ఏలోహిమ్ - Elohim


ఏలోహిమ్

Elohim ఈ పదాని చాలా అపార్ధం చేసుకున్నారు ఇది బహువచనము మాత్రమే అనే ఉద్దేశ్యంలో చాలా మంది ఉన్నారు, గ్రంధాని అలానే చదువుతున్నారు.

Elohim నుండి త్రిత్వ సిద్ధాంతము పుట్టినది.
దేవుడు త్రిత్వం అని elohim అంటే దేవుళ్లు బహువచనము అనే అర్ధం ఒక దేవుడే బహుళత్వం గలవాడని వాదించుదురు.

Elohim పాతనిబంధనలో సుమారుగా 2600 సార్లు ఉంది.
Strong's h430
- Lexical: אֱלֹהִים
- Transliteration: elohim
- Part of Speech: Noun Masculine
- Phonetic Spelling: el-o-heem'
- Definition: God.
- Origin: Plural of 'elowahh; gods in the ordinary sense; but specifically used (in the plural thus, especially with the article) of the supreme God; occasionally applied by way of deference to magistrates; and sometimes as a superlative.

ఈ పదం వాడిన మోషే పండితుడు, విద్యావంతుడు
బాషా మీద ప్రావీణ్యము గలవాడు...

★ ఎక్కువగా ఏకవచనములోనే కనపడుతున్నది
★ Elohim ఏకవచనమే సందర్భమును బట్టి బహువచనముగాను ఉపయోగించబడెను.
హీబ్రులో ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి.

ఉదాహరణకు:- 
ఇంగ్లీష్ లో "YOU" అనే పదమును నీవు అని మీరు అనిన "YOU" అంర్ ఒకే పదమును వాడుదురు.. ఇలాంటిదే ఈ ఏలోహిమ్(Elohim) కూడా.


🍒 Elohim యొక్క ఏకవచనములు గల సందర్భములు:

👉 మోషే Elohim
నిర్గమకాండము 7:1
కాగా యెహోవా మోషేతో ఇట్లనెనుఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని; నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును.

👉 దూత Elohim 
ఆదికాండము 48:15,16
అతడు యోసేపును దీవించినా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవనియెదుట నడుచుచుండి
రో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకు లను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను.

👉 రాజు elohim
కీర్తనల గ్రంథము) 45:6
దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము.

👉 తండ్రి Elohim
యెషయా 45:18: ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.

👉 అన్యదేవత Elohim 
నిర్గమకాండము 32:31
అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి అయ్యో యీ ప్రజలు గొప్ప పాపము చేసిరి; వారు బంగారు దేవతను తమకొరకు చేసికొనిరి.
◆ న్యాయాధిపతులు 6:31
యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితోమీరు బయలు పక్షముగా వాదింతురా? మీరు వాని రక్షించు దురా? వానిపక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను; ఎవడో వాని బలిపీఠమును విరుగగొట్టెను గనుక, వాడు దేవతయైనందున తన పక్షమున తానేవాదించ వచ్చును.
బైబిల్ నందు ఇంకా చాలా సందర్భములు చూడగలము.


పాతనిబంధంలో Elohim మాట్లాడిన సందర్బాలలలో Elohim అంటే క్రొత్త నిబంధనలో ఏకవచనమా లేక బహువచనమా ఆలోచన చేద్దాం:

👉యిర్మీయా 31:34 - నేను వారికి దేవుడైనే(elohim) యుందును వారు నాకు జనులగుదురు;

👉 హెబ్రీయులకు 8:10 - ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై(theos) యుందును వారు నాకు ప్రజలై యుందురు.(యిర్మీయా 31:31-35)

👉 మార్కు 10:6 - సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురు షునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను.(ఆది1:27).

★ పై సందర్భాలలో ఎక్కడ కూడా దేవుని బహుళత్వం(తండ్రి,కుమార,పరిశుద్త్మ) కనపడలేదు.
అలా అయిఉంటే 2600 సార్లు కూడా బహుళత్వాని ఆ పదం చూపించాలి.

★ పాతనిబంధలోని ఏలోహిమ్ అనే పదాన్ని క్రొత్తనిబంధనలో థియస్ అని మార్చారు అంటే దేవుడు అనే ఏకవచనము ఆపాదించారు.. దీనిని బట్టే అర్ధం చేసుకోవాలి అది మొదట ఏకవచనము తరవాత బహువచనము అని.

✴️ రచయితలు మనసులో దేవుడు(elohim) బహుళత్వం కలవాడు అనే భావం వచ్చేలా ఏ గ్రంథ0లోను వారు రాయలేదు, ఇజ్రాయేల్ వారు చదువుకోనులేదు, ఇజ్రాయేల్ కి elohim అంటే తెలిసింది దేవుడే అని, అంతే కాని తండ్రి కుమార పరిశుద్త్మ అని వారు ఎపుడు అనుకోలేదు.

★ తర్జుమా దారులు సరియిన అవగాహనతోనే వారి ద్వారా సరైన తర్జుమాను దేవుడు వారి చేత చేయించాడు.

★ Elohim అంటే కేవలం బహుళత్వం మాత్రమే అనిలేదు, తండ్రి కుమార పరిశుద్త్మ త్రియేక దేవుడు కాదు, అలా అని మోషే ఎక్కడ కూడా ఆ భావం వచ్చేలా చెప్పలేదు రాయలేదు కూడా.

Elohim అంటే దేవుడు (ఏకవచనము)
Elohim అంటే దేవుళ్లు (బహువచనము)
Elohim అంటే కొన్ని సందర్భాలు ఏకవచనముగానే చదవాలి కొని సందర్భాలు బహువచనముగానే చదవాలి...

● Elohim అనే పదమువలె చాలా పదములు హీబ్రులో సందర్భాన్ని బట్టి ఏకవచనము గాను, బహువచనముగాను వాడబడుచుండెను.

Additional information:
El = దేవుడు
ఈ పదం ఎల్లపుడు ఏదైనా పేరుతో జాతపడుతుంది.
సర్వశక్తిగలదేవుడను
రోషముగలదేవుడను
బేతేలు దేవుడను
అబ్రాహాము దేవుడను
Samuel
Daniel
Eli
Elizabeth
Immanuel
ఈ పై విధముగా ఉండును.


🙏Eloah: దేవుడు
ఇది 57 సార్లు ఉన్నది
ఎక్కువగా ఏదైనా వాద ప్రతివాదనలపుడు ఈ పదం ఎక్కువగా చూడగలము ఎక్కువగా యెబు గ్రంధంలో చూడగలము.

-------- ౦ ----------
మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:

Post a Comment