రార్హుడైయున్నాడు అని చెబుతున్నాడు? యేసునా? యెహోవానా? అన్నది మరింత వివరంగా తెలుసుకోవాలంటే - రోమా 9:4 నుండి ఇశ్రాయేలీయులకు యెహోవాచే ఇవ్వబడిన వాగ్దానములను గుర్తు చేస్తూ పౌలు ప్రస్తావిస్తావిస్తున్న ఈ క్రింది సమాచారాన్ని చదవాల్సి ఉంటుంది.
రోమీయులకు 9:4 - వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి.
రోమీయులకు 9:4 - వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి.
పై వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, ఇశ్రాయేలీయులు దేవుని వద్ద నుండి పొందిన ప్రత్యేక వరాలను గూర్చి పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అవి-
1. దత్తపుత్రత్వము
2. మహిమ
3. నిబంధనలు
4. ధర్మశాస్త్ర ప్రధానము
5. అర్చనాచారాదులు
6. వాగ్దానములు. ఇవి మాత్రమే కాకుండా
7. పితరులు (అనగా- అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు) వీరివారు అంటున్నాడు.
ఇప్పుడు గమనించాల్సింది-
1.ఇశ్రాయేలీయులకు దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్రము వాగ్దానములు ఇచ్చింది ఎవరు? యేసా? యెహోవానా? యెహోవాయే కదా!
2.అలాగే పితరుల (అనగా- అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల) దేవుడు ఎవరు? యేసా? యెహోవానా? యెహోవాయే కదా!
3. ఈ వాగ్దానములతో పాటు “శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను” అని పౌలు అంటున్నాడు. క్రీస్తును శరీరధారిగా పుట్టించింది ఎవరు? యేసా? యెహోవానా? యెహోవాయే కదా!
“దేవుడు, తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలీయుల కొరకు రక్షకుడైన యేసును పుట్టించెను” - అపోకా 13:23 అని పౌలే చెబుతున్నాడు. అటువంటప్పుడు ఇశ్రాయేలీయులకు అనేక వరాలను మరియు యేసును పుట్టించడాని బట్టి పౌలు స్తుతించాల్సింది ఎవరిని? యేసునా? యెహోవానా? కచ్చితంగా యెహోవాకే కదా!
🛐 పూర్తి రోమా పత్రికలో అనేకచోట్ల “నిరంతరం స్తోత్త్రార్హుడైన దేవుడ”ని పౌలు ప్రకటించింది యేసును కాదు, యెహోవానే!
అత్యంత గమనార్హమైన విషయం ఏమిటంటే - పౌలు, ఒక్క రోమా పత్రిక 9:5 వాక్యంలోనే కాదు, అదే పత్రికలో అనేకసార్లు యెహోవాతండ్రిని నిరంతరమూ స్తోత్త్రార్హుడైన దేవుడని ప్రకటించాడన్నది. ఆ విషయాన్ని ఈ క్రింది వాక్యాలలో గమనించగలరు.
★ “అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి, సేవించిరి. యుగముల వరకు ఆయన (యెహోవా) స్తోత్త్రార్హుడైయున్నాడు” – రోమా 1:25
★ “ఆహా, దేవుని బుద్ధి, జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు... (33) ఆయన మూలముగనూ ఆయన ద్వారానూ ఆయన నిమిత్తమును సమస్తమూనూ కలిగియున్నవి. యుగయుగముల పర్యంతము ఆయనకు మహిమ కలుగును గాక” – రోమా 11:33-36.
★ “యేసుక్రీస్తు గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును, అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమకలుగును గాక” – రోమా 16:25-27.
ఈ విధంగా పౌలు, రోమా పత్రికలో అనేక చోట్ల “నిరంతరమూ స్తోత్త్రార్హుడైన దేవుడ”ని ప్రకటిస్తూ వచ్చిన క్రమంలోనే అదే రోమా పత్రిక 9:5లో సైతం “ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరమూ స్తోత్త్రార్హుడైయున్నాడు” అని స్తుతిస్తున్నాడు.
దాని క్రింది వచనములో కొనసాగిస్తూ - అయితే దేవునిమాట తప్పి పోయినట్టు కాదు - రోమ 9:6
ఇక్కడ దేవుని మాట అంటే ఏ దేవుడు? యెహోవా మాట అనేగా అర్ధం...
దాని క్రింది వచనములో కొనసాగిస్తూ - అయితే దేవునిమాట తప్పి పోయినట్టు కాదు - రోమ 9:6
ఇక్కడ దేవుని మాట అంటే ఏ దేవుడు? యెహోవా మాట అనేగా అర్ధం...
పౌలు దృష్టిలో నిరంతరం స్తోత్త్రార్హుడైన దేవుడు ఎవరు?
★ “మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయుశక్తి గల దేవునికి (అనగా- యెహోవాకు) క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక” – ఎఫెసీ 3:21
★ “నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతించబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రియగు దేవుడు (అనగా- యెహోవా) ఎరుగును” – 2 కోరింధీ 11:31
★ “కాబట్టి ఆయన (అనగా- యేసు) ద్వారా మనము దేవునికి (అనగా- యెహోవాకు) ఎల్లప్పుడు స్తుతియాగము చేయూదుము” – హెబ్రీ 13:15.
ఇంతకూ పౌలు దృష్టిలో అసలు దేవుడు ఎవరు? యేసా? యెహోవానా?
పౌలు తన పత్రికలో చెబుతున్న గమనార్హమైన విషయం ఏమిటంటే- అనేకమంది దేవుళ్లని, ప్రభువులని పిలువబడినప్పటికీ వారందరికీ పైగా ఒకే ఒక్క దేవుడు ఉన్నాడని పేర్కొంటున్నాడు. దానిని ఈ క్రింది వాక్యంలో గమనించగలరు.
★ “ఆకాశమందైనను భూమిమీద నైనను దేవతలనబడినవి (అంటే- దైవాలనబదినవారు) ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి (అనగా- యెహోవా) – 1 కోరింథీ 8:6
★ ఎఫెసీయులకు 4:6 అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.
★ ఎఫెసీయులకు 4:6 అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.
పై వాక్యంలో పౌలు “మనకు ముగ్గురు దైవాలు ఉన్నారు” అనిగానీ, “మనకు త్రియేక దేవుడు ఉన్నాడు” ఉన్నాడని గానీ చెప్పటం లేదు! కానీ, “మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు” అని చెబుతున్నాడు. అలాగే, ఆ ఒక్క దేవుడు “యేసు” అనిగానీ, “పరిశుద్ధాత్మ” అనిగానీ, “కన్యామేరీ” అని గానీ చెప్పటంలేదు! ఆయన “తండ్రి” అనగా యెహోవా అని చెబుతున్నాడు. ఈ వాక్యభాగం నేడు యేసే దేవుడని వాదిస్తున్న వారికి గొప్ప సమాధానము కాగలదు.
మరి యేసుక్రీస్తు స్తోత్రర్హుడు కాడా?
👉 యేసుక్రీస్తు మనకు ప్రభువు,
👉 యేసుక్రీస్తు మనకు ప్రభువు,
ప్రభువును స్తుతించాలి, కీర్తించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి ఎందుకు? ఆయన మనకు ప్రభువు కాబట్టి ఇట్టి ఆచారము ఇశ్రాయేలు ప్రజలకి ముందు నుండే ఉన్నది..
--------- ౦ ----------
మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:
Post a Comment