వ్యబిచారము దాని ఫలితము


వ్యభిచారము

యవ్వనస్తులారా  జాగ్రత్త  కలిగి వుందంది.
      ....♻శరీరకార్యములు

వ్యభిచారము అంటే? 
◆ మోహపు చూపు 
◆ అనైతికమైన లైంగిక ప్రవర్తన 11
◆ అనైతికమైన సెక్స్ 
◆ హోమో సెక్స్ ( పురుషుడు, పురుషునితో చేసే లైంగిక పాపం)
◆ లెస్బినిజం (స్త్రీ, మరొక స్త్రీ తో చేసే లైంగిక 1పాపం)
◆ బూతు బొమ్మలు చూడడం 
◆ అశ్లీల సాహిత్యం చదవడం 
◆ అశ్లీల చిత్రాలు చూడడం ద్వారా పొందే ఆనందం.

సాతాను స్మార్ట్ ఫోన్లను మన చేతికిచ్చి, వాడు చాలా స్మార్ట్ గా వాడిపని వాడు చేసుకొని పోతున్నాడు. ఏదైనా సమాచారం కోసం ఇంటర్ నెట్ ఓపెన్ చేస్తే చాలు. click me, click me  అంటూ అశ్లీల చిత్రాలు  దర్శనమిస్తూనే  ఉంటాయి. పొరపాటున టచ్ చేసామా? అంతే. ప్రమాదంలో పడినట్లే.

అందుకే, నేటి దినాలలో జారత్వము, వ్యభిచారం,  హోమో సెక్స్ ( పురుషుడు మరొక పురుషునితో చేసే లైంగిక పాపం), లెస్బినిజం ( స్త్రీ మరొక స్త్రీ తో కలసి చేసే లైంగిక పాపం) తారా స్థాయికి చేరాయి.

ఇవి ఇప్పుడే ప్రారంభం కాలేదు గాని, నాటి నుండి సాతాను మనుష్యుల బలహీనతను ఉపయోగించు కోవడంలో సంపూర్తిగా సఫలమయ్యా డు. ఇప్పుడు మరింత ముందుకు దూసుకుపోతున్నాడు.

❣అనేక దేశాలలో హోమో సెక్స్, లెస్బినిజం చట్ట బద్దమవుతుంది. 

❣ఇష్టపడి చేస్తే, వ్యభిచారం తప్పేమి కాదంటూ న్యాయ స్థానాలు సహితం తీర్పులు వెల్లడిస్తున్నాయి.
ఈ తీర్పులతో సాతాను ఎగిరి గంతులు వేస్తూ, రెట్టించిన ఉత్సాహంతో మరింత విజృంభిస్తున్నాడు.
వాడి వలలో ఇప్పటికే చిక్కావో? చిక్కడానికి సమీపంలో వున్నావో? నాకైతే తెలియదు గాని, సాతాను నీమీద సంపూర్ణమైన దృష్టి పెట్టి వుంచాడు అనే విషయం మాత్రం మరచి పోవద్దు.

❣జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము. వెళ్లినయెడల పరులకు నీ ¸యౌవనబలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు.
             సామెతలు 5:8,9

❣వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట. 
              సామెతలు ‪23:27‬

❣నీ బలమును స్త్రీలకియ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము.
          సామెతలు 31:3

కానీ, నీవు చెయ్యాల్సింది ఏమిటంటే?
❣నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి.
          సామెతలు 5:18,19
ఇంకా వివాహం కాకపొతే, ఆ సమయం వచ్చేవరకు సాతాను వలలో చిక్కకుండా, నిన్ను నీవు కాపాడుకో. 
అంతేగాని, 

❣వ్యభిచరింపవద్దు.
             మత్తయి ‪19:18‬
పరిశుద్ధ గ్రంధం వ్యభిచారమనే పాపమును అన్ని పాపముల కంటే ఘోరమైన పాపముగా పేర్కొన్నది.
కారణం? 

ఏ పాపమైనా ఒక్కరి వల్లనే జరుగుతుంది. కాని వ్యభిచారము మాత్రము ఒక వ్యక్తి పాపము చేస్తూ మరొకరిని పాపములోనికి లాగుతుంది.
ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. మత్తయి ‪5:28‬
(ఒక పురుషుని మోహపుచూపుతో చూచు ప్రతిస్త్రీ అప్పుడే తనహృదయమందు అతనితో వ్యభిచారము చేసినదగును.) మోహపు చూపుతో చూస్తే, అది హృదయంలో ముద్రించబడి, ఆతప్పుచెయ్యడానికి శరీరాన్ని బలవంతం చెయ్యొచ్చు.

అయితే, నేటి దినాలలో, నూతనమైన, వక్రమైన బోధలు పుట్టుకొస్తున్నాయి. కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచు చున్నారు .... యూదా 1:4
మన మంచి పనులు దేవుని రాజ్యం చేర్చలేవు. కేవలం ఆయన 'కృప' మాత్రమే నిత్య రాజ్యం చేర్చగలదు. కాబట్టి వ్యభిచారం చేసినా తప్పేమి కాదు. దానికి శిక్షేమి
లేదంటూ...
ఆయన కృప మనలను రక్షిస్తుంది. మంటి నుండి తీయబడిన శరీరం మన్నై పోతుంది. ఆత్మ మాత్రమే దేవుని యొద్దకు వెళ్తుంది. కాబట్టి, ఆత్మ పరిశుద్ధంగా వుంటే చాలు. నశించిపోయే శరీరానికి పరిశుద్ధత అవసరం లేదు. అనేది వీరి వక్ర బోధ.
శరీరం మాలిన్యమైపోయాక, ఆత్మ ఎట్లా పరిశుద్ధంగా వుండగలుగు తుంది? అది సాధ్యం కానే కాదు. అందుకే పౌలు గారు ఈ రీతిగా మాట్లాడు తున్నారు.
శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.
          2కొరింధీ 7:1
దేవుని కృపకు కూడా కొన్ని పరిధులుంటాయి. నేనెట్లా జీవించినా దేవుని కృప నన్ను రక్షిస్తుందిలే అనుకోవడం అవివేకం. తప్పు చేసినవాడు ఎంతటి వాడైనా, పశ్చాత్తాప పడకపోతే, శిక్ష అనుభవించ తీరవలసిందే.
సంసోను (న్యాయాధిపతి), దావీదు (రాజు), హొప్ని, ఫీనెహాసు (యాజకులు), సొదొమ గొమొఱ్ఱా ప్రజలు (సామాన్యులు).... ఇట్లా వారెంతటి వారైనా సరే, తప్పించుకోలేక పోయారు.

♻సంసోను పతనం:♻
వ్యభిచారం ఎంతటి భయంకరమైన పరిస్థితి లోనికి నిన్ను నెట్టేస్తోందో సంసోను జీవితాన్ని నీ జ్ఞాపకంలోనికి తీసుకొని రావాలి అనుకొంటున్నాను.
★ ఆ యౌవనుడు దేవుని కోసం ప్రతిష్ట చేయబడిన వాడు.
★ బైబిల్ గ్రంధములోనే అత్యంత బలవంతుడు.
★ కొదమ సింహాన్ని సహితం అవలీలగా చీల్చివేసిన  బలశాలి.
★ 300 నక్కలను పట్టుకొని శత్రువుల పంట పొలాలను నాశనం చేసిన ధీరుడు.
★ పట్టణానికి కావలిగా నున్న ఇనుప గేటును సహితం ఊడబెరికి కొండ మీదకు విసిరి వేయగలిగిన వీరుడు.
★ గాడిద పచ్చి దవడ ఎముకచేత వెయ్యి మంది శత్రువులను చంపిన శూరుడు. ఇట్లా ఎన్నో...!
ఇట్లాంటి ఆ యౌవనుడు, వేశ్యయైన స్త్రీ చేత ఆకర్షించ బడ్డాడు. తద్వారా....
★ శత్రువుల చేతిలోబంధీగా మారాడు.
★ తల వెంట్రుకలు గొరిగించ బడ్డాయి.
★ రెండు కళ్ళూ పెరికి వేయబడ్డాయి
★ దాగోను దేవతకు బలిగా మారాడు.

❣అతని జీవిత ప్రారంభం ఎట్లా వుంది? ఎట్లా ముగిసింది? దానికి గల కారణం? వ్యభిచారమే.


♻ రాజైన దావీదు పతనం 
దేవుని చేత "నా హృదయానుసారుడు" అని సాక్ష్యము పొందినవాడు. ఆయన కూడా ఇదే పాపములో చిక్కుకున్నాడు. దాని ఫలితం?

★ పుట్టిన బిడ్డ చనిపోయాడు.
★ పిల్లలు వ్యభిచారులు, హంతకులయ్యారు.
★ కన్నకొడుకే అతనిని చంపడానికి కంకణం కట్టుకున్నాడు.
★ కనీసం చెప్పులు లేకుండా అతడు కొండలకు పారిపోవలసి వచ్చింది.
★ కుక్క వంటి "షిమి " ఓ దుర్మార్గుడా, నరహంతకుడా! ఛీ! ఫో ...అంటూ దూషిస్తూ, శపిస్తూ వుంటే, మౌనముగా తల వంచాల్సి వచ్చింది.
★ దేవుని పక్షంగా యుద్దాలు చెయ్యడానికి అతనిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రజలు ఇక నీవు యుద్దాలు చెయ్యొద్దని ప్రమాణం చేయించారు.
ఇట్లా... ఎన్నో! ఎన్నెన్నో!

❣గొల్యాతుపై విజయం అతని కీర్తిని పతాక స్థాయికి చేరిస్తే, బత్షెబతో పాపం, పతనం అంచులకు చేర్చింది. 

♻ యాజకుల వ్యభిచారం
ఏలీ కుమారులైన  హొప్ని, ఫీనెహాసు మిక్కిలి దుర్మార్గులయ్యారు. వారు చేసిన ఘోరమైన పాపము ఏమిటంటే?
వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకువచ్చిన స్త్రీలతో శయనించే వారు.    (1 సమూ ‪2:22)‬
❣ఫలితం: ఒకే దినాన్న ఇద్దరూ మరణం.


♻ తుచ్ఛమైన అభిలాష ♻
( హోమో సెక్స్ , లెస్బినిజం)
'హోమో సెక్స్' మగవారు మగవారితో కలసి లైంగిక పాపం చెయ్యడానికి పుట్టినిల్లు సొదొమ గొమొఱ్ఱా పట్టాణాలే. ఆనాడు అక్కడ పుట్టిన పాపమే, ఈనాడు మహా వృక్షమై విచ్చలవిడిగా ప్రపంచమంతా వ్యాపించింది. నూరంతలుగా ఇంకా వర్ధిల్లుతూనే వుంది. సొదొమ గొమొఱ్ఱా పట్టణాలను నాశనం చెయ్యడానికి ఇద్దరు దేవదూతలు ఆ పట్టణములో ప్రవేశించగా, లోతు వారికి ఆతిధ్యమిచ్చుటకు అతని గృహానికి ఆహ్వానించినప్పుడు,
"వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసి లోతును పిలిచిఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా" (ఆది 19:4,5)
బాలురు మొదలుకొని వృద్ధుల వరకు, అదే పాపములో కొనసాగుతున్నారట.

ఫలితం: అగ్ని గంధకాలతో కలసి మాడిపోయారు.
కొంత కాలం రహస్యముగా జరిగిన ఈ పాపం, నేడు బట్టబయలయ్యింది. మాకు నచ్చినట్లుగా జీవించే స్వేచ్ఛ కావాలంటూ, పోరాటాలు చేస్తున్నారు. చట్టాలు చేయించు కొంటున్నారు. వారి విజయం వారిని గమ్యం చేర్చేది కాదు. నిత్య నాశనమునకు నడిపించేది.
ప్రియా నేస్తమా!  లోకం పైశాచిక ఆనందాన్ని కోరుకొంటుంది. వికృత చేష్టలకు అలవాటుపడింది. అక్రమ జీవితం జీవిస్తుంది.

అయితే, ఇట్లాంటి లోకంలో క్రమమైన జీవితాన్ని నీవు జీవించాలి. నీ యవ్వనమందు సంతోషిస్తూనే, వాటన్నిటిని బట్టి తీర్పు వున్నదనే మాట మాత్రం మరచిపోవద్దు. వ్యభిచారులు...అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.  (ప్రకటన 21:8).

క్రీస్తు మరియు ఆయన శిస్యులు బోదలే వ్యబిచారము దాని ఆలోచనలను నియంత్రించగదు..

----------- ౦ -------------

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:

Post a Comment