♻️ పరిశుద్ధ గ్రంథములోని అసాధారణమైన విషయాలలో కొన్ని: ♻️

🔺969 సంవత్సరాలు జీవించిన వ్యక్తి: మెతూ షెల (ఆది 5:27)

🔺రాయిని తలగడగా వాడిన వ్యక్తి: యాకోబు (ఆది 28:11)

🔺ఒక మనిషి చేతులు పైకెత్తడం ద్వారా యుద్దములో విజయం: మోషే ( నిర్గమ 17:11)

🔺గాడిద మనిషితో మాట్లాడడం (సంఖ్యా  22:28-30)

🔺ఒక దినమంతా సూర్యుడు నిలిచిపోవడం (యెహోషువా 10:13)

🔺కుక్క వలే నీళ్లు గతికిన మనుష్యులు (న్యాయాధి 7:5)

🔺12 చేతి వేళ్ళు, 12 కాలి వేళ్ళు గలిగిన వ్యక్తి ( 2 సమూ 21:20)

🔺స్వంత బిడ్డను వండుకొని తిన్న స్త్రీ  ( 2 రాజులు 6:29)

🔺88 మంది పిల్లలుగల తండ్రి ( 2దిన 11:21)

🔺ఎండిన ఎముకలు జీవించుట (యెహెఙ్కేలు 37)

🔺మిడతలు ఆహారముగా తిన్న వ్యక్తి: బాప్తీస్మమిచ్చు యోహాను (మత్తయి 3:4)

🔺ప్రార్ధించినందుకు 15 ఏళ్ళ ఆయుష్షు: హిజ్కియా ( యెషయా 38:1-5)

🔺చేప గర్భములో యోనా మూడు రోజులు సజీవంగా నుండుట ( యోనా 1:17)

👉 అన్నింటికంటేమించి, పాపినైన నా కోసం, పరిశుద్ధుడైన ప్రభువు శరీరాన్ని ధరించి, ఈలోకానికి ఏతెంచడం, నాకు బదులుగా మరణించడం అత్యంత అసాధారణమైన విషయం.

No comments:

Post a Comment