ఎవరు రక్షకులు?


ఎవరు రక్షకులు?

పోలీసులు, తల్లిదండ్రులు, అన్న/అక్క, Care taker ఇలా కొంతకాలము బౌతికముగా రక్షకులు ఉన్నారు..
నా రక్షకుడు నీవు మాత్రమే అని చెప్పడానికి లేదు, యేసు నీవు మాత్రమే నా రక్షకుడివి అని అంటే తండ్రి కాడని నీ అభిప్రాయమా? లేక నీ తల్లిదండ్రులు కారని బావమా?

 ఎలాంటి రక్షణకైనా మూలకారకుడు  యెహోవాదేవుడు(రక్షణ కర్త). నీవు ఉన్నావు, నీకోసం నీ తల్లిదండ్రులు సామాజికంగా పోలీసులు, న్యాయశేఖ, స్నేహితులు ఇలా నీ చుట్టూ ఏర్పాటు అవడానికి ఒక్కడే కారణము ఆయనే యెహోవా దేవుడు. ఎందుకంటే బిడ్డలు కావాలి వారి ద్వారా తన మహిమకు కీర్తి కలగలనే కోరిక సంకల్పము యెహోవాతండ్రిదే - ఎపిసి 1:3-10

                 దేవుడు బిడ్డలు కావాలని కోరుకునపుడు వారిని బాగు చేసి రక్షించడము కూడా దేవుని బాద్యతే...
దేవుడు తన సేవకుల ద్వారా తన ప్రజలకు రక్షణ కలుగచేస్తాడు అది భౌతిక పరంగా కానీ లేక ఆత్మపరంగా కానీ దేవుడే రక్షకుడు.

దేవుడు తన ప్రజల కోసం ఆయా కాలాలలో వారికి రక్షకులను పుట్టించాడు.
            - న్యాయధిపతుల ద్వారా
            - ప్రవక్తల ద్వారా
            - రాజుల ద్వారా
            - చివరకు తన కుమారుని ద్వారా
దేవుడు రక్షణను ఇచ్చాడు..
ఈ విషయాన్ని ఈ క్రింది వివరణ ద్వారా చూడగలము..

★ న్యాయాధిపతులు 3:9 ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయులకొరకు నియమించి వారిని రక్షించెను.

★ న్యాయాధిపతులు 3:15: ఇశ్రా యేలీయులు యెహోవాకు మొఱ్ఱ పెట్టగా బెన్యామీ నీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పని వాడు. అతనిచేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా

★ యెషయా 19:20: అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహో వాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును.

★ 2రాజులు 13:5: కావున యెహోవా ఇశ్రాయేలువారికి ఒక రక్షకుని అను గ్రహింపగా అతనిచేత ఇశ్రాయేలువారు సిరియనుల వశములోనుండి తప్పించుకొని మునుపటివలె స్వస్థాన ములలో కాపురముండిరి.

★ నెహెమ్యా 9:27: అందుచేత నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి, వారి శత్రువుల చేతిలోనుండి వారిని తప్పించుటకై నీ కృపాసంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి.

★ యెషయా 19:20: అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహో వాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును.

★ ఓబద్యా 1:21: మరియు ఏశావుయొక్క కొండకు తీర్పుతీర్చుటకై సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు; అప్పుడు రాజ్యము యెహోవాది యగును.

★ జెకర్యా 12:8: ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును; ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటివారుగాను, దావీదు సంతతి వారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతలవంటి వారుగాను ఉందురు.

చివరికి క్రీస్తును కూడా యెహోవాతండ్రినే మన కొరకు పుట్టించాడు.
★ లూకా 2:11: దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.
          

ఎవరు రక్షించిన ఆ credit దేవునికే
ఎందుకంటే రక్షిస్తున్నది రక్షణకు వ్యక్తిలను తన ప్రజల కొరకు నియమిస్తునదే యెహోవా తండ్రి..

☦️ 2సమూయేలు 22:3: నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును.నా కేడెము నా రక్షణశృంగమునా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు బలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే.

☦️ నెహెమ్యా 9:27: అందుచేత నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి, వారి శత్రువుల చేతిలోనుండి వారిని తప్పించుటకై నీ కృపాసంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి.

☦️ అపో.కార్యములు 5:31: ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై *దేవుడాయనను అధిపతిని గాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించి యున్నాడు.*

☦️ అపో.కార్యములు 13:23: అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టిం చెను.

☦️ 1తిమోతికి 4:10: మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము.

☦️  లూకా 2: 29     —నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధాన ముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని.


★ సమస్తమునకు  యెహోవాతండ్రినే  రక్షకుడు*
★ సంఘానికి మరియు సమస్తమునకు తండ్రి చేత నియమింపబడిన రక్షకుడు యేసుక్రీస్తు.
ఉదాహరణకు :- దావీదు ఇశ్రాయేలుకు ప్రభువు, యెహోవా తండ్రి ఆయన కూడా ప్రభువునే, తండ్రి తనంతట తాను ప్రభువు, దావీదు నియమింపబడిన ప్రభువు అలానే క్రీస్తు కూడా.....

ఎఫెసీయులకు 5:23: క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు. 


 క్రీస్తుకు, రక్షించడానికి తగిన అధికారము ఎప్పుడు వచ్చింది?
ఆయన పునరుద్ధరణ తరవాత :
★ యోహాను 20:17: యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.

★ దానియేలు 7:13,14
రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులును రాష్ట్రములును ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.

★ మత్తయి 28:18: అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది.

★ అపో.కార్యములు 2:36: మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.


ముగింపు:-
ఇద్దరు రక్షకులే ఒకరు రక్షకులు ఇంకొకరు రక్షకులు కారు అనడానికి లేదు. ఎందువలనంటే రక్షణకర్తలు చాలామంది ఉంటారు కాబట్టి...
ఎవరిని ఎపుడు ఎలా నియమించాలో అది తండ్రి అధీనంలో మాత్రమే ఉంటుంది...
తండ్రి రక్షణకర్తగా ఉన్నవాడు
క్రీస్తు రక్షకుడు(తండ్రి చేత) నియమింపబడిన(పుట్టిన) వాడు..

---------- ౦ ---------

మీ
సహోదరుడు
Brother Suresh
9581881880

No comments:

Post a Comment