దేవుడొక్కడే


దేవుడొక్కడే

చాలామందికి మతసేకల వారు దేవుడొక్కడే అంటే ఏమిటో అర్థం కాక త్రిత్వమును బోధించి దేవుడొక్కడే అంటే త్రియేకదేవుడు యేసుక్రీస్తు అని చివరికి అలా చెప్పేస్తున్నారు.

దేవత్వవాదులు (వారికి దేవత్వము అంటే ఏమిటో తెలియదు  ఉన్నారు వారైతే దేవుడేవరు అంటే సమాధానం చెప్పేలేక "మనకు దేవుడేవారంటే" అని యెహోవా "మనకు"  దేవుడు అని చెప్పుదురు. "మనకు దేవుడు" అని అనడములో వారి ఉద్దేశ్యము ఏమిటంటే ఇంకో ఇద్దరు దేవుళ్లు ఉన్నారు వారిలో ఒకతను మనకు దేవుడుగా choice ఇస్తారు..

త్రిత్వవాదుల బోధలోకానీ లేక దేవత్వవాదుల బోధలోకానీ ఉన్న విశ్వాసము ముగ్గురు దేవుళ్లులున్నారు వారే - తండ్రైనదేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్త్మ దేవుడు అనే ఒక  ప్రగాఢ విశ్వాసము కలిగియున్నారు. త్రిత్వవాదులైతే "త్రియేకదేవుడు" అందురు, దేవత్వవాదులైతే "మనకు దేవుడు తండ్రి" అని అందురు.  

దేవుడేవరు?
అనేది మనం గ్రంధం వెలుగులో చూద్దాము...

యెహోవా తండ్రి మాటలలో దేవుడేవరు?
● ద్వితియోపదేశకాండము 32:39: ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు

● కీర్తనలు 46:10: ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమిమీద నేను మహోన్నతుడ నగుదును

● యెషయా 45:6: తూర్పుదిక్కునుండి పడమటిదిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొను నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు

యెషయా 43:10: మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.

● యెషయా 45:21: మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియ జేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ జేసినవాడెవడు?చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు?యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు.నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు

● యెషయా 46:9: చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు.


యేసుక్రీస్తు మాటలలో దేవుడేవరు?
● మార్కు 12:26: వారు లేచెదరని మృతులనుగూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడు - నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను.

● యోహాను 17:3: అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.

● మార్కు 12:29: అందుకు యేసుప్రధానమైనది ఏదనగాఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.

● యోహాను 20:17: యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.


భక్తుల మాటలలో దేవుడేవరు?
● ద్వితియోపదేశకాండము 4:39: కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకము నకు తెచ్చుకొనుము

● 1రాజులు 8:60: అప్పుడు లోకమందున్న జనులందరును యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలిసికొందురు.

● 1రాజులు 18:39: అంతట జనులందరును దాని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి.

● కీర్తనలు 100:3: యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము.

● కీర్తనలు 118:27: యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు నను గ్రహించియున్నాడు ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి.

● యెషయా 45:18: ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.

● యిర్మియా 10:10: యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.

● 1యోహాను 5:20: మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్య వంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.

దేవుని సందేశములో కానీ
కుమారుని సందేశములో కానీ
భక్తుల సందేశములో కానీ దేవుడేవారంటే యెహోవానే.


దేవుడు ఒక్కడా? లేక దేవుళ్లు ముగ్గురా?
● 1తిమోతికి 2:5: దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.

● యాకోబు 2:19: దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగునమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.

● 1 కొరింథీ 8:4b, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.

● 1కోరింథీ 12:6: నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే.

● ఎఫెసీయులకు 4:6: అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.
        ◆ యేసుక్రీస్తుకు కూడా తండ్రైన దేవుడు ఒక్కడే
        ◆ అందరికి కూడా తండ్రైన దేవుడు ఒక్కడే.
        ◆ నాకు దేవుడు వేరు మనకు దేవుడు వేరు అని కాదు మనందరికి ఒక్కడే దేవుడు.

గమనిక:- 
ప్రశ్న:   బైబిల్ లో చాలామంది దేవుళ్లుగా అనబడినారు ఉన్నారు వాళ్లు కూడా దేవుళ్లు అవుతారా?
జవాబు: దేవుడు అని ఉన్నంత మాత్రాన దేవుడు అవుతారా? అవ్వరు, కారణం అలంకరముగా దేవుడు అని వాడటం జరిగింది. దేవుడు ఒక్కడే ఆయనే యెహోవా, మిగతావారంతా అలంకరముగా వాడబడినదే కానీ నిజమైన దేవుడు అవ్వదు...

వెలుగు/ఉప్పు అనేది ఒక్కటే, దానిని అలంకరముగా వివిధ రకాలుగా ఎలా వాడుతున్నారో అలానే దేవుడు అన్నది కూడా వివిధ రకాలుగా అలంకరముగా వాడుతున్నారే కానీ దేవుడు అనే మాట యొక్క వాస్తవికత యెహోవాలోనే ఉన్నది. అందుకే యెహోవాయే నిజమైన దేవుడు(యిర్మీయా 10:10).

అద్వితీయ దేవుడు అంటే?
★ ఏకైక దేవుడు
★ ఒంటరి దేవుడు
★ ఒక్కడే దేవుడు

monos: alone
Original Word: μόνος, η, ον
Part of Speech: Adjective
Transliteration: monos
Phonetic Spelling: (mon'-os)
Definition: alone
Usage: only, solitary, desolate.
Word Origin
a prim. word
Definition
alone


యేసుక్రీస్తు మాటలలో ఏకైక దేవుడు యెహోవానే...

ముగింపు :-
◆ దేవుడు ఒక్కడే ఆయనే యెహోవా
◆ యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి
◆ ఆయన మాత్రమే దేవుడు
◆ ముగ్గురు దేవుళ్లు లేరు.
◆ అలంకరముగా పిలవబడిన దేవుళ్లు ఉన్నారు నిజమైన దేవుడు యెహోవానే..
◆ ఒక దేవుడే ఒక తండ్రిగా ఉన్నాడు.

------ ౦ ------

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:

Post a Comment