వందనములు
ప్రభువు పేరట నా ఆత్మీయ సహోదారులకు నా వందనములు. చాలా మంది భక్తులు, వారి తోటి పరిశుద్ధులను కలుసుకున్నప్పుడు కొందరు మరనత అని, షాలోమ్ అని, మరికొందరు ప్రైస్ ది లార్డ్ అని, ఇంకొంతమంది వందనములు అని చెపుకొనుట మనము సాధారణముగా చూస్తున్నాము.
ఇలా ఒకరికొకరు చెప్పుకోవడము చూస్తూ ఉంటున్నాము. వాస్తవానికి వారికి ఈ పదాల అర్ధము తెలియదు అలా తెలియకే వారు పదాలు బాగున్నాయి కదా, మనం కొంచం different గా ఉండాలి అని సాహసాలు చేస్తున్నారు..
మనము ఒక్కొక్క పదము యొక్క అర్ధం తెలుసుకుందాము..
🌹Praise the Lord (ప్రైస్ ది లార్డ్)🌹
● హీబ్రూ 'లో' - הַ֭לְלוּ יָ֨הּ ׀ (హల్లెలుయా)
● గ్రీక్ 'లో' - Ἁλληλουϊά (హల్లెలుయా) g239
● ఇంగ్లీష్ 'లో' - Praise The Lord
● తెలుగు 'లో' - "యెహోవాను స్తుతించుడి"
(ప్రభువును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి)
● గ్రీక్ 'లో' - Ἁλληλουϊά (హల్లెలుయా) g239
● ఇంగ్లీష్ 'లో' - Praise The Lord
● తెలుగు 'లో' - "యెహోవాను స్తుతించుడి"
(ప్రభువును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి)
◆ కీర్తనల గ్రంథ రచయితలు -
యెహోవాను 'లేదా' దేవుని స్తుతించుట -
(కీర్తనల 7:17; 33:2; 104:35; 115:18; 116:19; 148:1,7).
యెహోవాను 'లేదా' దేవుని స్తుతించుట -
(కీర్తనల 7:17; 33:2; 104:35; 115:18; 116:19; 148:1,7).
◆ "స్తుతించుట" అనగా అర్ధము "పొగడుట, అభివర్ణించు, కీర్తించు, స్తోత్రముచేయు, కొనియాడు..."
➡️ ఇరుగురు కలుసుకొని ఒకరికొక్కరు "ప్రైస్ ది లార్డ్" అని అనుకొనుట వలన నిజముగా దేవుని అభివర్ణించు కార్యక్రమము జరుగదు. ఎవరైనా praise the Lord అంటే మీరు ఆమెన్ అనవలెను..
■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు "ప్రైస్ ది లార్డ్" అని సంబోధించాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు.అలాంటి మాదిరి మనకు బైబిల్ నందు కనపడదు.
🌹మరన త🌹
● గ్రీక్ 'లో' - "Μαράνα tha" (మరన త).
● ఇంగ్లీష్ 'లో' - "maranatha".
● తెలుగు 'లో' - "ప్రభువు వచ్చుచున్నాడు", "ప్రభువా రమ్ము", "ప్రభువు వచ్చియున్నాడు", మరియు "మరన త".
● ఇంగ్లీష్ 'లో' - "maranatha".
● తెలుగు 'లో' - "ప్రభువు వచ్చుచున్నాడు", "ప్రభువా రమ్ము", "ప్రభువు వచ్చియున్నాడు", మరియు "మరన త".
● పరిశుద్ధ గ్రంథము అంతటిలో "మరనత" అనే పదమును 1కోరింథీయులకు. 16: 22 మాత్రమే చూడగలము.
● ప్రభువు వస్తే ఏమి జరుగుతుంది భక్తిహీనుల మీద తీర్పు జరుగుతుంది.
● అది ఒక హెచ్చరిక కలిగిన పదము జాగ్రత అనే ఉద్దేశ్యము.
■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు "మరనత" అని సంబోధించాలని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు. అలా పిలవాలని మాదిరి కూడా లేదు.
🌹షాలోమ్🌹
● హీబ్రూ 'లో'- "שָׁלוֹם". (šā·lō·m)
● గ్రీక్ 'లో' - "Εἰρήνην". (eirēnēn)
● ఇంగ్లీష్ 'లో' - "peace".
తెలుగు 'లో' - "శాంతి, సమాధానము"
● గ్రీక్ 'లో' - "Εἰρήνην". (eirēnēn)
● ఇంగ్లీష్ 'లో' - "peace".
తెలుగు 'లో' - "శాంతి, సమాధానము"
◆ శాంతి అనగా అర్ధము "ఆనందము, హాయి".
◆ కొని వచనములు చూద్దాము..
(నిర్గమ. 14:14; సంఖ్యా. 6:26; యెషయా. 26:12; యోహాను. 14:17; కోలాస్సి. 3:15).
(నిర్గమ. 14:14; సంఖ్యా. 6:26; యెషయా. 26:12; యోహాను. 14:17; కోలాస్సి. 3:15).
■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు "షాలోమ్" అని సంబోధించాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు.
🌹వందనములు🌹
● గ్రీక్ 'లో' - "ἀσπάσασθε" (అస్పసస్తే).
● ఇంగ్లీష్ 'లో' - "Salute, Greet".
● తెలుగు 'లో' - "వందనములు లేదా శుభము".
● ఇంగ్లీష్ 'లో' - "Salute, Greet".
● తెలుగు 'లో' - "వందనములు లేదా శుభము".
★ "వందనములు" అనగా అర్ధము " అభివాదనము, నమస్కారము, అభినందనము...".
🌹 వందనము చేయుట ఇశ్రాయేలు వారికి సహజ వాడుక అది వారికి గౌరవం ఇచ్చు పుచ్చుకొనుట :-
👉🏽 పాతనిబంధనలో :-
★ ఆదికాండము 42:6
అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారియై యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనముచేసిరి.
అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారియై యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనముచేసిరి.
★ 1సమూయేలు 13:10
అతడు దహనబలి అర్పించి చాలిం చిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలిసికొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగ
అతడు దహనబలి అర్పించి చాలిం చిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలిసికొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగ
★ నిర్గమకాండము 18:7
మోషే తన మామను ఎదుర్కొన పోయి వందనము చేసి అతని ముద్దు పెట్టు కొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలిసికొని గుడారములోనికి వచ్చిరి.
మోషే తన మామను ఎదుర్కొన పోయి వందనము చేసి అతని ముద్దు పెట్టు కొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలిసికొని గుడారములోనికి వచ్చిరి.
👉🏽 క్రొత్త నిబంధనలో :-
★ మత్తయి 5:47
మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.
మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.
★ లూకా 1:41: ఎలీసబెతు మరియయొక్క వందనవచనము విన గానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను
ప్రతి పత్రిక నందు ఈ పదము చూడగలము విశేషముగా రోమా 16 అధ్యాయము చదువుము..
★ రోమీయులకు 16:16
పవిత్రమైన ముద్దుపెట్టుకొని "యొకని కొకడు వందనములు చేయుడి." క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.
పవిత్రమైన ముద్దుపెట్టుకొని "యొకని కొకడు వందనములు చేయుడి." క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.
★ ఫిలిప్పీయులకు 4: 21
" ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి".
" ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి".
✴️ పవిత్రమైన ముద్దు పెట్టుకొనుట నిజమైన ప్రేమకు ఒక చిహ్నము:-
★ 1పేతురు 5: 14
" ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి".
" ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి".
★ 1థెస్సలొనికయులకు 5: 26
పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.
పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.
★ రోమీయులకు 16: 16
పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి.
పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి.
యూదులు యొక్క ఆచారము వారు తోటి సహోదరులుకి వందనము చెప్పినప్పుడు పవిత్రమైన ముద్దుతో లేదా తలలు వంచి వందనములు చెప్పేవారు
✴️ వందనము చేయుట మనకు అపోస్తులు నేర్పిన మాదిరి:-
★ 2కోరింథీయులకు 13: 13
"పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు".
"పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు".
★ 2థెస్సలొనికయులకు 3: 17
పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను; ప్రతి పత్రికయందును అదే గురుతు, నేను వ్రాయుట ఈలాగే.
పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను; ప్రతి పత్రికయందును అదే గురుతు, నేను వ్రాయుట ఈలాగే.
★ హెబ్రీయులకు 13: 24
మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి.
మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి.
★ తీతుకు 3:15
నాయొద్ద ఉన్నవారందరు నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమునుబట్టి మమ్మును ప్రేమించువారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికి తోడైయుండును గాక.
నాయొద్ద ఉన్నవారందరు నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమునుబట్టి మమ్మును ప్రేమించువారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికి తోడైయుండును గాక.
Note:-
సహోదరుడు వందనము చేసినయెడల ఎదుటివాడు వందనము చేయని యెడల అతనిలో రెండు కారణములు కలవు..
సహోదరుడు వందనము చేసినయెడల ఎదుటివాడు వందనము చేయని యెడల అతనిలో రెండు కారణములు కలవు..
1. అతను దేవుని ప్రేమ లేనివాడై ఉండాలి
2. క్రీస్తు బోధ నుండి తొలిగిన వాడైన ఉండాలి - 2యోహాను 9-11
2. క్రీస్తు బోధ నుండి తొలిగిన వాడైన ఉండాలి - 2యోహాను 9-11
చాలామంది తమ ప్రార్ధనలలో "తండ్రి నీకే వందనములు" అంటూ ప్రార్ధన చేయుదురు అది తప్పు.
వందనములు సహోదారులకు మాత్రమే చెప్పవలెను యెహోవా తండ్రి మనకు సహోదరుడు కాదు ఆయన మనకు తండ్రి అందువలన ప్రార్ధనలలో తండ్రికి వందనము చేయరాదు..
వందనములు సహోదారులకు మాత్రమే చెప్పవలెను యెహోవా తండ్రి మనకు సహోదరుడు కాదు ఆయన మనకు తండ్రి అందువలన ప్రార్ధనలలో తండ్రికి వందనము చేయరాదు..
రోమీయులకు 16: 16
🙏 "క్రీస్తుసంఘములన్నియు"
మీకు వందనములు చెప్పుచున్నవి 🙏
🙏 "క్రీస్తుసంఘములన్నియు"
మీకు వందనములు చెప్పుచున్నవి 🙏
మీ
సహోదరుడు
Brother SURESH
9581881880
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:
Post a Comment