వాక్యాన్ని పరిశీలించుము




బైబిల్ ని వ్యాఖ్యానించాలి:

బైబిల్ ఎపుడు అపార్ధం చేయబడుతుంది?
 ఇవి నేడు మనకు వర్తిస్తున్నాయి అని అన్వయించుకున్నపుడు అపార్ధం చేయబడుతుంది.. బైబిల్ మన చేతిలో ఉన్నపుడు అది 66 పుస్తకాల
గ్రంధాలయము/సమూహము అనే విషయం మర్చిపోకూడదు. ఒక విషయమును గూర్చి సుదీర్ఘమైన చర్చ చేయునపుడు యెనుకోబడిన లేఖన భాగములను, లేఖికుని ఉద్దేశ్యమును, అలాగే మొదట పాఠకులకు వచ్చే అర్ధమునే ప్రాధమికంగా తీసుకోవాలి ఎందుకంటే అవి వ్రాయు లేఖికుడు ఎవరినైతే మనసులో పెట్టుకొని వ్రాస్తున్నాడో వారికే అవి మొదటిగా చెందును..
                అలాకాకుండా ముక్కలు ముక్కలుగా వాక్యములను తీసుకుని వాటిని అతికించి దాని ద్వారా వచ్చే అర్ధమును బట్టి విషయమును తీర్మానించకూడదు.. అలాగే మనకు నచ్చిన విధముగా అక్కడక్కడ కొని వాక్యములను తీసుకొని సమర్దించుకొనే ప్రయత్నాము చేయకూడదు. అలా చేసినట్లయితే అనేకమైన గందరగోళ పరిస్థితులకు వెళ్లి లేనిది బోధిస్తాము. ఇంకా రచయితను గౌరవించిన వారిమి కాకపోదుము..

                   కావున లేఖికుడు తన శ్రోతలతో ఏమి చెప్పదలచుకున్నాడో లేక వారు ఏమి గ్రహించాలి అని కోరుతున్నాడో అనే పంథాలోనే చదువుతూ ఆలోచించాలి. ఈ పద్ధతినే వ్యాఖ్యానము లేదా వ్యాఖ్యనశాస్త్రము అందురు, ఇంగ్లీషులో Hermeneutic అందురు. అంటే -
గ్రంధాకర్త ఎవరు?

వ్రాయబడిన కాలము?

కాల పరిస్తితులు?

శ్రోతలు/గ్రహితులు?

వ్రాయుచున స్థలము?

సాహిత్య శైలి?

ఉదేశ్యము?

లక్ష్యము?

సందేశాన్ని తదితర అంశాలతో పోల్చుతూ సరిచుచుతూ చడవవలెను...
(యెషయా 28:13; అపో 8:34; 17:11; 1 పేతు 1:11; 2 తిమోతి 2:15).


తగిన జాగ్రత్తలు
ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి.(మార్కు 4:24) జాగ్రత్తగా వినాలి లేకపోతే బోధ మారిపోతుంది..

ఎందుకు జాగ్రత్త ? :-
మత్తయి సువార్త 24:24,25
అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.
ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను.
అపొ"కా  20:29,30
నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు.
మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.


1️⃣ వినువారికి హెచ్చరికలు :-
1. బోధకులను పరీక్షించాలి - 1 యోహాను 4:1
     A. పరీక్షించకపోతే కలుగు నష్టాలు:-
                   1 పేతురు 2:1
                  తితు 1:10,11
2. బోధను పరీక్షించాలి - అపో 17:10,11

3. అబద్ధ బోధకుల నుండి తొలగిపోవాలి:-
                  రోమా 16:17-18
                   2 యోహాను 1:10,11


2️⃣ వాక్యము చదువుటలో జాగ్రత్తలు :-
★ 1 తిమోతికి 2:4
ఆయన, మనుష్యులందరు రక్షణపొంది "సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు."
ప్రవచనం :-
మత్తయి సువార్త 24:24,25
అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.
ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను.

సత్య మార్గాన్ని కనుగొను
★ 1 థెస్సలొనీకయులకు 5:21
సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.

★ యిర్మీయా 6:16
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమార్గ ములలో నిలిచి చూడుడి, పురాతనమార్గములనుగూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారుమేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు.

సమస్తము తెలియలి అంటే బైబిల్ చడవవలెను.
ప్రకటన గ్రంథము 1:3
సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువు వాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.


బైబిల్ చదవటం అనేది ఒక ఆజ్ఞ.
★ ద్వితీయోపదేశకాండము 17:20
తాను తన సహోదరులమీద గర్వించి, యీ ధర్మమును విడిచిపెట్టి కుడికిగాని యెడమకు గాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహో వాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని యీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువు చుండవలెను.

★ 1 తిమోతికి 4:13
నేను వచ్చువరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము.

★ కొలస్సీయులకు 4:16
ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి.

★ 1థెస్సలొనికయులకు 5:27
సహోదరులకందరికిని యీ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువుపేర మీకు ఆన బెట్టుచున్నాను.

చదివితే సరిపోదు గ్రంథమును నేర్చుకోవలెను..
★ అపొస్తలుల కార్యములు 8:27౼35
అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటి మీదనున్న ఐతియొపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను.
అతడు తిరిగి వెళ్లుచు, తన రథముమీద కూర్చుండి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండెను.
అప్పుడు ఆత్మ ఫిలిప్పుతోనీవు ఆ రథము దగ్గరకుపోయి దానిని కలిసికొనుమని చెప్పెను.
ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొనిపోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా వినినీవు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా
అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడు కొనెను.
అతడు లేఖనమందు చదువుచున్న భాగ మేదనగా ఆయన గొఱ్ఱెవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను.
ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకకపోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది.
అప్పుడు నపుంసకుడుప్రవక్త యెవనిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా?దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను.
అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను.
         -- ద్వితీయోపదేశకాండము 31:12
మీ దేవు డైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యము లన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను.
        -- రోమీయులకు 16:17
సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.


నేర్చుకుంటే సరిపోదు దానిని సొంతగా పరిశీలన చేయాలి?
★ యెషయా గ్రంథము 34:16
యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి.

★ అపొస్తలుల కార్యములు 17:11
వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.

గ్రంధం నేర్చుకోవడమే కాదు దాని ప్రకారం నడవవలెను.
★ ఎజ్రా 7:10 ౼ ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసికొనెను.
    - దీనిని ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుడిచ్చిన ఏ నిబంధనైనా ఆ నిబంధనను లోబడి జనులు నడవవలెను అని అర్ధం చేసుకోవాలి...

★ 2 దినవృత్తాంతములు 17:9
వారు యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును చేత పుచ్చుకొని యూదావారిమధ్య ప్రకటనచేయుచు, యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి.


బోధించువారికి హెచ్చరికలు:-
1. పరంపర్యచరాలు బోధించారాడు - మత్తయి 15:7,8,9
2. వేరొక సువార్త చేయరాదు - గలతి 1:8
3. జ్ఞానమైన తియ్యటి మాటలు బోధించారాడు - 1 కోరింది 2:4-6
4. వాక్యంలో ఏది కలపకూడదు తీసివేయకూడదు :-
      - ద్వితి 4:2
      - ద్వితి 12:32
      - సామెత 30:5,6
      - గలతి 1:8
      - ప్రకటన 20:18,19
5. దైవోక్తులు బోధించినట్టు బోధించాలి- 1 పేతురు 4:11.

ముగింపు :-
వాక్యమును సరిగా అర్ధం చేసుకోక పోతే మన పరిస్థితి నాదబు అభిహులు వాలే అయ్యిది (లేవి 10:1,2), అవగాహన లేని వంటకం ఎలాంటిది అవగాహన లేని జీవితము అలాంటిదే. ఇకనైనా జాగ్రత్తగా వాక్యము చదువు సత్యాన్ని చెప్పటు, తెలియపోతే/అర్ధం కాకపోతే ఎవరినైనా అడుగు సత్యాన్ని అనేవేక్షించు...

---------- ౦ ----------

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:

Post a Comment