నేడు స్వస్థత వరము ఉన్నదా?


 నేడు స్వస్థత వరము ఉన్నదా?

          ఏ అద్భుత కార్యము లేదా సూచకక్రియలు చేయాలన్న పరిశుద్త్మ లేకుండా ఎలాంటి కార్యాలు జరగవు.. ఆయన అన్ని కాలములలో పని చేసాడు.. బైబిల్ ని ఎలా అపార్ధం చేసుకుంటున్నారు అంటే "నేడు ఇవి మనకు వర్తిస్తున్నాయి అని చెప్పడం ద్వారా" అపార్థం చేసుకోవడం జరుగుతుంది... లేఖన వెలుగులో సత్యాన్ని గమనిద్దాం...


పరిశుద్త్మను గూర్చిన వాగ్దానపు ప్రవచనము:-
అపొస్తలుల కార్యములు 2:17-21
అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.


పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపుసూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.

ప్రవచన ఆరంభము : పాతనిబంధన అంత్యదినములు
ప్రవచన  ముగింపు : యెరూషలేము దేవాలయపు నాశనము.

పూర్వ చరిత్ర:-
పరిశుద్త్మను గూర్చిన వాగ్ధానము మొదట  ఈ అపోస్తులకే అనుగ్రహించబడినది.
           యోహాను సువార్త 14:16,17,18,26
           యోహాను సువార్త 16:13,14,15
           యోహాను సువార్త 20:21,22,23
           అపొస్తలుల కార్యములు1:4
ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి;

అపోస్తులు పెంతుకొస్తున ఆత్మ వాగ్దానమును పొందుకున్నారు :-
     అపొస్తలుల కార్యములు 2:3,4,33
3.మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ
4.అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.
33.కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి యున్నాడు.
★ అదే వాగ్దనము ఇతరులకు(ఆదిమసంఘానికి) చేయబడినది:-
అపొస్తలుల కార్యములు 2:38,39
38.పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
39.ఈ వాగ్దానము 
"మీకును"
"మీ పిల్లలకును"
"దూరస్థులందరికిని(అన్యులు-ఎపేసి 2:11,22 )",
అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.

       ★ పరిశుద్త్మ వరములు మొత్తం 9 ★
ఈ వరములు అన్ని పరిశుద్త్ముడు తన చిత్తము ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా ఇస్తాడు. - 1 కోరింది 12:1-11
            1. బుద్ధి వాక్యము
            2. జ్ఞాన వాక్యము
            3. విశ్వాసము
            4. స్వస్థపరచు వరము
            5. అద్భుత కార్యములు చేయు శక్తి
            6. ప్రవచన వరము
            7. ఆత్మల వివేచన
            8. నానా విధాబాషాలు
            9. బాషాలకు అర్ధం చెప్పు శక్తి.

◆ ఒక్కొక్కరికి ఒక్కో వరము, రెండవ వరము కొరకు ప్రార్ధన చేయవలెను - 1 కోరింది 14:13

◆ ఈ వరములు అపోస్తులు మాత్రమే ఇవ్వగలరు.
                  అపో 8:3-20 చూడుము...
                  అపో 19:1-3 చూడుము...

◆ మొదటి శతాబ్ది సంఘము అవసరతను బట్టి మొదటి శతాబ్ది వారందరికి ఇవ్వబడెను...
కొని వచనములు చూద్దాము :-
              అపొస్తలుల 8:12,13.....
             అపో.కార్యములు 19:6....
            1కోరింథీయులకు 12:10....
             అపో.కార్యములు 21:9.......


ఈ ఆత్మ వరములు దేనికి?
      ★ సంఘ క్షేమాభివృది కొరకు - 1 కోరింది 14:2-5; 12-15; 28

     ★క్రొత్త నిబంధన/సంఘము పూర్తి కానీ సమయము ఆ క్రమమును బట్టి నడుచుటకు - పిలిపి  3:15-17

    ★వాక్యము  స్థిరపరచబడుటకు - మార్కు 16:20



✔️ ఈ ఆత్మ వరములు తాత్కాలికమైనవి, నిలిచిపోయేవి(temporary things).
           1 కొరింథీయులకు 13:8,9,10,11
8.ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;
9.మనము కొంతమట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాముగాని
10.పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.
11.నేను పిల్లవాడనైయున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.
Note:-
         పిల్లవానికి పెద్దవానికి మధ్య ఒక కాలము ఉంటుంది అదే ఎదుగుదల. పెద్దవాడైనపుడు పిల్లవాని చేష్టలు మనివేయాలి అని చెప్తున్నాడు. అలాగే ఈ ఆత్మ వరములు బాల్య దశకు చెందినవి, సంఘము పూర్ణము అయినపుడు పూర్ణముకాని ఈ ఆత్మావరములు ఉండవు అని అలంకరముగా చెప్తున్నాడు..
ఎఫెసీయులకు 4:11,12,13,14
11.మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగువరకు,
12.అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.
13.పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.
14.అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలల చేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక,
15.ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.

✊ ఈ స్వస్థతలు మొదటి శతాబ్ది ముగింపులోనే వాటి వినియోగము యొక్క మహిమ తగ్గిపోయినది...
             ★ 1తిమోతి 5:23  ★
             ★ యాకోబు 5:14  ★
             ★ పిలిప్పు 2:26,27 ★
             ★ 2 తిమోతి 4:20  ★
స్వస్థత వరాలు ఉన్నవి కదా ఎందుకు అపోస్తులులు స్వస్థత ఇవ్వలేకపోయారు? ఇక వాటితో అవసరతా తగిపోయినది అని అర్ధం అవుతున్నది.

మరి నేడు స్వస్థతలు అద్బుతల ఎలా జరుగుతున్నాయి? 

★ మోసముతో జరుగుతునవి.
              2 థేస 2:10-12 చూడుము.....
ఎందుకు?
              ద్వితి 13:1-3 పరీక్షించుటకు
              1 యోహాను 4:6...
ఉదాహరణకు:-
ఈ రోజులలో చేసే స్వస్థతలు మోసము అని గ్రంధం చెప్తునది ఎలాగ అంటే వారు చేసే స్వస్థత " యేసు/యేసయ్య నామము " అని అంటారు. యేసు అనేది తర్జుమా నామము మాత్రమే కానీ నిజమైన నామము కాదు అలంటాప్పుడు ఆ స్వస్థత నిజమైనది ఎలా అవుతుంది. 
                తర్జుమా నామము వాడితే వచ్చే స్వస్తత కూడా తర్జుమనే, జాగ్రత్త దేవుని బిడ్డలారా మోసం జరుగుతుంది, అపవాది మోసముతో నీవు బైబిల్ ఉన్న వాక్యాన్ని నీలో ఫలింపకుండా చేస్తుంది... ఒక సారి పరీక్షించుకో బైబిల్ లో నీకు ఏమి తెలుసు? ఏ అంశం గురించి తెలుసు? నా విశ్వాసానికి ఆధారము ఏది? ఈ రోజులలో ఏదైనా చూస్తే కానీ నమ్మట్లేదు అలాంటిది విశ్వాస సంబంధ విషయాలు చూడకపోతే ఎలా?

యేసు అనేది గ్రీక్ లో "ఇసోస్ " అని ఉంటుంది...
యేసు పేరును గ్రీకు లో చూడండి G2424 (Iesous)..
యేసు అనేది local name..


⭕ ఇపుడు వీరు చేసే స్వస్థతలు ఆనాడు ఆదిమసంఘము చేసిన స్వస్థతలకు విరుద్ధమైనవి...

■ అప్పట్లో, ఎవరు కూడా నేను స్వస్థత వరము కలవాడినని publicity చేసుకోలేదు..

■ వాళ్లు స్వస్థత చేస్తే క్రొత్త parts వచ్చేవి, కళ్ళు లేకపోతే కళ్ళు వచ్చేవి..
      - చనిపోయిన శవాన్ని బ్రతికించారు.
      - కుంటివానికి కాళ్ళు ఇచ్చారు.
      - పుట్టి గుడ్డి వానికి కళ్ళు ఇచ్చారు
      - ఎండిపోయిన చేతిని స్వస్థపరిచారు.

■ అపోస్తులు చేసే స్వస్తతలో failure అనేది ఉండదు..

■ అప్పట్లో స్వస్తత బహిరంగముగా జరిగేవి కానీ నేడు stage ఎక్కితేనే లేదా రహస్యముగా జరుగుతున్నవి...
              మత్తయి 9:31-32
              అపో 20 అధ్య
              అపో 3:1.

■ స్వస్థతకు 7 వారాలు రమ్మా 3 వారాలు రమ్మా నేడు చెప్తున్నారుకాని అప్పట్లో sport లో స్వస్థత చేసేవారు...

■ విశ్వాసము లేదు అందుకే నీకు స్వస్థత లేదు అంటారు:-
అసలు అక్కడి వారికి విశ్వాసము అంటేనే వారికి తెలియదు..
               యాకోబు 5:14
                  అపో 3:1

అంత స్వస్థత వరము ఉంటే  hospital లేదా అనాధ ఆశ్రమములో  వెళ్లి  స్వస్థత చెయ్యి   అక్కడ చాలా మంది రోగాలతో ఉంటారు  అంటే బయటకు రానుకుడా రారు. అక్కడే తెలిసిపోతుంది అది అబ్బద్ద బోధ అని.

                క్రైస్తవ్యము అంటే ముందు ఆత్మ సంబంధమైన స్వస్థత పొందగోరాలి... తరవాత అవాన్నియు అనుగ్రహింపబడతాయి...
మత్తయి 6:33: కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును.
మత్తయి 4:4: అందుకాయనమనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.


భక్తులు ఈ సూచక క్రియలు, అద్భుతాలు, స్వస్థతలు చేయుటకు ఒక కారణము ఉన్నది...
■ మోషే అద్బుతములు చేసాడు దేనికి?
దేవుడు మోషేకు చెప్పిన మాటలు జనులు వినవలెనని.
నిర్గమ 4:1-9

■ యేసుక్రీస్తు అద్బుతములు సూచకక్రియలు చేసాడు తను దేవుని కుమారుడు అని తెలియడము కోసము.. యోహాను 20:22

■ అపోస్తులు మరియు ఆదిమ సంఘము చేశారు దేనికి? వాక్యము స్థిరపరచడానికి... అపో 16.20

■ వాక్యము సంపూర్తి అయ్యాక నేడు మనము దేనికి చేయాలి?
మా సంఘము గొప్పది లేదు మా సంఘము గొప్పది అని చెపుకోవడానికా?..
స్వస్థత వరములు చేతుల ద్వారా ఇచ్చే అపోస్తులులే నేడు లేనప్పుడు ఇక స్వస్థత వరము ఎలా కలిగి ఉంటావు?. అవాన్నియు పాత నిబంధనతోనే గతించినవి..

గమనిక:
స్వస్థతలు అసలు లేవా? అనే ప్రశ్న వస్తే, దానికి సమాధానము : స్వస్థతలు ఉన్నాయి అవి దేవుని నుండి జరిగేవే కానీ ఇలా వరాల ద్వారా జరిగేవి కావు, దేవుడు తనకు నచ్చిన వారిని స్వస్థపరుస్తాడు... ఆయన స్వస్థత పరచాలని ప్రార్దన మరియు ఉపవాసము చేయవలెను.. ఆయన కనికరిస్తాడు స్వస్థత పరుస్తాడు..


ముగింపు:
1. స్వస్థత వరము ఒక ప్రవచనం దాని నెరవేర్పు పాతనిబంధన అంత్యదినములలో మనం చూడగలము..

2. స్వస్థతవరమును అపోస్తులుల చేతుల మీదగా సంఘానికి ఇవ్వబడినది.

3. మొదటి శతాబ్దoలో అన్ని స్థానిక సంఘములు ఈ వరమును పొందియున్నారు.. పౌలు 3 ప్రయణములు చూడుము తెలుస్తుంది..

4. ఈ వరము వలన వాక్యము స్థిరపడుతుంది, సంఘానికి క్షమాభివృది జరుగుతుంది..

5. ఇవి తాత్కాలికమైనది...

6. యెరూషలేము దేవాలయము తరవాత అందరూ పత్రికల ద్వారా స్వస్థత నొందినారు కానీ ఈ వరములు లేవు ఎందుకంటే వారి మాటలు లికించబడ్డాయి...వరములు ఇవ్వగల శక్తి ఉన్న అపోస్తులు చనిపోయారు..

7. ఈ రోజులలో చేసే స్వస్థతలు మోసము అని గ్రంధం చెప్తునది ఎలాగ అంటే వారు చేసే స్వస్థత " యేసు నామములో" అని అంటారు. యేసు అనేది తర్జుమా నామము మాత్రమే కానీ నిజమైన నామము కాదు అలంటాప్పుడు ఆ స్వస్థత నిజమైనది ఎలా అవుతుంది.
యేసు అనేది గ్రీక్ లో "ఇసోస్ " అని ఉంటుంది...

                    --------- ౦ -----------

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:

Post a Comment