బాప్తీసము


👉 బాప్తిస్మము 👈

బాప్తిస్మము ఎన్ని రకములు ఉండినను లేక పుట్టినను నేడు ఉన్నది ఒక్కటే బాప్తిస్మము - ఎపేసి 4:5
రోమీయులకు 6:3: క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?


బాప్తిస్మము అంటే అర్ధమేమి?
బాప్తీసము అనేది గ్రీకు బాషాలో - G908 strong

baptisma: (the result of) a dipping or sinking
Original Word: βάπτισμα, ατος, τό
Part of Speech: Noun, Neuter
Transliteration: baptisma
Phonetic Spelling: (bap'-tis-mah)
Definition: (the result of) a dipping or sinking
Usage: the rite or ceremony of baptism

◆ తెలుగులో ముంచుట అని అర్ధం వచ్చును.
బైబిలు, బాప్తిస్మాన్ని పాతిపెట్టడంతో పోలుస్తుంది. 
           ● రోమీయులకు 6:3,4; 
           ● కొలొస్సయులకు 2:12
           ● కొలసి 2:20-21  చూడుము..

నీటి బాప్తిస్మం, ఒక వ్యక్తి తన పాత ప్రవర్తన విషయంలో చనిపోయి, దేవునికి సమర్పించుకున్న వ్యక్తిగా కొత్త జీవితం మొదలుపెట్టడాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు బలిమీద విశ్వాసం ఉంచుతూ, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, దానికి తగిన అర్హతలు సంపాదించడం ద్వారా, మంచి మనస్సాక్షి పొందే అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. (1 పేతురు 3:21) అందుకే, తన శిష్యులవ్వాలనుకునే వాళ్లందరూ తప్పకుండా బాప్తిస్మం తీసుకోవాలని యేసు చెప్పాడు. — మత్తయి 28:19, 20.


బాప్తిస్మము ఒక ఆజ్ఞ/మాదిరి.
★ మార్కు 16:16: నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.

★ మత్తయి 3:15: యేసుఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను.

★ బాప్తిస్మము పొందుటలో ఆదిమ సంఘము మనకు మాదిరిగా ఉన్నది...


క్రీస్తు బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి?
1. రక్షణ కొరకు - మార్కు 16:16
2. పాపక్షమపన కొరకు - అపో.కా 2:38
3. క్రీస్తు రాజ్యములో చేరుటకు - యోహాను 3:1-3
4. నూతన సృష్టి అగుటకు - యోహాను 3:3
5. క్రీస్తు సంఘములో చేరుటకు - అపో.కా 2:47
6. క్రైస్తవుడు అగుటకు  - 1 పేతురు 4:16
7. పరలోక ఆశీర్వాదములు పొందుటకు - ఎపేసి 1:3
8. లోకానికి వెలుగుగా ఉండుటకు - ఎపేసి 5:8.
9. పరలోకము చేరాలంటే బాప్తిస్మము పొందాలి.


బాప్తీసము ఎలా తీసుకోవాలి?
వినాలి
క్రీస్తును గూర్చిన సువార్త వినాలి -అపో. కా 15:7; రోమా 10:17; ఎపేసి 1:13.

★ విన్న సువార్తను విశ్వసించాలి - ఎపేసి 1:13; అపో.కా 15:7.

★ విశ్వసించి మారుమనస్సు పొందాలి -అపో.కా 2:38; లుకా 5:32.

ఒప్పుకోలు చేసుకోవాలి.
● యేసును ప్రభువు అని ఒప్పుకోవాలి  - రోమా 10:9-10
● యేసుక్రీస్తు దేవునికి కుమారుడని - అపో.కా 8:36
● పాపములను ఒప్పుకోవాలి - మార్కు 1.5

బాపిస్మము పొందాలి - మార్కు 16:16.


బాప్తిస్మము ఎక్కడ తీసుకోవాలి?
విస్తారముగా నీళ్లున్న చోట తీసుకోవాలి.

◆ అపొ. కా 8:36 - వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడుఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను.

◆ మార్కు 1:5: అంతట యూదయ దేశస్థు లందరును, యెరూషలేమువారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండి.


బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి?
ఆ గడియలోనే తీసుకొనవచ్చును.

అపొస్తలుల కార్యములు 16:30-33
వారిని వెలుపలికి తీసికొనివచ్చి అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారుప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి.

అపో.కార్యములు 8:36: వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడుఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను.


బాప్తిస్మము ఎవరు తీసుకోవాలి?
1. గ్రహింపు కలిగిన వయస్కులు తినుకోవాలి.
2. లేఖననుసారమైన బోధలో లేనివారు తీసుకోవాలి.

1️⃣ గ్రహింపు కలిగిన వయస్కులు తీసుకోవలెను.
బాప్తిస్మము కావాలనే వెదికే వ్యక్తి వయస్సును బైబిల్ నిర్ధారించలేదు. అయితే యేసు 12 ఏండ్ల ప్రయములో దేవలయమునకు వెళ్ళాడు(లుకా2:42) చాలామంది చిన్న పిల్లలకు బాప్తిస్మము ఇస్తా ఉంటారు, అలాగైతే ఆయన 12వ ఏటే బాప్తిస్మము పొందగలిగేవాడు కానీ 30వ ఏటా కాదు..

బాప్తిస్మము వయసుకు సంబంధించినది కాదు గ్రహింపుకు సంబంధించినది. 
చిన్నపిల్లలకు, మతిస్థిమితం లేనివారికి గ్రహింపు ఉండదు, వారేమి చేయుచున్నారో, వారేమి ఎరుగుచున్నారో వారికి తెలియదు...

గ్రహింపుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు:
1. నీవెందుకు బాప్తీసము పొందుతున్నావ్?
2. నీవు పాపివని నీకు తెలుసా? పాపము అంటే ఏమిటో తెలుసా?
3. నీ పాపములను బట్టి నీవు దేవుని యొద్ద నుండి వేరుచేయబడివని నమ్ముచున్నవా?
4. యేసు నీకు ఎవరని నమ్ముతున్నావ్?
5. దేవుడు నీకు ఎవరని నమ్ముతున్నావ్?
6. నేడు నీవు చనిపోతే పాపిగానే చస్తవా?
7. నీ పాపము క్షమాపణ కొరకు నీవు ఏమి చేయాలి?
8. నీవు బాప్తిస్మము పొందినపుడు యేసుక్రీస్తును ఏమని అంగీకరిస్తావ్?
9. నీవు బాప్తీసము పొందినపుడు ఎవరి సంఘములో ప్రవేసిస్తావ్?
10. నూతన జీవితాన్ని ఆరంభించుటకు నీవు సిద్ధముగా ఉన్నవా?

తను పాపినని గుర్తించిన వ్యక్తి పాపములను బట్టి తను దేవుని యొద్ద నుండి తను వేరుచేయబడినట్టు గ్రహిస్తాడు. యేసు ప్రభువని రక్షకుడని, ఎవరి రక్తము పాపములను క్షమింపగలదో, ఆ ప్రభువైన యేసును వెంబడించదములో, అతడు తన జీవితమును మార్చుకోనుటకు ఇష్టపడినట్లైతే, అప్పుడు ఆయన బాప్తిస్మము పొంద సిద్ధముగా ఉన్నాడని గ్రహించవచ్చును..

2️⃣ లేఖననుసారమైన బోధలో మతసేక విశ్వాసములో ఉన్నవా? బాప్తిస్మము తీసుకోవలెను..
బాప్తీసము మరల ఎందుకు పొందాలి అంటే నీ గత విశ్వాసము లేఖననుసారమైన విశ్వాసము లేనిచో తప్పక బాప్తిస్మము పొందవలెను..

1. బాప్తీసము పొందినపుడు నీ వయస్సంతా?
2. నీకు బాప్తిస్మము ఇచ్చిన సువర్తికులు ఏ మతశేఖకు చెందినవాడు?
3. నీ స్థానిక సంఘము ఎదుట ఎలాంటి ఒప్పుకోలు చేసావు?
4. నీవు బాప్తీసము ఎందుకు పొందవ్?
5. యేసు ఎవరని నమ్మి బాప్తీసము పొందవ్?
6. బాప్తీసము ఎన్ని రోజులకు వేచి తీసుకున్నావ్?
7. బాప్తీసము ముంచబడ్డవా? లేక చిలకరింపబడ్డవా?


బాప్తిస్మము నందు జరిగు మార్పులు :
★ స్థితి యొక్క మార్పు :
1. నశించిన దాని నుండి రక్షింపబడిన దానిలోనికి - 1 పేతురు 3:21.
2. పాపా భరితమైన స్థితి నుండి పాపములు కడగబడిన స్థితికి మార్పు - అపో.కా 22:16.
3. దోష భరితమైన స్థితి నుండి పాపములు క్షమింపబడిన స్థితిలోకి మార్పు - అపో.కా 2.38; కొలసి 2:12-13.

★ స్థానములో మార్పు :
మునుపు మన స్థానము దూరస్తులము ఇప్పుడు సమీపస్తులము - (ఎఫెసీయులకు) 2:12,13
ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడు లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.

★ సేవకత్వపు మార్పు

★ బంధవ్యములో మార్పు

★ బ్రతుకులో మార్పు


ముగింపు:-
క్రీస్తులో నీ జీవితమును కొనసాగించ ఇచ్చా కలిగియన్నవా?  ఇంతగొప్ప అవకాశం మరల రాదు సోదరా - 2కోరింథీయులకు 6:2 - ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. నిర్లక్ష్యం చేయక బాప్తిస్మము నొంది రక్షింపబడు..

--------- ౦ ---------

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:

Post a Comment