సంఘములో వాయుద్యములు, చపట్లు, నాట్యము ఎందుకు ఉపయోగించరాదు?



               వాయుద్యములకు ములపురుషుడు యూబాలు - ఆది 4:21 - ఇతను కయిను సంతతి.
ఆది పితరులు ఎక్కడ కూడా వాయుద్యములు వాడినట్టు మనకు గ్రంధములో లేదు. ఆ అంశం ప్రాముఖ్యమైనది కాదు కాబట్టి లికించబడలేదు..

మోషే యుగములో వాయుద్యముల అవసరం దేనికి?:-
గమనించాల్సిన విషయం :-
పాత నిబంధనలో రాజులు వేరు యాజకులు వేరు
ఉజ్జాయి సందర్భము - 2వ దిన 26:16-23 చదువుము..
రాజు చేయవాలినవి లేవీయుడు చేయకూడదు,
లేవీయుడు చేయవాల్సినవి రాజు చేయకూడదు..

       👉 లేవీయులకు ఈ పరిచర్య ఇవ్వబడినది.
1దినవృత్తాంతములు 23:3,4,5
అప్పుడు లేవీయులు ముప్పది సంవత్సర ములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు కవిలెలో చేర్చబడిరి; వారి సంఖ్య ముప్పది యెనిమిది వేల పురుషులు. ​వీరిలో ఇరువది నాలుగువేలమంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను,ఆరు వేలమంది అధి పతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి. నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. "మరినాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి".
ఇది కూడా సంవత్సరమునకు ఒకమరే చేయుదురు, వారం వారం చేసే ప్రక్రియ కాదు.

       👉 దేవుడే నియమించాడు:-
2 దిన 29:20-30 - పాతనిబంధన ఆరాధన
మరియు దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శియైన గాదును ప్రవక్తయైన నాతా నును చేసిన నిర్ణయముచొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటుచేసెను. ఆలాగు జరుగవలెనని యెహోవా తన ప్రవక్తలద్వారా ఆజ్ఞాపించి యుండెను. వాయుద్యముల వలన స్తుతి గానము ఆరంభమైనది..
దహనబలి సమయములో కత్తి ఎత్తడములో ఆరంభమై దహనబలి ముగింపుతో వాయుద్యములు ఆగిపోతాయి..
--

క్రీస్తుయుగనికి సంబంధించిన ఆరాధన :-

         ఈ క్రొత్త నిబంధన పాతనిబంధన వంటిది కాదు అని పాత,క్రొత్త నిబంధనలలో చెప్పాడు(యిర్మీయా 31:32). ఈ క్రొత్తనిబంధనలో  నియమములో రాజు మరియు యాజకుడు ఒక్కడే అయే నియమము ఈ క్రొత్త నిబంధన నియమము.

రాజులైన యాజకులు రెండు ధర్మాలు ఒక్కడే చేయవచ్చు...
దీనినే మెల్కిసేదెకు క్రమము అంటారు..
మెల్కిసేదెకు రాజు+యాజకుడు (హెబ్రీ7 ; ఆది14)
🌹మెల్కిసేదెకును పోలిన వేరొక యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు.. 🌹
హెబ్రీయులకు 7:11,12
ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మ శాస్త్రమియ్యబడెను గనుక ఆ యాజకులవలన సంపూర్ణ సిద్ధి కలిగినయెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక "యాజకులు మార్చబడినయెడల అవశ్యకముగా యాజక ధర్మము సహామార్చబడును."
యజక ధర్మము మారిపోయింది కాబట్టి ఆ సంగతులు మరుగున పడినట్టే..
     - బలి ఇచ్చే జంతువులు లేవు
     - పాటలు పాడే యాజకులు లేరు
     - వాయుద్యములు వాయించే యాజకులు లేరు
     - పాత నిబంధన పద్ధతి గల ఆరాధనే లేదు.
     - మనం ఆ ధర్మశాస్త్ర యజకులము కాము..

🎸 మనం(క్రైస్తవులు) ఇచ్చే బలి ఒకటి ఉంది 🎸
                  -- హెబ్రీ 13:10-15 --
కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.
దేవుని ఆజ్ఞానాలలో ఒక హెచ్చరిక ఉన్నది దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే అదే చేయాలి తప్ప వేరొక సాహసం చేయకూడదు..

👉         లేవీయకాండము 10:1,2
అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి.
★ దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే అదే చేయాలి. లేదు నేను ఇంకొక అగ్ని వేస్తాను అది దినికన్న బాగా మండుతుంది అని సాహసం చేస్తే పైన పట్టిన గతే పడుతుంది...

👉 నోవహును దేవుడు ఓడను చితిసారపు మ్రానుతో అను చెప్పునప్పుడు వేరే మ్రానును ఉపయోగించకూడదు అని అర్ధం.. 


వాయుద్యములు వాడుటలో క్రొత్తనిబంధన సందేశము:-

✔️ ఎఫెసీయులకు 5:19
ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను(hymns) ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు,

✔️ కొలొస్సయులకు 3:16
సంగీతములతోను(hymns) కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.

సంగీతములో వాయుద్యసంగీతం, గాత్రసంగీతము అని. రెండు రకములుగా ఉండును పై వచనములలో సంగీతము అంటే గాత్ర సంగీతము అని అర్ధం, గాత్ర సంగీతము గురించి మాట్లాడిన సందర్భములు అవి.

Hymn - గాత్ర సంగీతము.
Strong's g5215
- Lexical: ὕμνος
- Transliteration: humnos
- Part of Speech: Noun, Masculine
- Phonetic Spelling: hoom'-nos
- Definition: a hymn, sacred song, song of praise to God.
- Origin: Apparently from a simpler (obsolete) form of hudeo (to celebrate; probably akin to aido; compare abowt); a "hymn" or religious ode (one of the Psalms).
- Usage: hymn.
- Translated as (count): hymns (2).

మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంధం వరకు ఎక్కడ కూడా వాయిద్య సంగీతం వాడినట్టు ఒక్క చోట కూడా లేదు..
              ➡️   మత్తయి 26:30
              ➡️   మార్కు 14:26
              ➡️   అపో 16:25
              ➡️   రోమా 15:9
              ➡️   1 కోరింది 14:15
              ➡️   1 కోరింది 14:6 (నిర్జీవ వస్తువులు)
              ➡️   హెబ్రీ 2:12
              ➡️  యాకోబు 5:13
              ➡️   ప్రకటన 5:9
              ➡️   ప్రకటన 14:3
              ➡️   ప్రకటన 15:3

దేవునికి ఎలాంటి ఆరాధన అంటే ఇష్టం ?
యోహాను సువార్త 4:23-24
అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను , సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు;(మూలభాషలో-వెదుకుచున్నాడు). 
దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.

      👉 నృత్యాలు చేస్తూ ఆరాధన చేస్తారు వారి కోసం:-
ఫిలిప్పీయులకు 3:3 - ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవుని యొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసికొనవచ్చును; మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసికొనదలచినయెడల నేను మరి యెక్కువగా చేసికొనవచ్చును. 

     👉 చపట్లు కొడుతూ ఆరాధన చేస్తారు వారికోసం:-
అపో.కార్యములు 17:25 - ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు
మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.


ఈ విధానములు ఇజ్రాయెల్ చట్టములు క్రైస్తవులవి కావు:-
కీర్తనల గ్రంథము 81:1-4
మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్యనాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము.

                             ------- 0 --------

మీ 
సహోదరుడు

Brother Suresh
9581881880

No comments:

Post a Comment