(బార్యభర్తల కలయికలో పాపము ఉంది, కలయిక పాపము అని కొంతమంది బోధకులు పుట్టుకొచ్చారు)
ANs : బైబిల్ లో ఎక్కడ కూడా బార్యభర్తల కలయిక పాపము అని కానీ, ఆ ప్రక్రియను దేవుడు భంగము చేసినట్టు కానీ, బార్యభర్తల ధర్మం పాపము అనే భావం కానీ మనకు కనపడడు.
వివాహమంటే అందరి విషయంలో మాననీయం , దాంపత్యం *పవిత్రం*. అయితే జారత్వం, వ్యభిచారం చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు.
హీబ్రూ 13:4
వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, *పానుపు నిష్కల్మషమైనది* గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.
వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, *పానుపు నిష్కల్మషమైనది* గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.
➡ పానుపు అంటే కలయిక పరిశుద్ధము, నిష్కల్మషమైనది, కల్మషంలేనిది, పాపములేనిది, అను అర్ధం ఇచ్చు amiantos #283 Greek strong నుండి తీయబడినది.
హెబ్రీ గ్రంధాకర్త ప్రకారం బార్యభర్తల కలయిక పరిశుద్దమైనది.
పానుపు పరిశుద్దముగా ఉండాలి అంటే?
వివాహము అయిన తర్వాత ఇతర ఏ స్త్రీ/పురుషుడుని కలవకూడదు అందుకే హెబ్రీ గ్రంధాకర్త వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అన్నాడు.
వివాహము అయిన తర్వాత ఇతర ఏ స్త్రీ/పురుషుడుని కలవకూడదు అందుకే హెబ్రీ గ్రంధాకర్త వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అన్నాడు.
ఈ కలయికను దేవుడు అనుమతించడానికి గలా కారణము వారి యొక్క సహజవాంఛలు వివాహము ద్వారా తీర్చబడాలి తద్వారా సంతానం కలగాలి వారు భూమిని నిండించాలని దేవుడు ఈ కలయికను ఏర్పరచాడు. (ఆది 1.28)
ఈ కలయిక ఎలా పరిశుద్ధ పరచబడాలో చెప్పడానికి ముందు వివాహమును పెట్టి దానిని ఘనమైనది అన్నాడు, వివాహము ఘనమైనపుడు పానుపు ఏమి అయివుండలి?? మీకే వదిలేస్తున్నా..
అయితే ఈ కలయిక ఎపుడు పాపము అయిది?
➡వివాహమును ముందే అంటే బార్యభర్తలు కాకమునుపు,
➡వివాహానికి సంబంధం లేకుండా ఇతర స్త్రీలను/పురుషులను కలసినపుడు,
➡ వివాహ0 అనంతరం ఇతర స్త్రీలతో/పురుషులతో కలసిన,
➡ పురుషుడు పురుషుడు కలసిన,
➡ స్త్రీ స్త్రీ కలసిన,
➡వివాహానికి సంబంధం లేకుండా ఇతర స్త్రీలను/పురుషులను కలసినపుడు,
➡ వివాహ0 అనంతరం ఇతర స్త్రీలతో/పురుషులతో కలసిన,
➡ పురుషుడు పురుషుడు కలసిన,
➡ స్త్రీ స్త్రీ కలసిన,
ఇలాంటి కలయిక పాపముగా ఎంచబడును.
దీనినే జారత్వము, వ్యభిచారం అంటారు వీరికి పరలోకంలో ప్రవేశం లేదు..
కొన్ని సందర్భములు చూద్దాం..
దీనినే జారత్వము, వ్యభిచారం అంటారు వీరికి పరలోకంలో ప్రవేశం లేదు..
కొన్ని సందర్భములు చూద్దాం..
1 కొరింథీయులకు 7:3-5
భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను.
భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి. బార్యభర్తల కలయిక పాపము అయితే వారి వారి ధర్మములు నడపవలెను అని చెప్పకూడదు కదా!

---------------
మలాకీ 2:13-16
మలాకీ 2:13-16
మరియు రెండవసారి మీరాలాగుననే చేయుదురు; యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోను కన్నీళ్లతోను రోదనముతోను తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు, తనకు అనుకూలము కాని అర్పణలను మీచేత తీసికొనకయునున్నాడు. అది ఎందుకని మీరడుగగా, యౌవన కాలమందు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా. కొంచెముగానైనను దైవాత్మనొందినవారిలో ఎవరును ఈలాగున చేయలేదు; ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవునిచేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా; కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసికొని, యౌవనమున పెండ్లిచేసికొనిన మీ భార్యల విషయములో విశ్వాస ఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియయని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నా కసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులుకాకుడి.
మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:
Post a Comment