ఒక సహోదరుడు అడిగిన ప్రశ్న :-
ఇజ్రాయెల్ వారుకి ఒక ప్రత్యేక చట్టం ప్రత్యేక పట్టణము ప్రత్యేక నియమనిబంధనలు వారివి ప్రత్యేక పరిస్థితులు
వారు అవిధేయత చేత బానిసలుగా కొంతకాలము వెళ్లి వెట్టి చాకిరి చేసేవారు మళ్ళీ దేవుడు వారి మోర ఆలకించి వారిని విడుదల చేసేవాడు. వారేమైన తప్పు చేస్తే వారికి మరణశిక్ష వేసే విధమైన చట్టాలు వారివి, వారి పరిచర్య కఠినమైనది. వారి పరిస్థితులకు దేవుడు విశ్రాంతిదినమును 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ఇచ్చాడు.
విశ్రాంతిదినము మనుషులకే, వారి విశ్రాంతి కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు...
6 దినములు కష్టపడి 7వ దినమున పని మానుకోవాలి..
మార్కు 2:27 - విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినముకొరకు నియమింపబడలేదు.
◆ ఇది ఇజ్రాయెల్ ప్రజలకు ఆజ్ఞ
◆ ఉల్లంగిస్తే మరణశిక్ష
క్రైస్తువులకు వచ్చేసరికి విశ్రాంతిదినము ఇశ్రాయేలు వాలే క్రైస్తవులు పాటించవలసిన అవసరము లేదు కారణము?
🔥 క్రీస్తు బోధ:- మత్తయి 17:5
ఇజ్రాయెల్ నిబంధన మందసము పోయిన(యిర్మీయా 3:15,16) తరవాత దేవుడు వారికి మరల నిబంధన చేయదలచాడు ఆ నిబంధన పాతనిబంధన వంటిది కాదు అని దేవుడే చెప్పాడు - యిర్మీయా 31:31-34.
మార్కు సువార్త 12:29-31
అందుకు యేసుప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.
1️⃣ నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును *ప్రేమింపవలె* ననునది ప్రధానమైన ఆజ్ఞ.
2️⃣ రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని *ప్రేమింపవలెననునది* రెండవ ఆజ్ఞ;
👉 "వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను"
ఈ రెండు ఆజ్ఞలను ఆధారము చేసుకునే ఈ అపోస్తులుల బోధ ఉంది..
కాబట్టి విశ్రాంతిదినము చేయుట ముఖ్యమైన ఆజ్ఞ కాదు. కాబట్టి క్రీస్తు దానికి తగిన ఆజ్ఞలు ఇవ్వలేదు..
మత్తయి 12:5: మరియు యాజకులు విశ్రాంతిదినమున దేవాలయములో విశ్రాంతిదినమును "ఉల్లంఘించియు నిర్దోషులైయున్నారని" మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా?
ముగింపు :
★ విశ్రాంతిదినము మనుషులకే వారి విశ్రాంతికొరకే.
★ ఇది ఇశ్రాయేలుకు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ, ఉల్లంగిస్తే (పని చేస్తే), మరణ శిక్ష.
★ క్రైస్తవులకు విశ్రాంతిదినముతో పని లేదు.
★ క్రైస్తవులు 1. దేవుని ప్రేమించాలి, 2. మనుషులను ప్రేమించాలి. వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదు.
★ ఎలా ప్రేమించాలో మనకు అపోస్తులుల బోధ మరియు ఆదిమ సంఘ మాదిరి ఉన్నది, వాటివలన మనము ఏ విధముగా ప్రేమించవలెను నేర్చుకోగలము...
----------- ౦ -----------
మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:
Post a Comment